శి(వ)శము
• శివము లో వశము దివ్యము.
హరుని తో బంధము మోక్షము.
• దివ్యము అంటే
దైవిక గుణము ల సాధనం.
• మోక్షం అంటే
బురదలో కలువ లా నిలవడం.
• శివము లో వశము దివ్యము.
హరుని తో బంధము మోక్షము.
• మనస నే కురుక్షేత్రం లో
మనువ నే రణరంగం మన భారతం .
• శక్తి యుక్తులను ఈ పోరు లో నిర్వీర్యం
చేయు టే మనిషి అజ్ఞానం.
• సత్యమ నే జీవనం లో
మాయ చేసే యుద్ధం మన రామాయణం.
• ఓర్పు నేర్పు లను ఈ పోరు లో నిశ్చయం
చేయు టే మనిషి జ్ఞానం.
• శివము లో వశము దివ్యము.
హరుని తో బంధము మోక్షము
• రాముని ధర్మం
రావణ అసురత్వ మే మను శాస్త్రం.
• సత్యము ఆచరించక
మాయలో మునగడ మే దుఃఖం.
• సర్వ శాస్త్రాల సారం
సంసార సాగరం దాటడం.
• శివము లో వశమై న దివ్యము.
• శివము లో శవమై న ధన్యము.
యడ్ల శ్రీనివాసరావు 4 Nov 2024 10:00 PM.
No comments:
Post a Comment