Thursday, November 14, 2024

స్వ దీపం - రామకృష్ణ తులసి

 

స్వ దీపం  

By

(రామకృష్ణ తులసి)



• కోరుకున్న  వన్ని   కొండలుగా  చేర్చినా 

  కొత్త   కోరికలకెపుడు    కొదవలేదు.

• శ్వాస    ఆగువరకు    ఆశ చావని   బతుకుకు

  వైరాగ్యమెటుల     వంటపట్టు.


నాకు  నేను  గొప్ప  ,    నా పేరు గొప్ప.

  నా   ఊరు   గొప్ప   ,   నా  మిత్రులు  గొప్ప.

  నను   కన్నవారు  గొప్ప   

  నా   తోబుట్టువులు  గొప్ప

  చివరికి  ….

  ‘న’   కారము

  నను   నిలువునా   ముంచినా …

  ‘మ’  కారము

  నను   మందలో   వంచించినా ...

  " ఏ "  కారముగ

  ఉంచి    నను   తోడ్కొని  పో    శివా.


• ఎదుట  వాని    తప్పులు

  ఎత్తి   చూపుట    నాకెరుక.

• నాలోని      దుర్గుణములు

  నాకసలు     కనబడవు.

• గురివింద    సామెత

  గురుతెరిగి   మసలినా 

  నా  నలుపు   గురుతుండదు.

  ఏమిటో  శివ  …  ఈ మాయ.


• నే   మంది   లోన    పదిలముగా 

‌  మంచి‌     వినుటకు

  ముందు   వరస   నుండె ...

  ఆచరింప గా   ఆఖరి   నైతిని    శివ.


• నా  రాతలు     నా గీతలు

‌  చేతలుగా   మారు   శక్తి  నివ్వు  శివ.

  ఎన్నడూ   నను   వీడని    ప్రేమసాగరా.


Written by : 

రామకృష్ణ తులసి   

14 Nov 2024, 6:30 AM.



No comments:

Post a Comment

616. శరణుచ్ఛు వాడు

  శరణుచ్ఛు వాడు • శిల లో    లేడు    శివుడు . . .   శిల లో     లేడు . • శరణుచ్ఛు      శివుడు   శిలలో      లేడు . • నీ జననం లో     తండ్రి ...