Thursday, November 28, 2024

నా శివుడు - రామకృష్ణ తులసి.


నా శివుడు

By

రామకృష్ణ తులసి.


• శివుడెన్నడు     నాలోనే    ఉన్నాడు.

  శివుడెప్పుడు    నాతోనే    ఉన్నాడు.

• శివుడు   లేని    నేను    లేను.

  శివుడు  లేని    లోకమే  లేదు.


• నా శ్వాసలు    నా ఆశలు    నా మెలకువ

  నిదురలు    గమనించువాడు    శివుడు.

• నా ఊహలు    నా ఊసులు    నా గతము

  నా భవిత   సకలము    నిర్ణయించువాడే  శివుడు.


• నాకు తోచిన    నేను గీచిన    నేను రాచిన 

  నన్ను మెచ్చిన   అన్ని చేసిన  శివుడే  నా గురువు.


• నా తండ్రిగా   నా పుత్రుడి వై    

  నా తోబుట్టువు  నీవు 

  నా వంశవృక్ష   వేరువి  ఆ చిగురువి 

  ఆశల  చిరు పిందెవి   శివా  నీవు.


• ఒకటికి   పలుమార్లు   నిను తలచు

  నా మది మరచునని‌.

• పది పది విధముల    నిను పొగడుదు 

  నను మరతువు  అని.

• నా  రాతలు   కవ్వింతలు 

  నా శృతులు  సంగతులు  నాకు  వేపకములు 

  అవి ఎప్పటికీ   నిను  వీడని

  భస్మ   లేపనములు శివా.


ఓం నమః శివాయః🙏

Written by 

రామకృష్ణ.తులసి. 25 Nov 2024, 10:00 AM.



No comments:

Post a Comment

నా శివుడు - రామకృష్ణ తులసి.

నా శివుడు By రామకృష్ణ తులసి. • శివుడెన్నడు     నాలోనే    ఉన్నాడు.   శివుడెప్పుడు    నాతోనే    ఉన్నాడు. • శివుడు   లేని    నేను    లేను.   శ...