Monday, November 11, 2024

561. నీ శక్తి (E = m c^2)

 

నీ శక్తి



• మనిషి ని …. నీవు ఎవరు  అంటే  భౌతిక పరం గా ద్రవ్యరాశి  (as per physics MASS) అని అనడంలో  ఎలాంటి  సందేహమూ లేదు.  ఎందుకంటే మట్టి లోనుండి   అవతరించ బడిన  జీవ కణమే నీ మానవ   శరీరం   యెక్క మూలం.  అందువలనే భూమి లో ఉండే  ఎన్నో రకాల  మూలకాలు, కాల్షియం,  మెగ్నీషియం,  జింక్ ,  ఫాస్ఫరస్, సోడియం,  నీరు ,  ఆక్సిజన్,  కార్బన్ డయాక్సైడ్ వంటివి    మానవ శరీరం లో  మిళితం  అయి ఉంటాయి.

 సైన్స్   భౌతిక శాస్త్రం (ఫిజిక్స్ ) లో    చెప్పిన విధంగా ఆలోచిస్తే,   ఒక వస్తువు అంటే  ద్రవ్యరాశికి (mass) , వేగం  (velocity ) తో  కలిసినపుడు ,  అది  ఒక శక్తి గా   ఆవిర్భావం అవుతుంది,  అని ఐన్స్టీన్   అనే శాస్త్రవేత్త నిరూపించాడు.

 దీనినే ఈయన E = M C (square) సిద్ధాంతం అన్నాడు.

 E అంటే Energy (శక్తి ) అనేది,  

 M అంటే Mass(ద్రవ్యరాశి), 

 C అంటే Light speed (కాంతి వేగం) 

 ఈ మూడింటి ల కలయిక అని చెప్పాడు.

 ఇది విద్యార్ధులకు   మరియు  చదువు కున్న   అందరికీ తెలిసిన విషయమే.

ఈయన సిద్ధాంతం ప్రకారం,  శక్తి ని  కొలవాలంటే ద్రవ్యరాశి   మరియు   కాంతి వేగం   ద్వారా సాధ్యమవుతుంది  అని  చెప్పబడింది.


ఇక  అసలు విషయానికొస్తే…..

 మనిషి  శరీరం  ఒక ద్రవ్యరాశి  అయినపుడు,   మనిషి  మనసులో  ఉత్పన్నం  అవుతున్న  అనంతమైన ఆలోచనల   ఉధృతిని    కాంతి వేగం గా భావిస్తే ,   ఆ ఫలితమే   ఒక మనిషి  యొక్క  శక్తి గా చూడవచ్చు  …. నిరంతరం,  ప్రతిక్షణం  మనసు లోని ఆలోచనల   వేగ తీవ్రత ను   బట్టి  మనిషి  యొక్క శక్తి నిర్దారణ అవుతుంది.  అంటే ఆలోచనలే  మానవ శక్తి నిర్ధారించేందుకు  మూలం.  ఇందులో  ఏ  సందేహమూ లేదు.

 ఆలోచనల   ఉధృతి వేగంగా,    అతిగా ఆలోచించడం అనేది   జరగడం వలన    మానవ శరీరం (ద్రవ్యరాశి, Mass)   బరువు అవుతుంది . దీనినే  ద్రవ్యరాశి భారం అంటారు.  ఇంకా చెప్పాలంటే మనసు భారం   పిదప  శరీరం భారం.  ఫలితంగా మనిషి లో   ఉత్పన్నం  అయ్యే శక్తి  చాలా తక్కువగా ఉంటుంది.  దీని వలన  సృష్టిలో  సహజసిద్ధంగా  ఉన్న విశ్వ శక్తి కి   మనిషి  యొక్క శక్తి  అనుసంధానం  గావించ  బడదు. …..  దీనిని  ఇంకా  వివరంగా చెప్పాలంటే,  అతిగా ఎక్కువ గా  ఆలోచించడం  వలన   మనిషి  ఎక్కువ భారం  కలిగి ఉండి,  తక్కువ శక్తి తో   జీవిస్తూ ఉంటారు.  మానవునిలో   శక్తికి,  విశ్వ శక్తి తో    కనెక్ట్  అయినపుడే    అద్బుతాలు  జరుగుతాయి.


  ఎప్పుడైతే   ఆలోచనలు  ఎక్కువ అయి   మనిషి లో శక్తి తక్కువ గా  ఉంటుందో,  అప్పుడు  ఎన్నో రకాల అనర్థాలు,  అనారోగ్యం,  నిర్ణయాలు  సరిగా తీసుకో లేకపోవడం,  తప్పులు చేయడం, దుఃఖం , అశాంతి, అసంతృప్తి,  అసహనం  వంటివి  జరుగుతుంటాయి. ….. ఇక్కడ తెలుసు కోవలసింది  ఒకటే,  మనిషి తన శక్తి కి తానే కారణం.  అది ఎక్కువ ,  తక్కువ అనేది మనిషి  చేతుల్లోనే   ఉంటుంది.

• చాలా మంది,  నేను బలహీనం గా,  శక్తి లేకుండా ఉన్నాను   అంటూ  నానా రకాల  మందులు  తినడం లేదా,  అతిగా ఆహారం,  డ్రైఫ్రూట్స్  వంటివి విపరీతంగా  తినడం  చేస్తుంటారు.  దీని ఫలితం తాత్కాలికం.  అంతకంటే  కూడా   ఆలోచనలు నియత్రించు  కోవడం ,  సమతుల్య ఆహారం వలన , మానవ  దేహం  ప్రకృతి కి  అనుసంధానం  అయి అద్భుతమైన  శక్తి  పొందగలరు.  దీనినే యోగ శక్తి, దైవ శక్తి అని అంటారు. ఇది ధ్యానం యోగం ద్వారా సాధ్యం.

• ప్రతి రోజూ   తెల్లవారుజామున   ధ్యాన యోగం చేస్తూ   శివ పరమాత్మ ను  స్మృతి   చేయడం వలన, మనిషి లో  ఆలోచనల   వేగం  క్రమేపీ  తగ్గుతూ, శూన్యం అయి,  అవసరమైనంత  వరకే  విషయాల పట్ల   ఎంత  ఆలోచించాలో,  అంతే ఆలోచించ గల వివేకం  మానవ స్పృహ లో  ఏర్పడి  శరీరానికి అవసరమైన  శక్తి   జనిస్తుంది. ఈ విధంగా నిరంతరం చేయడం వలన   మంచి ఆరోగ్యం,  వ్యక్తిగత సమస్యలను  పరిష్కరించుకునే  శక్తి , ఇతరులకు కళ్యాణం అంటే  మంచి చేసే  శక్తి  సహజసిద్ధంగా పరమాత్మ నుండి లభిస్తుంది.  


• ఈ రోజు,  మనిషి  ప్రతి విషయానికి  సైన్స్ పైన ఆధారపడతాడు.   మరి సైన్స్ లో  నిరూపించిన విషయం  మనిషి లో  కూడా దాగి  ఉన్నప్పుడు      నేడు ఎందుకు  సమస్త  మానవాళి  ఆచరించలేక పోతున్నారు.   అంటే  సమాధానం  ఒక్కటే  మనిషి తనలోని   మాయ కి   వశం   అవడం   వలన.


• వాస్తవానికి   ఐన్స్టీన్  కంటే  ముందు గానే  మన మహర్షులు    ధ్యాన యోగ సాధన   ద్వారా  దివ్య జ్ఞాన దృష్టి   పొంది    సృష్టి రహస్యాలను  ఛేదించారు. కానీ,   నేటి  కాలపు  మనిషి  లోని  జ్ఞానం   పూర్తిగా నశించడం  వలన   అజ్ఞానం తో  ప్రతీ విషయానికీ మాయా జాలం   అయిన  ఇంటర్నెట్ ఆధారపడుతున్నాం.  ఈ ఇంటర్నెట్ లో  విషయాలు కొన్ని  మాత్రమే   సత్యతతో , నిబద్ధత తో  ఉపయోగకరంగా ఉంటాయి.   చాలా వరకు అవాస్తవాలు,   తప్పు తోవ  పట్టించే   వ్యాపార దృక్పథాలు  ఇంటర్నెట్ లో  ఉంటాయి. అది జాగ్రత్తగా గమనించు   కోవాల్సిన  బాధ్యత  మనిషి దే.


నీ   ఆలోచనలే  నీ శక్తి …..

  ఉధృతి తో  కూడిన   వ్యర్థమైన  ఆలోచనలు,  అతి ఆలోచనలు   కలిగి  ఉంటే   శక్తి హీనం.

  మిత మైన ,  అవసరం మేరకు  ఆలోచనలు కలిగి ఉంటే  శక్తి మయం.


గమనిక  : ఇది  ఎంతో మంది కి  తెలిసిన  విషయమే  అయినా   సరే మనలో  దాగి  ఉన్న  విశేషతలను సూక్ష్మంగా  అర్దం  చేయించడానికి  మాత్రమే.


యడ్ల శ్రీనివాసరావు 11 Nov 2024 , 9:30 PM.


No comments:

Post a Comment

617. ఏకరసము

  ఏకరసము  • సాగే   నీ సమయం    సంబరం  అది    చేర్చును    నిన్ను అంబరం . • అవని లో    అందలం   ఎక్కినా   మోసే   నలుగురికి    భారం . • ఆ   భార...