శివుని ఆట పాట
• ఏమి ఆట శివ ఇది ఏమి పాట శివ
ఏమి ఆట శివ ఇది ఏమి పాట శివ
• శివ శివ అని పిలువగ శివమెత్తె నా స్వయం
హర హర అని అరవగ హరియించె నా అహం
• శివ శివ అని పిలువగ శివమెత్తె నా స్వయం
హర హర అని అరవగ హరియించె నా అహం
• శివ స్వరం లోని వరం రాగమై
నను తాకగ అనురాగం కురిసెను.
• హర ధ్వనం లోని జపం గానమై
నను తాకగా ఆనందం విరిసెను.
• ఏమి ఆట శివ ఇది ఏమి పాట శివ
ఏమి ఆట శివ ఇది ఏమి పాట శివ
• శివ శివ అను పలుకు కి
క్రోధము కరిగి కరుణగా మారే.
• హర హర అను పదము కి
మోహము మరిచి మోక్షము మిగిలే.
• ఏమి ఆట శివ ఇది ఏమి పాట శివ
ఏమి ఆట శివ ఇది ఏమి పాట శివ
• శివ శివ అని పిలువగ శివమెత్తె నా స్వయం
హర హర అని అరవగ హరియించె నా అహం
• మేళతాళముల తో
శివ నామమే చేయగా
చిద్విలాసము న
పవళించే కైలాస వాసా.
• జలము పోసిన లింగము
జగము కే శరణమయిన
కొలువు చేసిన కాలుడు కిి నే
జంగమయ్యే …. సత్సంగమయ్యే.
• ఏమి ఆట శివ ఇది ఏమి పాట శివ
• ఏమి ఆట శివ ఇది ఏమి పాట శివ
యడ్ల శ్రీనివాసరావు 26 August 2022 9:30 PM.
శివమెత్తు = ఆవేశముగ
స్వయం = ఆత్మ
ధ్వనం = శబ్దం
జపం = వేదం, మంత్రం
మోహము = అజ్ఞానం
మోక్షం = జ్ఞానం, విముక్తి
కాలుడు = శివుడు, యముడు, శనైశ్చరుడు.
జంగమ = శూద్ర జాతి లో శివభక్తుడు.
No comments:
Post a Comment