Sunday, August 21, 2022

234. అర్థనారీశ్వరుడు

 

అర్థనారీశ్వరుడు


• శ్రీ శైల  నందీశ్వరా  

  అభయ మిచ్చు  అమరేశ్వర

• నల్లమల  మల్లీశ్వర 

  జ్ఞానరూపి  జ్యోతిర్లింగేశ్వర


• బంధాల  అడుగుల తో  మడుగులో 

  ముంచేటి  నటరాజ రాజేశ్వర

• దుఃఖాల  దహనం తో  ఆత్మ మలినాన్ని 

  కడిగేటి  కర్మ కాల  కాళేశ్వర


• ఆవాస   సాహసం   నివాసి యోగం

• సంసార  సాగరం   జీవన్ముక్తి సోపానం


• శ్రీ శైల  నందీశ్వరా 

  అభయ మిచ్చు  అమరేశ్వర

• నల్లమల  మల్లీశ్వర 

  జ్ఞానరూపి  జ్యోతిర్లింగేశ్వర


• అర్థాంగి  అంటే   జీవన రేఖకు 

  తోడుగా  నిలిచే  చిత్రాంగి  అని

• అర్ధనారీశ్వరుడు  అంటే    ఆ 

  తోడుకు  నీడగా  నిలిచే ఉండే  వాడని


• కళ్యాణం   చేస్తావు     కోటిలింగేశ్వర

• కమనీయం  అంటావు    కేదారేశ్వర


• శ్రీ శైల  నందీశ్వరా 

  అభయ మిచ్చు  అమరేశ్వర

• నల్లమల  మల్లీశ్వర 

  జ్ఞానరూపి  జ్యోతిర్లింగేశ్వర


• స్త్రీ పురుష   సంయోగం   సయోగం 

  ప్రకృతి  పరవశం

• ముడి పడిన  బంధాల   ప్రయాణం 

  బుణ  కర్మ పాశం

• ఆది అంతాల   నాటక మింతే గా    అర్ధనారీశ్వర

• నీలి మేఘాల   జీవిత మింతే గా    జ్ఞాన యోగీశ్వర


• ప్రాణనాధేశ్వర     భూతనాధేశ్వర

• సకల జీవేశ్వర    ఆత్మ భువనేశ్వర


• ఓం…..


• శ్రీ శైల  నందీశ్వరా 

  అభయ మిచ్చు  అమరేశ్వర

• నల్లమల   మల్లీశ్వర 

  జ్ఞానరూపి  జ్యోతిర్లింగేశ్వర


యడ్ల శ్రీనివాసరావు 21 August 2022 11:00 PM.









No comments:

Post a Comment

726 . సత్యం

  సత్యం • భగవంతుని వైపు అడుగులు వేస్తూ పయనం సాగిస్తూ ఉంటే సత్యమే స్పష్టం గా  కనపడుతుంది. సత్యమే తెలుస్తుంది. సత్యమే మాట్లాడడం జరుగుతుంది . ఎ...