విశ్వం భరణి
• జగదాంబ శారద వీణా పాణి
స్వర రాగ సంగీత కోశా రాణి.
• జ్ఞానాంబ లలితా విశ్వం భరణి
కుల కుండ నిక్షిప్త శంబం రూపిణి .
• అమృత నందిని ప్రేమా వర్షిణి.
అమర లాలాన కరుణా వేణి.
• జగదాంబ శారద వీణా పాణి
స్వర రాగ సంగీత కోశా రాణి.
• అసుర గుణాల హంతక భక్షిణి.
శిశిర పాలన శంతాతి శిఖరిణి.
• మృదు లీల శేష గీతా వాణి.
శివ శక్తి శిఖ ధారణ ధరణి.
• జగదాంబ శారద వీణా పాణి
స్వర రాగ సంగీత కోశా రాణి.
• భుక్ష దుఃఖ హరిణి అన్న పూరిణి
శుక శాంతి దాయిని సుభాషిణి.
• శశి వద తరుణి చందన శివాని
సృష్టి స్థితి లయ చంద్రిక తరంగిణి.
• జగదాంబ శారద వీణా పాణి
స్వర రాగ సంగీత కోశా రాణి
యడ్ల శ్రీనివాసరావు 10 Nov 2024, 9:30 pm.
No comments:
Post a Comment