అడుగుల _ చూపులు
• కలిసాయి కలిసాయి
నీ అడుగుల్లో నా అడుగులు
• కలిసాయి కలిసాయి
నీ చూపుల్లో నా చూపులు
• ఆడగక నే అడుగుతున్నా
నీ అడుగు లో మడుగై ఉంటానని
• చూడక నే చూస్తున్నా
నీ కంటిపాప న నా రూపాన్ని.
• తడబడే నీ అడుగులకు తోడై నే రా నా
• జడిపడే నీ చూపులకు నీడై నే లే నా
• చూడవే … ఇటు చూడవే …. మాటాడవే
• చూడవే … ఇటు చూడవే …. మాటాడవే
• మౌనం తో వేసే నీ అడుగుల ను ఏమని అడగాలి
• భారం గా చూసే నీ చూపుల లో ఏమి చూడాలి
• కలిసాయి కలిసాయి
నీ అడుగుల్లో నా అడుగులు
• కలిసాయి కలిసాయి
నీ చూపుల్లో నా చూపులు
• చూడు చూడు నా చూపులతో
ఈ అందమైన లోకం లో దాగిన నీ అందాన్ని
ఈ పువ్వులు సరితూగ గలవా
నీ నవ్వుకి వెల కట్టగలమా
• ఆగి ఆగి నా తో అడుగులెయ్యి
ఈ సుందర వనమే అడుగును నీ వయ్యారాన్ని
ఈ గువ్వలు కన్నార్ప గలవా
నీ మువ్వల సడి నాపగలమా
• చూడవే … ఇటు చూడవే …. మాటాడవే
• చూడవే … ఇటు చూడవే …. మాటాడవే
• కలిసాయి కలిసాయి
నీ అడుగుల్లో నా అడుగులు
• కలిసాయి కలిసాయి
నీ చూపుల్లో నా చూపులు
• ఆడగక నే అడుగుతున్నా
నీ అడుగు లో మడుగై ఉంటానని
• చూడక నే చూస్తున్నా
నీ కంటిపాప న నా రూపాన్ని
మడుగు = అణకువ.
జడి పడు = కంగారు, బాధ పడు.
యడ్ల శ్రీనివాసరావు 7 Aug 2022 3:30 AM.
No comments:
Post a Comment