Tuesday, November 19, 2024

563. నా (మన) వాడు - ఎవరు

 

నా (మన) వాడు - ఎవరు 


• మది   లోన   శివుడుంటే 

  మనకేల   దిగులు

  మనకేల    దిగులు.

• గతి   లోన   గురువుంటే 

  సద్గతి   కేల   కొదవు 

  సద్గతి   కేల   కొదవు.


• గురువు   దొరకని   నాడు

  గతి ఉంది  గాని    సద్గతి లేదు.


• కాశీ కి  పోయినా  

  గంగలో   మునిగి నా

  మారని   బుద్ధి కి      భక్తి   ఎందుకు.

• ప్రవచనాలు     వినినా

  తన్మయత్వం   పొందినా

  మారని   సంస్కారానికి     ఉపయోగమేమి.


• మది   లోన   శివుడుంటే

  మనకేల   దిగులు

  మనకేల   దిగులు.

• గతి  లోన    గురువుంటే

  సద్గతి   కేల   కొదవు

  సద్గతి   కేల   కొదవు.


• శివుడున్న   చోట 

  చెడు    ఉండ లేదు.

• అర్పించని   మనసు లో 

  శివుడు     ఉండడు.


• శివుడు కోరేది 

  మనసు   బుద్ధి    సంస్కారాల    శుద్ధి.

• దీపాలు    వెలిగిస్తే     

  బుద్ధి   శుద్ధి   కాదు.

• ధ్యాన    దీపం తో    నిత్యం  

  వెలగాలి    నీ   ఆత్మ   జ్యోతి.

• గుడులెన్ని    తిరిగినా

  శుద్ధి లేని    మనసు కి

  దైవం     దొరకదు.


• నా    వాడు    అంటే    ఎవరు . . .

  మన  వాడు    అంటే   ఎవరు . . .


• దేహము   లేని   నాడు

  ప్రాణము  లేని    నాడు

  తోడున్న    వాడే     నీ   వాడు

  నీడైన       వాడే     నీ   వాడు

  అతడే      శివ  పరమాత్ముడు.


• మది   లోన   శివుడుంటే

  మనకేల    దిగులు

  మనకేల    దిగులు.

• గతి  లోన    గురువుంటే

  సద్గతి   కేల   కొదవు

  సద్గతి   కేల   కొదవు.


యడ్ల శ్రీనివాసరావు 19 Nov 2024, 7:30 PM.



No comments:

Post a Comment

617. ఏకరసము

  ఏకరసము  • సాగే   నీ సమయం    సంబరం  అది    చేర్చును    నిన్ను అంబరం . • అవని లో    అందలం   ఎక్కినా   మోసే   నలుగురికి    భారం . • ఆ   భార...