శ్రావణి గీతం
• శ్రావణి సంగీత సారంగిని
సరిగమల శ్రవణానందిని
• శ్రావణి సంగీత సారంగిని
సరిగమల శ్రవణానందిని
• గమకాల సొగసులతో గీతిక లాడే గాయనీ
• పదములకు శృతి కలిపిన
• కవితలకి లయ తెలిపిన
• పాడే నీ గానం అమృత వర్షం
• పలికే నీ రాగం సెలయేటి జలపాతం.
• శ్రావణి సంగీత సారంగిని
సరిగమల శ్రవణానందిని
• నా పరిచయాన పలకరింపులు
నీకు పదనిసలు గ మారితే
• నీ పరామర్శల ప్రాసలు
నా ఛందస్సు కి భాస యై
• పూచెను ఈ కావ్యపుష్పం
వీచేను నీ గాన పరిమళం
• శ్రావణి సంగీత సారంగిని
సరిగమల శ్రవణానందిని
• రచన సిగ్గు పడుతుంది
రత్నమే పాడుతున్నందుకు
• కలము ఎగసి పడుతుంది
కంఠమును కమలం గా చేసేందుకు
• నిను తాకిన సీతాకోకలు
సముద్రాలు దాటొచ్చి స్వరాలను వినిపిస్తుంటే.
• వాటి రంగులు నా మనసుకి
హంగులై హరివిల్లు నిలయమై నిలిచింది.
• ధృవతార గానానికి
ధృవతీరాలు కలిసాయి
• శ్రావణి సంగీత సారంగిని
సరిగమల శ్రవణానందిని
యడ్ల శ్రీనివాసరావు 14 August 2022 5:00 AM.
No comments:
Post a Comment