బాల్యం తీపి
• చిన్న చిన్న పాదాలకు తెలియదు
బాల్యం తీపి
పసి బాల్యం తీపి.
• చిన్న చిన్న పాదాలకు తెలియదు
ప్రాయం తీపి
పసి ప్రాయం. తీపి.
• పాఠశాల పరుగు లతో
బాల్యం అలసి పోలేదు . . .
నీ బాల్యం అలసి పోలేదు.
• పదిలమైన అనుభవాలు
ప్రాయం మరచి పోలేదు . . .
నీ ప్రాయం మరచి పోలేదు.
• తెలియక మోస్తారు
జ్ఞాపకాల బరువులు.
• విడువక దాస్తారు
మనసున తలపులు.
• నేడు అవే అవే
మన ముసి ముసి నవ్వులకు
మురిపాల మువ్వలు .
• కనుల ముందు
కదులుతున్న సీతా కోక చిలుకలు.
• కళకళ లాడేను ప్రతి
శని వారం రంగుల వల్లులు.
• బిక్కు మనే చూపులతో
దిక్కు లన్ని వెతికేవి ఎన్నో తూరీగలు.
• ఆకర్షణ కోసం అటు ఇటు
తిరిగేవి కొన్ని జోరెక్కిన జోరీగలు.
• తూరీగలు ఎవ్వరో . . .
జోరీగలు ఎవ్వరో . . .
హృదయం తలుపు తెరిచి చూడండి . . .
మీ హృదయం తలుపు తెరిచి చూడండి.
• చిన్న చిన్న పాదాలకు తెలియదు
బాల్యం తీపి
పసి బాల్యం తీపి.
• చిన్న చిన్న పాదాలకు తెలియదు
ప్రాయం తీపి
పసి ప్రాయం తీపి.
• గుడిగంటలు తాకకున్నా …
చాటుగ జడగంటలు తాకుతూ
ఆడే కొంటె ఆటలు.
• ఈడు పిల్లలతో పాడు అల్లరి తో
చేసే చిల్లర చేష్టలు.
• జారకున్న వోణి ను పదే పదే
సరిచేసే జాబిలమ్మ సొగసులు.
• గజ్జెల ఘల్లుల తో
అడుగులలో అడుగులేసే
కంగారు నడకలు.
• ఈడు పిల్ల లెవ్వ రో . . .
పాడు చేష్ట లెవ్వరి వో . . .
హృదయం తలుపు తెరిచి చూడండి.
మీ హృదయం తలుపు తెరిచి చూడండి.
• పాఠశాల పరుగు లతో
బాల్యం అలసి పోలేదు . . .
మీ బాల్యం అలసి పోలేదు.
• పదిలమైన అనుభవాలు
ప్రాయం మరచి పోలేదు . . .
మీ ప్రాయం మరచి పోలేదు.
• తెలియక మోస్తారు
జ్ఞాపకాల బరువులు.
• విడువక దాస్తారు
మనసున తలపులు.
• నేడు అవే అవే
మన ముసి ముసి నవ్వులకు
మురిపాల మువ్వలు.
యడ్ల శ్రీనివాసరావు 22 Nov 2024 ,10:15 PM.
No comments:
Post a Comment