మోక్ష కాల భస్మేశ్వరుడు
• ఈశ్వర పరమేశ్వర
• నిను కోరి వచ్చాను నీ సన్నిధికి
కోరికలతో కాదయా
• నిను చేరి నిలిచాను నీ హారతికి
భస్మమై కలిసేందుకు
• ప్రేమ పాశం తో ముడిపడిన ఆత్మ
అర్పితం శివా నీకే అర్పితం.
• భవ బంధనం లో తేలియాడే దేహం
అర్పితం శివా నీకే అర్పితం.
• ఏది కర్మమో …. ఏది మర్మమో
ఏది పుణ్యమో …. ఏది పాపమో
• నీ వెంత ఘనుడవు
గతము నెరిగించావు
వర్తమానం చేసావు.
• నీ వెంత సఖుడవు
కర్మను తెలిపావు
వర్తమానం చేసావు.
• నీ ఆటలో బొమ్మను
ఛిద్రం చేసినా భద్రం చేసినా
నీవే కదా శివా
• ఈశ్వర పరమేశ్వర
• నిను కోరి వచ్చాను నీ సన్నిధికి
కోరికలతో కాదయా
• నిను చేరి నిలిచాను నీ హారతికి
భస్మమై కలిసేందుకు
• అవధుల ను దాటి సమిధ నవుతాను
యుక్తి తో కాదయా నీ శక్తి తో
• అంధకారము లోని ఆనందం
అవని దాటి పుంతలు తొక్కుతొంది.
• సంధికాలంలో నవవసంతం
పుడమి దాటి పరవళ్లు తొక్కుతోంది.
• కాలమే కలిసి ఒడిలో ఆడిస్తుంటే
ఎందుకు బాధ…ఎందుకు రోత.
• అసలెందుకు
ఈ గందర 'గోళం' లో చిందర వందర.
• ఇచ్చేది నీవు మెచ్చేది నీవు
నడి సంద్రంలో ముంచేది నీవు.
• ఎందుకు బాధ…ఎందుకు రోత
అసలెందుకు
ఈ గందర 'గోళం' లో చిందర వందర
• సర్వం శివమయం …. సర్వం శివార్పణం
• ఇక మిగిలింది ఒక్కటే
చితానందం … చితాభస్మం
• ఓం నమఃశివాయ🙏
అవధి = హద్దు, కష్టం, శ్రమ
సమిధ = కాలుతూ వెలుగు నిచ్చేది.
యుక్తి = తెలివి
సంధికాలం = కలియుగ అంతం.
యడ్ల శ్రీనివాసరావు 13 సెప్టెంబర్ 2022 6:30 PM.
No comments:
Post a Comment