నా పల్లె
• తొలి కోడి కూసింది
తొలి పొద్దు లేపింది
• చలిగాలి వీస్తుంది
మనసేమో చూస్తుంది.
• తెలవారే ఈ సమయం
మంచు తెరలతో కమ్మింది.
• గువ్వపిట్ట అరిచింది
గూడు దాటి వచ్చింది
• జాబిల్లి వెళుతుంది
జనస్రవంతి లేస్తుంది.
• తెలవారే ఈ సమయం
మసక మత్తు విడిచింది.
• నదిలోన నీరంతా
సూర్యుని తో మిలమిల.
• మదిలోన తలపంతా
తేజము తో తళతళ .
• భానుడి తో ఉదయం
సంబంరం చేస్తుంటే
• ప్రకృతి లో నా మనసు
అంబరం చూస్తుంది.
• కోయిలమ్మ రాగాలకు
కోనసీమ పలుకుతుంటే
• ఎగిరేటి కొంగలు
ఆగి ఆగి చూస్తున్నాయి
• ఊగేటి పువ్వులు
తొంగి తొంగి వింటున్నాయి
• పంట పైరులు పరవశమై
సరిగమలై వీస్తున్నాయి.
• తొలి కోడి కూసింది
తొలి పొద్దు లేపింది
• చలిగాలి వీస్తుంది
మనసేమో చూస్తుంది.
• సన్నాయి మోగింది
గంగిరెద్దు ఆడింది
• గుడి గంటలు మోగాయి
గణనాధుడు చూశాడు
• పల్లెలోని పశువులన్నీ
పచ్చికలో విహరిస్తుంటే
• పిల్లగాడి ఆలోచనలు
పల్లకిలో ఊగుతున్నాయి
• నడినెత్తిన భానుడి తో
పల్లె నడవలేక నీరసిస్తుంటే
• మనసున్న వృక్షాలు
వంగి వంగి సేద నిస్తున్నాయి.
• తొలి కోడి కూసింది
తొలి పొద్దు లేపింది
• చలిగాలి వీస్తుంది
మనసేమో చూస్తుంది.
• సాదరమైన ఈ సంధ్య
సుస్వాగతం చెపుతుంది.
• బడి పిల్లలు ఈలల తో
ఇంటి పయనమయ్యారు.
• నిశి రాతిరి వచ్చింది
చీకటి ని తెచ్చింది
• జాబిల్లి వచ్చింది
వెన్నెల తో నింపింది.
• నా పల్లెకు సాక్ష్యం ఈ ప్రకృతి
నా జీవానికి ఊపిరి ఈ పల్లె
యడ్ల శ్రీనివాసరావు 24 sep 2022 1:30 PM
No comments:
Post a Comment