Wednesday, August 10, 2022

228. రాఖీ పౌర్ణమి

 

రాఖీ పౌర్ణమి


• అన్నా చెల్లెళ్ళ   బంధం 

  మనిషి  జన్మ కొక   అందం

• ఆడే  ఆటలతో    పాడే  పాటలతో  

   సాగేను   ఆ   బాల చందం


• అన్నా చెల్లెళ్ళ   బంధం 

  మనిషి  జన్మ కొక  అందం

• ఆడే  ఆటలతో    పాడే  పాటలతో  

  సాగేను  ఆ  బాల చందం.


• గిల్లి కజ్జాలతో     గోల కేరింతలతో   

   ఎగసి  పడే    ఆ ఆనందం.

• రాగద్వేషాలు   పెంచుకొని 

  పంచుకొనే   తొలి  బాల్య బంధం.


• పసి హృదయాలను   పసిడి గా  చేసే 

  పసుపుపచ్చ ని   బంధం.

• మలి హృదయాలకు  

  మూలం  మరవ నివ్వని   సంబంధం.


• అన్నా చెల్లెళ్ళ   బంధం 

  మనిషి జన్మ కొక  అందం.

• ఆడే  ఆటలతో    పాడే పాటలతో 

  సాగేను   ఆ  బాల చందం.


• అమ్మ ను   “మించి” న   అమ్మే  సోదరి ...

  భావోద్వేగాల  తోడుకు  సహ దరి.

• నాన్న ను   “మించ“ ని   నాన్నే  అన్న …

  భావోద్వేగాల  నడుమ  నలిగే వాడు.


• కష్టసుఖాలకు    నేనున్నా నని 

  నిలిచేటి   అనుబంధం.

• నిలవలేని   ఎన్నో బంధాలకు 

  అతీతమైన  దీ  ఈ  రక్తసంబంధం.


• అన్నా చెల్లెళ్ళ   బంధం 

  మనిషి   జన్మ కొక  అందం.

• ఆడే  ఆటలతో    పాడే  పాటలతో  

  సాగేను   ఆ  బాల చందం.


• ఒకరికి  ఒకరు  రక్షణ 

  అదియే  పరిరక్షణ.

• తృణము   పణము  బుణము

  అదియే  రక్షాబంధానికి  సంరక్షణ


• శ్రావణ శుభ తరుణం లో 

  నిండు అనురాగపు వెన్నెల ఈ రాఖీ పౌర్ణమి.


ప్రకృతి సిద్దాంతం ప్రకారం , స్త్రీలు స్వతహాగా ప్రేమతో భావోద్వేగాలను నియంత్రణ చేసే శక్తి కలవారు.

పురుషులు భావోద్వేగాలను నియంత్రణ చేసుకోలేక స్త్రీలపై ఆధారపడేవారు.



నాటి కాలంలో బంధాలు బంగారం లా ఉండేవి.

నేటి కాలంలో బంధాలు బరువై "పో  తున్నాయి".

బంధాలను అందంగా చూసుకుంటే నే ఆనందం మిగులుతుంది.  

రక్త సంబంధాలను  ప్రాణం ఉన్నంతవరకూ  ప్రేమించండి. రక్త సంబంధం  కాని  బంధాలను గౌరవించండి. 


ఈ సృష్టిలో  ప్రతీ మనిషి  "బంధం"  ఏదో ఒక కర్మతో   ముడిపడిన  బుణానుబంధం.   

బుణం ఏమిటో తెలుసుకొని  తీర్చుకునే వారు అదృష్టవంతులు. లేకుంటే  జన్మ జన్మల కి వడ్డీ పెరుగుతునే ఉంటుంది.  

ఇంతకీ ఆ బుణం ఏమిటి అనేది బుద్ధి, మనసు, ఆత్మ కే తెలుస్తుంది.


రక్షాబంధనం అంటే అసలు అర్థం,  ఈ ప్రపంచంలో మనుషులందరూ పరమాత్మ పిల్లలు. ఈ పిల్లలు అందరూ కూడా పరమాత్మ దృష్టిలో సోదర సోదరీమణులే.   తన పిల్లలకు రక్షణగా ఉన్నానని పరమాత్మ తన బంధాన్ని పిల్లలకు  తెలియచేసే పండుగ. పిల్లలు పరమాత్మ ని మరచి పోయి ఇహలోకంలో మాయలో చిక్కుకొని రక్షణ కరువై  విలవిలలాడుతూ ఉంటారు. అది జ్ఞప్తికి చేసేదే రక్షాబంధనం....అదే రాఖీ పౌర్ణమి.... పరమాత్మ చంద్రుని నిండు వెన్నెల తో ఈ పౌర్ణమి నాడు తన రక్షణను వెలుగు లా సమస్త ప్రాణులకు ఇస్తాడు. మనిషి చేయవలసింది ఒక్కటే పరమాత్మ ను గుర్తించి ఆ బంధం నిలబెట్టుకోవడం.


ఈశ్వర అనుగ్రహం 🙏

యడ్ల శ్రీనివాసరావు 11 August 2022  1:00 AM.






No comments:

Post a Comment

568. బాల్యం తీపి

  బాల్యం తీపి  • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు ‌  బాల్యం    తీపి   పసి బాల్యం   తీపి. • చిన్న చిన్న    పాదాలకు   తెలియదు   ప్రాయం  ...