Sunday, November 3, 2024

557. శివునికి ... ఏమని చెప్పాలి


శివుని కి ... ఏమని చెప్పాలి


• ఏమని   చెప్పను   తండ్రి …

  ఎంతని   చెప్పను   తండ్రి.


• పాల వంటి     నీ   ప్రేమ తో

  పవిత్రత ను    పంచావు.

• మురిపాల  వంటి   పలుకులతో

  పరవశం   చేశావు.


• ఏమని   చెప్పను   తండ్రి …

  ఎంతని   చెప్పను   తండ్రి.


• పూల వనం లో    పూవులు    ఎన్నున్నా

  నీ  మాల లో     చేరేది   కొన్నే.

• జీవ తలం లో     తారలు    ఎన్నున్నా

  ధృవ తారలు    అయ్యేది   కొన్నే.


• వెతికినంత   కాలం

  నీవు   మాకు   దొరకలేదు.

• సొమ్మసిల్లి  న     నాడు

  నీవు   మా   చేయి పట్టావు.


• ఏమని    చెప్పను.  తండ్రి …

  ఎంతని    చెప్పను    తండ్రి.


• నీ    భక్తి    లోన

  లభించింది   దేహ  భుక్తి.

• నీ   జ్ఞానం తో

  లభించింది   ఆత్మ  శుద్ధి.


• దేహ భుక్తి    వలన

  నాడు   మందగతి న   ఉన్నాము.

• ఆత్మ శుద్ధి     వలన

  నేడు   ఫరిస్తాలు   అయ్యాము.

 

• పరవళ్లు  తొక్కే   ఈ పదములు

  నావి    కావని   తెలుసు.

• ఒరవడి   నిచ్చే   ఈ  ప్రాసలు

  నీవని     నీకు   తెలుసు.


• ఏమని   చెప్పను  తండ్రి …

  ఎంతని   చెప్పను  తండ్రి.


భుక్తి  = భోజనం,  ప్రసాదం.

ఫరిస్తా =  తేలికగా అగుట ,   ఎగిరే దేవదూత


యడ్ల శ్రీనివాసరావు 3 Nov 2024 7:45 pm


No comments:

Post a Comment

617. ఏకరసము

  ఏకరసము  • సాగే   నీ సమయం    సంబరం  అది    చేర్చును    నిన్ను అంబరం . • అవని లో    అందలం   ఎక్కినా   మోసే   నలుగురికి    భారం . • ఆ   భార...