శివుని విశిష్టత
• బాబా …. శివ బాబా
మా తోడు నీడ లకు వెలుగై నావు.
• బాబా …. శివ బాబా
మా ఆట పాట లకు కొలువై నావు.
• నీ కళ్ల లోని శాంతం
కైవల్య స్వరూపం.
• నీ నవ్వు లోని మౌనం
విశ్వానికి తేజం.
• నీ పాద మేగిన మధువనం
భూతల స్వర్గం.
• నీ మస్తకం లో మేముండటం
మా జన్మ సార్థకం.
• బాబా …. శివ బాబా
మా తోడు నీడ లకు వెలుగై నావు.
• బాబా …. శివ బాబా
మా ఆట పాట లకు కొలువై నావు.
• నీ ప్రేమ లోని పరిమళం తో
మేము ఫరిస్తా గ అయ్యాము.
• నీ అనుభవాలు అలలై తాకి
అనుభూతులు ఉరకలేస్తున్నాయి.
• మే మెరగని మా లో విశేషతలు
మాకు చూపావు.
• ఏనాటిదో ఈ భాగ్యం
ఈ జన్మలో వరమయ్యెను.
• బాబా …. శివ బాబా
మా తోడు నీడ లకు వెలుగై నావు.
• బాబా …. శివ బాబా
మా ఆట పాట లకు కొలువై నావు.
• బిందువు లను కలిపే
సింధువు వి నీవు.
• ఆత్మ లందరి తండ్రి వైన
పరమాత్మ వి నీవు.
• బాబా …. శివ బాబా
బాబా …. శివ బాబా
మస్తకం = ఆత్మ స్థానం.
ఫరిస్తా = తేలికగా అయి ఎగిరే దేవదూత
బిందువు = ఆత్మ
సింధువు = సాగరం
యడ్ల శ్రీనివాసరావు 1 Nov 2024 , 8:15 PM.
No comments:
Post a Comment