Tuesday, November 19, 2024

564. వివాహం - శుక్రుడు - గురువు

 

వివాహం - శుక్రుడు - గురువు



• భరత ఖండంలో  మహర్షులు,   మునులు,  ఋషులు,  తపస్సు చేసి  దివ్య శక్తులతో  భవిష్య తరాలు,  ఎంత అంధకారంలో  ఉంటాయో ముందు గా నే   గ్రహించి  అనేక   విధములైన   శాస్త్రాలను , జ్ఞాన యుక్తం తో రాశారు.   ఇది ఎన్నో వందల సంవత్సరాల  క్రితం జరిగింది.  అందులో భాగంగా ఖగోళశాస్త్రం, ఆయుర్వేద సిద్ధ వైద్యం, జ్యోతిష్య శాస్త్రం, పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో ఎన్నెన్నో రాశారు.  వీటన్నింటి  ముఖ్య  ఉద్దేశ్యం   లోక కళ్యాణం.


 ఈ శాస్త్రాలను  నేడు విదేశీయులు  అధ్యయనం  చేసి వాటి  సత్యం  గ్రహిస్తున్నారు.  అనాదిగా  ఈ శాస్త్రాలను   పూర్తిగా  చదివి   అర్దం చేసుకోలేక విఫలమైన  వారు  నేటికీ  ఉన్నారు ,   అయినప్పటికీ ఈ శాస్త్రాలలో  పొందు పరచిన అంశాలు  ఏనాడూ విఫలం అవలేదు.  ఈ విషయం  అర్దం కాని  వారే, శాస్త్రాలను నిందిస్తారు.  అదే విధంగా  యధార్థంగా  శాస్త్రాలలో  ఉన్న విషయాలు  కొంత మంది పండితులకు  అర్ధం కాక, లేదా  రుచించక  స్వార్దం తో వారికి తోచిన రీతిలో మార్చి  కొన్ని రాశారు.


• ఇదంతా ఎందుకంటే ఒక వైద్యుడు వైద్యం చేయడం లో విఫలం కావచ్చు,   అంత మాత్రాన   వైద్య శాస్త్రం విఫలం కాదు.

  అలాగే   ఒక పండితుడు  జ్యోతిష్య శాస్త్రం అధ్యయనం చేసి ,  యధావిధిగా  చెప్పడం లో  విఫలం కావచ్చు   అంత మాత్రాన,  జ్యోతిష్య శాస్త్రం విఫలం కాదు.

  జ్యోతిష్య శాస్త్రం అనేది,   మనిషి  మనుగడకు ఒక blue print వంటింది.  మనిషి లో  కర్మల  లోపాలను సరిచేస్తూ ,  సరియైన మార్గములో  నడిపించే దిక్సూచి  వంటిది.  ఇది  విశ్వానికి మరియు  మనిషి కి  ఒక విజ్ఞాన శాస్త్రం.

  కానీ దురదృష్టవశాత్తు  ఇది  అల్పులైన  కొందరు పండితులు   శాస్త్రాన్ని  వ్యాపారం చేస్తూ,   భయపెట్టి , మూఢనమ్మకాలు ప్రభలించి,  స్వార్థం తో ,  దుఃఖం లో ఉన్న అమాయకుల  వద్ద  నిలువునా  వేలకు వేలు దోచుకుంటారు.  ఈ విషయం లో   ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

 

☘️☘️☘️☘️☘️☘️☘️


• జ్యోతిష్యం   తద్వారా   జాతకం అనేది  ఒక blue print.   ఇది ప్రతి మనిషి కి ఒకేలా ఉండదు.  గత జన్మల  కర్మల పాప పుణ్యాల  అనుసారం ,  జన్మ తీసుకొనే  సమయం,  నిమిషాలు,  సెకన్ల అధారంగా ఈ blue print (జాతకం) అనేది సృష్టింపబడి ఉంటుంది.  ఇది అధ్యయనం చేయాలి అంటే దైవ కృప ఉండాలి. 


  ఈ ఆర్టికల్ లో మనుషుల వివాహ పొంతన, స్థితి అనేది , విశ్వం లో  ఏ యే  గ్రహల  శక్తి   అనుసరించి ఉంటాయి,  జ్యోతిష్య శాస్త్రం లో  విశ్లేషించిన దానికి చిన్న  వివరణ. 


  ఈ విశ్వం లో ఎన్నో గ్రహాలు ఉన్నాయి. ముఖ్యం గా మనిషి పై ప్రభావం చూపించేవి,  

సూర్యుడు (Sun), 

చంద్రుడు (Moon),  

శుక్రుడు (Venus), 

గురుడు (Jupiter), 

శని (Saturn), 

బుధుడు (Mercury), 

అంగారకుడు (Mars), 

రాహువు (Rahu), 

కేతువు(Ketu).

 రాహు, కేతువులు చాయా గ్రహాలు (Shadow Planets). మిగిలినవి భౌతిక గ్రహాలు.


🌹🌹🌹🌹🌹


• నేటి ప్రస్తావన గురువు (Jupiter),  మరియు శుక్రుడు (Venus) గురించి. 


• జ్యోతిష్య  శాస్త్ర  ప్రకారం,  గురువు అంటే జీవాత్మ. అంటే   ఒక జీవం ఉన్న  ఆత్మ కి   శక్తి  నిస్తూ  దశ దిశ నిర్దేశం  చేసేది  గురు గ్రహం.   

గురు గ్రహం లక్షణాలు … జ్ఞానం (Wisdom)  ఇచ్చేవాడు,  మార్గదర్శకం  చూపించే  వాడు.  జీవితాన్ని  సజావుగా ముందుకు తీసుకెళ్లే వాడు. Jupiter is King of planets. గురువు ఇచ్చేది జ్ఞాన సంపద  తద్వారా  ధన సంపాదన మార్గాలు చూపేవాడు .  మరియు  సమస్యలు, విఘ్నాలకు పరిష్కారం చూపిస్తాడు.   ఆలోచనలు  ప్రభావితం  చేసే  వాడు  గురువు.  జాతక చక్రం లో గురువు బలం గా  ఉన్నప్పుడు మంచి గా  అనుకున్నవి అన్నీ సజావుగా  జరుగుతాయి.   గురువు జాతకం లో బలంగా లేకపోతే   ఆశించినవి   జరగకపోయినా , చెడు  మాత్రం జరగదు.   అంటే గురువు  ఎన్నడు  చెడు , హాని  తలపెట్టడు  అని అర్దం.  

ఒకరి జాతకంలో  గురుగ్రహం  బలం గా ఉంటే,  వారి జన్మ,  జీవితం గట్టు ఎక్కెస్తుంది  అని అంటారు.  గురు గ్రహం యొక్క రంగు పసుపు.‌ ఇది   శుభానికి సూచకం.  


• ఇటువంటి   గురు గ్రహం   జ్యోతిష్య శాస్త్రం  ప్రకారం  స్త్రీల   జాతకం లో    భర్తను   సూచిస్తుంది.   అందుకే వివాహమైన   స్త్రీలు   భర్త కు  గౌరవం ఇవ్వాలని,  భర్త చెప్పిన మాట  వినాలని  అనాదిగా  చెపుతారు.  ఒక స్త్రీ  జన్మ   జాతకం లో   గురు గ్రహ స్థితి  చూసి ఆమెకు  ఎటువంటి  భర్త వస్తాడు ,    భర్త  నుంచి ఆమె  ఈ జన్మలో ఏమి  నేర్చుకోవాల్సి  ఉంటుంది అనేది  స్పష్టంగా  తెలుసుకోవచ్చు.  

గురు గ్రహం  బలహీనం గా   ఉంటే    ఇహ లోకంలో జీవన  పురోగతి ఉండదు ,  కానీ సాదాసీదా గా ఉంటుంది.   గురు గ్రహ బలం పెంచుకోవాలి అంటే గురువులను గౌరవించటం,  గురు గ్రహ బీజ మంత్రం పఠించడం,  దక్షిణామూర్తి  స్తోత్రం  పఠించడం చేయడం ఉత్తమ పరిహారం.  ప్రత్యేకం గా గురువారం శివారాధన  చేయడం  మంచిది.


🌹🌹🌹🌹🌹


• శుక్రుడు ...   జ్యోతిష్య శాస్త్రం  ప్రకారం  జన్మ  జాతకం లో శుక్ర గ్రహం  బలంగా  ఉంటే   భౌతిక విలాసాలు,   ధనం, బంగారం , సంబంధాలు, భోగం, ప్రేమ, అందమైన స్త్రీ ల సాన్నిహిత్యం లభిస్తుంది.  భౌతిక సంసారం , జీవితం  సంతోషంగా ఉంటుంది.

అదే విధంగా , ఒకరి జాతకం లో  శుక్ర గ్రహం   బలహీనం గా   ఉంటే    ఆధ్యాత్మికత,  దైవ చింతన, బలహీనమైన   మానవ సంబంధాలు ఉంటాయి.  శుక్రుడు  అతి  బలహీనం గా   ఉండడం వలన  ఆధ్యాత్మిక  జీవితం ఆరంభమయి,   దైవం  దిశగా  పయనం  ఉంటుంది.  శుక్ర గ్రహం యొక్క రంగు తెలుపు.  ఇది  శాంతి, సుఖానికి  చిహ్నాం.   ఇవి అన్ని కూడా గత జన్మలలో కర్మలను బట్టి నిర్ణయించబడి ఉంటాయి.


• పురుషుడు  జాతకం లో   భార్యను   శుక్ర గ్రహం సూచిస్తుంది.   శుక్రుడు బలంగా ఉంటే అందమైన భార్య,  గుణవంతురాలు,  విలాసాలు,  ప్రేమ,  భోగ సుఖం , ధన సంపాదన ,  మంచి మానవ సంబంధాలు లభిస్తాయి. శుక్రుడు బలంగా లేకపోతే వైరాగ్యం, దైవ చింతన, ఆధ్యాత్మికత  లభిస్తాయి.

  శుక్ర గ్రహ బలోపేతానికి  శుక్ర  బీజ మంత్రం జపిస్తూ, అమ్మవారి ఆరాధన, చేస్తూ ,  కంటికి  కనిపించే ప్రతీ స్త్రీ ని   గౌరవం గా   చూడాలి.   కించపరిచే  మాటలు, దృష్టి ,  సంకల్పాలు,   భాష   వాడకూడదు.


• పురుషుడు  జాతకం లో  శుక్రుడు బలంగా ఉంటే మంచి ధన సంపాదన ఉంటుంది. సుఖం ఉంటుంది . దీనినే భార్య వలన  పొందిన  అదృష్టం అంటూ ఉంటారు.


ఖగోళం లో  ఉండే  గ్రహల  యెక్క  శక్తిని  మానవుడు స్వీకరించడం అనేది చాలా సహజం గా జరిగే ప్రక్రియ. కానీ ఈ విషయం  మానవుడి స్పృహ కి   ఎంతో సాధన  ద్వారా మాత్రమే  తెలుస్తుంది. ఇదంతా తెలియని వారు మూఢనమ్మకాలు అని అనుకుంటారు.


గమనిక :   గురువు,  శుక్రుడు  independent గా ఉన్నప్పుడు ఈ స్వభావ లక్షణాలు ఉంటాయి.  అలా కాకుండా  , ఇవి   వేరే  ఇతర గ్రహాలతో కలిసి ( conjunction ) జాతక కుండలి లో ఉన్నప్పుడు ఫలితాలు  , లక్షణాలు చాలా మారుతాయి.  అంటే ఇతర గ్రహాల ప్రభావం ఉండడం వలన పని తీరు వేరుగా ఉంటుంది.


• అధ్యయనం చేయడం ద్వారా, విజ్ఞానం  అవగాహన కోసం మాత్రమే రాయబడిన ఆర్టికల్.


 యడ్ల శ్రీనివాసరావు 20 Nov 2024 ,10:30 AM.



No comments:

Post a Comment

617. ఏకరసము

  ఏకరసము  • సాగే   నీ సమయం    సంబరం  అది    చేర్చును    నిన్ను అంబరం . • అవని లో    అందలం   ఎక్కినా   మోసే   నలుగురికి    భారం . • ఆ   భార...