రా … ధైర్యం గా
• రా … ధైర్యం గా …
ఒక అడుగు ముందుకు వెయ్యి.
వేయి అడుగులు నే నడిపిస్తాను.
• రా … ధైర్యం గా …
నా చేతిలో చేయి వెయ్యి
నీ శక్తి ఏమిటో నీకు చూపిస్తాను.
• దేహపు భ్రాంతి నిను కబళిస్తుంది.
ఆత్మన శాంతి నిను రక్షిస్తుంది.
• రెక్కలు విరిగిన పక్షి వి కావు
సత్య యుగపు ఎగిరే హంస వి నీవు.
• రా … ధైర్యం గా …
ఒక అడుగు ముందుకు వెయ్యి.
వేయి అడుగులు నే నడిపిస్తాను.
• రా … ధైర్యం గా …
నా చేతిలో చేయి వెయ్యి
నీ శక్తి ఏమిటో నీకు చూపిస్తాను.
• నీ బంధాలు బరువులు నావి.
నీ మనసు ను నాపై లగ్నం చేయి.
• ఏమి జరిగినా ఏది పోయినా
జరిగేది అంతా నీ మంచి కే.
• ముళ్ళ కంచె కాదు నీ జీవితం
తోట లోని పుష్పం నీ జీవనం.
• తెల్లని వర్ణమై నీలో సప్త వర్ణాలు దాచుకో.
వర్షం వెలిసాక హరివిల్లు వి నీవే కదా.
• నా రూపం కనపడకున్నా
నా కిరణం నిను తాకుతునే ఉంది.
• రా … ధైర్యం గా …
ఒక అడుగు ముందుకు. వెయ్యి.
వేయి అడుగులు నే నడిపిస్తాను.
• రా … ధైర్యం గా …
నా చేతిలో చేయి వెయ్యి
నీ శక్తి ఏమిటో నీకు చూపిస్తాను.
యడ్ల శ్రీనివాసరావు 21 Nov 2024 8:40 PM.
No comments:
Post a Comment