ఏమి చెప్పేది శివ _ ఏమి రాసేది హర
• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర
• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర
• శివుని తత్వము ఎరిగిన జన్మమే
శివుని పాదము చేరు మార్గము.
అది యే జీవుని కి సన్మార్గము.
• శివుని చూచుట ఏ జన్మ వరమో
శివుని కొలుచుట ఏ కర్మ ఫలమో
అది యే జీవుని కి భాగ్యప్రదము.
• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర
• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర
• ఆత్మ నెరుగని వానికి
ఆనందం ఎట్లు తెలిసే
• పరమాత్మ నెరుగని వానికి
పరమానందం ఎట్లు కలిగే.
• ఆత్మ పరమాత్మ ల నెరుగని
వానికి తానెవ్వరో ఎట్లు తెలిసే.
• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర
• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర
• చూడలేని వానికి శివుడు కానరాడనే
కాని శివుడు లేడని కాదు.
శివుడు రాడని కాదు.
• ఇహలోక మోహలకు బానిసలైన
పరలోక దివ్యం ఎట్లు పొందును.
ఆది మూలం ఏల తెలియును.
• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర
• ఏమి చెప్పేది శివా…. ఏమి రాసేది హర
• దేహమే లేనట్లు దేహి అయిన నాడు
శివుని దర్శనము తో ముక్తి కలుగును.
జనన మరణాల నుండి విముక్తి కలుగును.
• శివుని చేరాలంటే శిల పూజ కాదు
ఆత్మ శుద్ధి తో నే సాధ్యం.
పరమాత్మ ప్రీతి తో నే సుసాధ్యం.
యడ్ల శ్రీనివాసరావు 24 Aug 2022 11:30 AM.
No comments:
Post a Comment