కలియుగ దైవం ఈశ్వరుడు
• శ్రీ వెంకటేశా శ్రీ శ్రీనివాస
నిలువెత్తు నీ రూపం
పలికించే ప్రణతి రాగం.
• గానం ఎరుగను
గమకం తెలియదు
నీ కీర్తనే స్మరణం.
• నీ వజ్ర వైడూర్యముల శోభ తో
ఈ వసుధ విరాజిల్లుతోంది.
• నీ నామ రూపముల స్మరణ తో
మా అజ్ఞానం నశిస్తుంది.
• మూడు నామములు
మూడు లోకములు
ముగ్గురు మూర్తులు.
• వైకుంఠమున శ్రీ మహా విష్ణు వై
సిరుల గిరుల తో భోగి వైనావు.
• కైలాసమున శంకరుడి వై
భస్మ వైరాగ్యం తో ధ్యాని వైనావు.
• సిరుల గిరులు కోరికల ప్రతీకలు
భస్మ వైరాగ్యం సుఖశాంతి స్వరూపాలు.
• శ్రీ వెంకటేశా శ్రీ శ్రీనివాస
నిలువెత్తు నీ రూపం
పలికించె ప్రణతి రాగం.
• గానం ఎరుగను
గమకం తెలియదు
నీ కీర్తనే స్మరణం.
• నీ శంఖు చక్రముల తో
ఈ ధరణి వర్ధిల్లుతుంది.
• నీ భక్తి జ్ఞానముల తో
మా ఊపిరి నిలుస్తుంది.
• మూడు నేత్రములు
మూడు కాలములు
మూడు గుణములు
• సత్య లోకమున శ్రీ లక్ష్మీనాధుని వై
ధర్మ పాలన చేశావు.
• యుగ యుగాలుగా లయకారుని వై
సృష్టి వినాశం చేశావు.
• నీ ధర్మ పాలన నేడు మాయ అధర్మం
నీ సృష్టి వినాశం నేడు కలియుగాంతం.
• శ్రీ వెంకటేశా శ్రీ శ్రీనివాస
నిలువెత్తు నీ రూపం
పలికించె ప్రణతి రాగం.
యడ్ల శ్రీనివాసరావు 16 Nov 2024 9:00 PM
No comments:
Post a Comment