శివ చైతన్యం
• దయగల నా శివ దరిచేరి వచ్చాను
దయచేసి దయచూపు నా దారి గమ్యము న
• నిను తాకిన తమకమున
అణగారిన బుద్ధి వికసించేను
• నా లోని *చపలము విఫలము చేసి
సకలము స్థితము చేయు తండ్రి
• మన బంధం మేమిటో తెలిసింది
అనుబంధం కోసం వచ్చాను తండ్రి.
• అడుగు దూరాన అడుగడి అడుగుతున్నాను
నీ అడుగు లో మడుగవుతాను
• దయగల నా శివ దరిచేరి వచ్చాను
దయచేసి దయచూపు నా దారి గమ్యము న
• నడయాడే నా తల్లి పార్వతి
నగుమోము చూడగ
• నా తల్లి ఒడిలో న నిదురించేందుకు
ఇంకెన్ని జన్మలు ఎదురు చూసేది
• నవమాసాలు మోయలేదు కానీ
*నైమిషం లో ని నన్ను *నవనీతం చేయు తల్లీ
• ఆలనా లాలన పాలన కై
నీ కేమి సేవ చేయగలను
• ప్రకృతి లో ప్రకాశించే పరవశం నీవు
వికృతులను హరియించే విశాలాక్షి నీవు
• మల్లన్నను మురిపించే మలయవాసిని వి నీవు
మురిపాలు కురిపించే కమలాక్షి వి నీవు
• నేనేమి దూరం నేనేమి భారం
• కనులకు కానరాని మీరు
మనసున కొలువై ఉన్నారు
• దయగల నా శివ దరిచేరి వచ్చాను
దయచేసి దయచూపు నా దారి గమ్యము న
చపలము = నిలకడ , స్థిరత్వం లేని బుద్ది
నైమిష = దండకారణ్యం , అజ్ఞానం, చీకటి
నవనీతం = చిలికిన వెన్న.
యడ్ల శ్రీనివాసరావు. 27 sep 2022 8:30 am.
No comments:
Post a Comment