Saturday, November 9, 2024

559. శివమయం

 

శివమయం



• శివమయం

  మనసంతా   శివమయం

• రసమయం 

  నా   మనసంతా   శివ రసమయం.


• కనులు  మూసినా   కనులు తెరిచినా

  కదులుతున్న    నీ రూపం . . .

  నే   చేరాల్సిన   స్వరూపం.


• పనులు  చేస్తున్న    పదము  రాస్తున్న

  మెదులుతున్న    నీ ధ్యానం . . .

  నే   చేయాల్సిన    స్మృతియానం.


• శివమయం

  మనసంతా   శివమయం

• రసమయం

  నా మనసంతా   శివ రసమయం.


• భారం  లేని     నా దేహం

  నిను   చూస్తుంది.

• సుగమ మైన    నీ మార్గం

  నను   స్వాగతిస్తుంది.


• నా  భావనల   భాషంతా

  మౌనం    అయింది.

• అనుక్షణం    శూన్యమై 

  నీ మాట     వింటుంది.


• మూలాధారం   తెలిపింది    నీ బంధం.

  ఆజ్ఞా  చక్రం      కలిపింది     సంబంధం.

  చేయి పట్టి   చూపావు    మన  అనుబంధం.


• ఇది   ఆత్మ  పరమాత్మల     మిలనం.

  తండ్రి    తనయుల   సంగమం.

  వీడని     శాశ్వత     సంయోగం.


• శివమయం

  మనసంతా   శివమయం

• రసమయం

  నా మనసంతా   శివ  రసమయం.


యడ్ల శ్రీనివాసరావు 9 Nov 2024. 7:40 PM.


No comments:

Post a Comment

617. ఏకరసము

  ఏకరసము  • సాగే   నీ సమయం    సంబరం  అది    చేర్చును    నిన్ను అంబరం . • అవని లో    అందలం   ఎక్కినా   మోసే   నలుగురికి    భారం . • ఆ   భార...