మల్లెల శ్ర వణి
• సొగసైన సిగపైన మల్లెలా సిరిమల్లెలా
శ్రావణ మాసంలో పలికిన వీణ
మానసవీణ ఓ శ్ర వీణ
వీణ ఓ శ్ర వీణ.
• నా చేతి పద విన్యాసాలు
నీ చేత అజంతా శిల్పాలవుతుంటే
నీ చిత్రలేఖనం సుందరం బహు సుందరం
• నా కలము లోని పద కావ్యాలు
నీ కంఠ శ్రవణ రాగాలవుతుంటే
నీ స్వరలాపనం వందనం బహు వందనం
• సొగసైన సిగపైన మల్లెలా సిరిమల్లెలా
శ్రావణ మాసంలో పలికిన వీణ
మానసవీణ ఓ శ్ర వీణ.
వీణ ఓ శ్ర వీణ
• ఇది కలయో మాయో తెలియడం లేదు
నీలాకాశం లో దాగిన శ్రావణి సంజీవని.
• నా పదం నీ స్వరం కలిసి
వెండి వాకిట్లో నాట్యమాడుతుంటే
• ఈ వసంతపు వెన్నెల్లో
నా నీడలా నువు కనిపిస్తున్నావు.
• ఇక కాలం పిలుస్తుంది
దూరం కలుస్తొంది
• నవ జీవని శ్రావణి
నీ మనసు ప్రేమ వని.
• సొగసైన సిగపైన మల్లెలా సిరిమల్లెలా
శ్రావణ మాసంలో పలికిన వీణ
మానసవీణ ఓ శ్ర వీణ.
వీణ ఓ శ్ర వీణ
వని = వనము, అరణ్యము
యడ్ల శ్రీనివాసరావు 12 August 2:00 AM.
No comments:
Post a Comment