Wednesday, November 20, 2024

565. హృదయ జ్యోతి

 

హృదయ  జ్యోతి



• హృదయాంతరమున   వెలిగించు

  జ్యోతి

  తొలగును   అజ్ఞానం.

• ఈ చీకటి   పయనం     

   ఎన్నేళ్ళు     ఎందాక.

• గమ్యం   తెలియని   గమనం లో

   చివరికి    ఏమవుదామని.


• హృదయాంతరమున  వెలిగించు

  జ్యోతి

  తొలగును    అజ్ఞానం.

• వేసే    ప్రతి అడుగు    భారం  అవుతుంటే

  ఇక    ఎప్పుడు    ఎగురుతావు.

• చేసే    ప్రతి కర్మ      వేదన    అవుతుంటే

  ఇక     ఎక్కడ     నీ సంతోషం.


• నీ కై      వేచి ఉంది    ఓ స్వర్గం.

  ధ్యాన     దీపం         వెలిగించు.

  జ్ఞాన     మార్గాన      పయనించు.

• శివ   పరమాత్మ

  నీకై    తెరిచెను   ద్వారం.

• ఇదే   సహజ   రాజయోగం.


• హృదయాంతరమున    వెలిగించు

  జ్యోతి

  తొలగును   అజ్ఞానం.

• ఈ   చీకటి   పయనం 

  ఎన్నేళ్ళు      ఎందాక.

• గమ్యం   తెలియని    గమనం లో

  చివరికి    ఏమవుదామని.


• నీ వెవరో    మూలం    తెలియ కున్నావు.

  నీ సొంత    ఇంటిని    మరిచావు.

• మాయ లో     మునిగి

  నీ తండ్రి ని    గుర్తించ   లేకున్నావు

• నీ పిలుపు  కోసం   చూస్తున్నాడు

  శివ   పరమాత్మ.


• హృదయాంతరమున    వెలిగించు

  జ్యోతి

  తొలగును    అజ్ఞానం.


యడ్ల శ్రీనివాసరావు 20 Nov 2024, 11:30 PM.






No comments:

Post a Comment

617. ఏకరసము

  ఏకరసము  • సాగే   నీ సమయం    సంబరం  అది    చేర్చును    నిన్ను అంబరం . • అవని లో    అందలం   ఎక్కినా   మోసే   నలుగురికి    భారం . • ఆ   భార...