శివుడు - భక్తి - జ్ఞానం
• శ్రీ లింగం . . . శ్రీ ముఖ లింగం
జ్యోతిర్లింగం . . . శివ లింగం .
• ఆత్మ ను నేను
పరమాత్మవు నీవు .
• నేనోక బిందువు
నీవొక సింధువు .
• శివ మే నీ నామం
శివ మే నీ నామం .
• సృష్టి కి సూత్రధారి
శక్తి కి సంభూయకారి .
• అమృ తత్వమే నీ అమరనాధము
శివ తత్వమే ఆ విశ్వంభరుడు .
• శ్రీ లింగం . . . శ్రీ ముఖ లింగం
జ్యోతిర్లింగం . . . శివ లింగం .
• ఆత్మ ను నేను
పరమాత్మవు నీవు .
• నేనోక బిందువు
నీవొక సింధువు .
• శివమే నీ నామం
శివమే నీ నామం .
• ఆలయ లింగం
నీ జడ రూపం .
• పరంధామ జ్యోతి
నీ సత్య స్వరూపం .
• నీ జడ లింగ పూజతో
పొందినది అల్పం . . . తాత్కాలికం .
• నీ జ్ఞాన యోగ స్మృతి తో
పొందినది అధికం . . . శాశ్వతం .
• భక్తి లో నిలిచాము
నీ ఎదురు అభాగ్యుల మై .
• జ్ఞానము లో కలిసావు
మా బుద్ధిలో తండ్రి వై .
• శ్రీ లింగం . . . శ్రీ ముఖ లింగం
జ్యోతిర్లింగం . . . శివ లింగం .
సంభూయకారి = కలిసి కూడా ఉండేవాడు.
విశ్వంభరుడు = శ్రీ మహా విష్ణువు.
సింధువు = మహా సముద్రం
జడ = చలనం లేని
పరంధామం = పరమాత్మ నివాసం,
యడ్ల శ్రీనివాసరావు 19 APR 2025 , 9:30AM.
No comments:
Post a Comment