ఏమి చేసేది శివా_ఏమి ఇచ్చేది హర
• శివా…ఓ శివా…
• సర్వం నీవు స్మరణం నీవు
సకలం నీవు సదనం నీవు
• ఏమి భాగ్యము నీ కీర్తన
ఏమి భోగము నీ రాగము
• శివ శివ అను నీ పిలుపు కి
నా దేహం లోని నవ నాడులు
బంగారు తీగలై కాంతు లీనుతుంటే
ఆ తీగలతో నీ కాలి గజ్జె నై కానా.
• హర హర అను నీ పిలుపు కి
ఈ లోకం లోని పంచ భూతాలు
పరవశం తో ప్రకృతై ప్రణమిల్లు తుంటే
ఆ ప్రకృతితో నీ కాలి అందె నై రానా…
• ఏమి చేసేది శివ ఏమి ఇచ్చేది హర
• ఏమి చేసేది శివ ఏమి ఇచ్చేది హర
• చేయుటకు స్మరణ తప్ప నా కేమి ఎరుక
• ఇచ్చుటకు దేహము తప్ప నే నేమి కలుగ
• ఏమి చేసేది శివ ఏమి ఇచ్చేది హర
• ఏమి చేసేది శివ ఏమి ఇచ్చేది హర
• నిజము కాని ఈ లోకం లో నేనెందుకు శివ
• నిజమైన నీ లోకానికి దారి చూపు హర
• శివా…ఓ శివా…
• సర్వం నీవు స్మరణం నీవు
సకలం నీవు సదనం నీవు
• ఏమి భాగ్యము నీ కీర్తన
ఏమి భోగము నీ రాగము
• రేయి పగలెరుగక మది తలపులో
నీ జాడ కోసం వెతుకుతునే ఉన్నా
జాడ ఎరుగని నాకు మరణమే శరణం
నీ నీడ తాకని నా జన్మమే వ్యర్ధము.
• ఏమి చేసేది శివ ఏమి ఇచ్చేది హర
• ఏమి చేసేది శివ ఏమి ఇచ్చేది హర
యడ్ల శ్రీనివాసరావు 17 August 2022 8:00 PM.
No comments:
Post a Comment