Thursday, April 10, 2025

619. ఓ యాత్రికుడా

 

ఓ యాత్రికుడా


• ఓ యాత్రికుడా  . . .   ఓ యాత్రికుడా

  తెలుసుకొను    నీ   గమ్యం .


• ఆత్మంటే     అర్దం    ఎరుగక

  ఆత్మీయత లని     ఎగిరే

  నీ  ప్రేమా పాశాలు   నాటకాలు .


• సంసారం    ఓ   జీవిత సారం

  అదే   నీకు   వేదం .


• ఓ  యాత్రికుడా  . . .   ఓ యాత్రికుడా

  తెలుసుకొను    నీ  గమ్యం .


• అలుపెరుగని    కోరికల    కోసం

  వేసే  నీ   దారులు 

  మల్లెలు   పూసిన     ఊబి  నేలలు.


• వైరాగ్యం     ఓ జీవన  రాగం .

  అదే    నీకు   భోగం .


• ఓ యాత్రికుడా   . . .   ఓ యాత్రికుడా

  తెలుసుకొను    నీ గమ్యం .


• నామ రూపాల    కీర్తనలు 

  నిను  నట్టేటను    ముంచే

  మాయా    నావలు .


• ఆనందం    ఓ   అంతఃరసం 

  అదే   నీకు    కైవల్యం .


• ఓ  యాత్రికుడా   . . .   ఓ  యాత్రికుడా

  తెలుసుకొను   నీ  గమ్యం .


• భావోద్వేగాల    అలజడులు

  నీ  శక్తి     నిర్వీర్యకాలు.


• శాంతం     ఓ  సుఖం

  అదే   నీకు   రాజయోగం.


• ఓ యాత్రికుడా  . . .   ఓ యాత్రికుడా

  తెలుసుకొను    నీ గమ్యం .



కీర్తనలు = పొగడ్తలు 

అంతఃరసం  =  మనసు లో   ఊరేది .

కైవల్యం  = మోక్షం 


యడ్ల శ్రీనివాసరావు 10 APRIL 2025 10:00 AM.



No comments:

Post a Comment

624 . గోదారి బంగారం

   గోదారి  బంగారం • దినచర్యలో  భాగంగా నే  యధావిధిగా   సాయంత్రం 5 గంటలకు ,  సరస్వతి ఘాట్ లో   వాకింగ్ కి వచ్చాను.    గేటు దాటి  ఘాట్ లోనికి  ...