రుద్రనాయక
• హర హర శంకర శంభో శంకర మహాదేవ
శివ శివ శంకర శంభో శంకర మహాదేవ
• హర హర అనగా హలమును దాచిన
గళము ను విప్పి వచ్చావు
శివ శివ అనగా శిరమున దాచిన
జ్ఞానగంగ ను తెచ్చి ఇచ్చావు
• ఓ కాలకంఠుడా ఓ భృకుటినాధుడా
ఓ నీలకంఠుడా ఓ పింగళాక్షుడా
• హర హర అనగా హలమును దాచిన
గళమును విప్పి వచ్చావు
శివ శివ అనగా శిరమున దాచిన
జ్ఞానగంగ ను తెచ్చి ఇచ్చావు
• రుద్రనాయకుడి వై భధ్రమూర్తి లా నడిపిస్తావు
కాలహరుడి వై సృష్టి చక్రము ను శాసిస్తావు
మోక్షనాధుడి వై ఆత్మఘోషలకు కరుణిస్తావు
భస్మరూపుడు వై విశ్వము నే పరిపాలిస్తావు
• ఓ నందివర్ధనుడా ఓ ప్రమధనాధుడా
ఓ భూతనాధుడా ఓ మృత్యువంచకుడా
• హర హర శంకర శంభో శంకర మహాదేవ
శివ శివ శంకర శంభో శంకర మహాదేవ
• జనన మరణాల బీజనాధుడివి
అది అంతాల సూత్రధారివి
సత్య అసత్యాల జ్ఞానరూపివి
పాప పుణ్యాల ధర్మకారకుడివి
• ఓ చంద్రశేఖరా ఓ ఆదిభిక్షువా
ఓ మల్లిఖార్జునా ఓ కేతుపుంగవా
• హర హర అనగా హలమును దాచిన
గళము ను విప్పి వచ్చావు
శివ శివ అనగా శిరమున దాచిన
జ్ఞానగంగ ను తెచ్చి ఇచ్చావు
• హర హర శంకర శంభో శంకర మహాదేవ
శివ శివ శంకర శంభో శంకర మహాదేవ
యడ్ల శ్రీనివాసరావు 15 sep 2022 5:00 PM
No comments:
Post a Comment