Wednesday, April 23, 2025

629. శివుని గురించి ఇది తెలుసా?

 

శివుని గురించి ఇది తెలుసా?




• శివుని  యుగ యుగాలుగా  అనగా త్రేతాయుగం మధ్యకాలం  నుంచి  ద్వాపర యుగం  మరియు నేటి కలి యుగం  అంత్య సమయం  (ప్రస్తుత కాలం) వరకు మానవులందరూ   పూజిస్తూ,  ప్రార్థిస్తూ నే  ఉన్నారు .

  త్రేతాయుగము నందు   శ్రీ రాముని  ద్వారా శివుని ఆత్మలింగం  రామేశ్వరం లో  ప్రతిష్ట  చేసారని పురాణాలలో ఉంది.   శివుని ని  అనాది  నుంచి లింగ రూపంలో  నేటి వరకు  భక్తి తో  పూజిస్తూనే ఉన్నాం.


• దేవాలయాలలో కానీ,  ఫోటోలలో కానీ   శివుని లింగం  పై  గమనిస్తే ,  అడ్డం గా  మూడు విభూతి నామాలు,   మధ్య లో   ఎర్రని  చిన్ని కుంకుమ బొట్టు ఉండడం  గమనిస్తాం.   కానీ అసలు అలా ఎందుకు పెడతారు,  దానికి మూలార్దం  ఏమిటి ?  అనేది మనలో ఎవరికీ తెలియదు .


  శివ లింగం పై   ఉన్న  మూడు విభూతి నామాలు, బ్రహ్మ విష్ణు శంకరుల  ప్రతీకలు .  మధ్య లో ఉన్న ఎర్రని బిందువు ,  బొట్టు తో  చూపించే సూక్ష్మ స్వరూపమే  శివుడు.  ఈ బిందు  సూక్ష్మ రూపాన్ని జ్యోతి  స్వరూపం అని అంటారు.  అదే శివుని  అసలు శక్తి  రూపం .


• శివుని  అందరూ  పరమ శివుడు,  పరమాత్మ అంటారు.  పరమ అంటే పరలోకం .  ఇహం కాని మరో లోకం లో   చైతన్య వంతమైన  జ్యోతి వలే  ప్రకాశిస్తూ సూక్ష్మ  బిందువు  వలే  అనంతమైన శక్తి తో ఉంటాడు శివుడు .

  ఈ విశ్వం లో మానవులు ఉండేది స్థూల లోకం, తరువాతి దేవతలు ఉండేది   సూక్ష్మ లోకం,  ఆ పైన ఉండేది   మూల వతనం లేదా పరలోకం అంటారు . ఈ పరలోకం ఎరుపు పసుపు రంగు లతో నిండి ఉంటుంది. ఇదే శివుని నివాస స్థానం , పరంధామం అని అంటారు .


• దీనంతటికీ  నిదర్శనంగా   శివుని లింగం మీద మూడు నామాలు,  మధ్య  ఎరుపు రంగులో  సూక్ష్మ బిందువు గా  శివుని  చూపిస్తారు …. అనేక విషయాల కు అర్దం తెలియకుండానే భక్తి చేస్తూ ఉంటాం . భగవంతుని జ్ఞానం ద్వారా మాత్రమే వాటి అర్దం తెలుసుకో గలుగుతాం .


  బ్రహ్మ  విష్ణు  శంకరులు    సూక్ష్మ దేవతలు .  వీరు శివుని  యొక్క సృష్టి.   అందుకే   విభూతి   మూడు నామాలు గా   వారిని చూపిస్తూ,  మధ్య శివుని బిందువు గా చూపిస్తారు.  శివుని కి దేహం ఉండదు. శివుడు పరమాత్ముడు. జనన మరణాలకు అతీతుడు.

 బ్రహ్మ.  ద్వారా సృష్టి,   విష్ణువు ద్వార పాలన, శంకరుని  ద్వారా   వినాశనం జరుగుతుంది.  ఇది శివుడు  వారికి   నిర్దేశించిన కర్తవ్యం.   

మానవులు  శివుడు, శంకరుడు ఒకటే అనుకుంటారు కానీ అది అసత్యం.   శివుడు విశ్వ సృష్టి కర్త. శంకరుడు వినాశనకారి . అధర్మం  పెరిగినపుడు చెడును  సంహరించి   తిరిగి  మంచిని స్థాపన కోసం చేసే విధ్వంసకారి శంకరుడు .  ఇదే నేటి కాలంలో  ప్రకృతి  ద్వారా జరిగే  విలయ  తాండవం.


 🙏🙏🙏🙏


•  Earth భూమి :   భూకంపాలు ఇటీవల ధాయ్ లాండ్ ,  మయన్మార్,  జపాన్ ఇంకా అనేక దేశాలలో ఏక క్షణం లో  సంభవించిన భూకంపాలు.  భూమి పై అనేక దేశాలు యుద్ధాలు, అణు యుద్ధాలు చేస్తాయి. 


•  Water నీరు :  సునామీలు రాబోయే  అతి కొద్ది కాలంలోనే  ఊహించని విధంగా సముద్రం పొంగి కొన్ని తీర దేశాలు లేకుండా అయిపోతాయి. ఇటీవల ఆరు నెలలు క్రితం  ఎడారి ప్రాంతం  అయిన కువైట్, అబుదాబి లో  చరిత్రలో  ఎన్నడూ లేని విధంగా వరదలు , విపరీత వర్ష పాతం తో సుమారు రెండు వారాలు జన జీవనం అల్లకల్లోలం అవడం గమనార్హం .

•  Fire అగ్ని  :   అగ్ని దావానాలు  ఎన్నడూ ఊహించని  విధంగా   రెండు నెలల క్రితమే  అమెరికా లో కాలిఫోర్నియా సిటీ లో అధికశాతం మరియు హాలీవుడ్ పూర్తిగా వేడికి  చెట్లు  అంటుకొని గాలి వీచి క్షణాల్లో  ఆ మంటలకు ఆహుతి అయి పోయాయి. వారం రోజుల పాటు ఈ మంటలు కొన్ని 150 కిమీ మేర వ్యాపించి నా   సరే అమెరికా వంటి అగ్రరాజ్యం ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయింది . . .

 కరెక్ట్ గా ఒక నెల క్రితం  సౌత్ కొరియా లో  ఎండిన చెట్లు వేడికి సహజంగా  అంటుకొని,  కొన్ని గంటల సమయంలో దాదాపు 600 కిలో మీటర్ల దూరం వరకు గాలితో వ్యాపించి    కొన్ని నగరాలకు నగరాలు స్మశానం  అయ్యాయి. 


Wind గాలి  : వారం రోజుల క్రితం  వేసవి కాలంలో గంటకు 250 కిలోమీటర్ల వేగంతో  వర్షం తో  వీచిన గాలుల తో  చైనా షాంగాయ్ నగరం, జన జీవనం వారం రోజుల పాటు నిరంతరాయంగా  అల్ల కల్లోలం అయిపోయింది.  ఇంకా  ఎడారులలో ఆరంభమైన ఇసుక తుఫానులు రాబోయే రోజుల్లో నగరాలను పూర్తిగా రోజుల తరబడి  కమ్మెస్తాయి .


Space శూన్యం :   రాబోయే రెండు సంవత్సరాల లో ఇంటర్నెట్  సమాచార  వ్యవస్థ పూర్తిగా ప్రపంచ వ్యాప్తంగా  నిర్వీర్యం అవుతుంది  అనేది  నేడు అనేక దేశాల  యుద్ధ నిపుణుల అంచనా . ఇందుకు కారణం, రష్యా  ఇప్పటికే  అణ్వస్త్ర శాటిలైట్ లను  space లో మోహరించింది .  ఏ సమయంలో  నైనా ఇవి ఆపరేట్ చేస్తే   ప్రపంచ వ్యాప్తంగా  కమ్యూనికేషన్  వ్యవస్థ పూర్తిగా  నిర్వీర్యం అవుతుంది.


• పంచ భూతాలు , ప్రకృతి కలిసి  శంకరుని శక్తి తో ఇప్పటికే విలయ తాండవం చేయడం ఆరంభించాయి. ఇది ముందు ముందు పెరిగి , ఈ మూడు వంతుల ప్రపంచం మరియు భారతదేశం కొంతభాగం నాశనం అవుతుంది. …. 

తిరిగి మరలా  సత్య యుగం భారత దేశం నుంచి ఆరంభం అవుతుంది. ఎందుకంటే భారతదేశం లో నే శివుని  యొక్క శక్తి  స్వరూపం  ఇప్పటికే  90 సంవత్సరాల క్రితం అవతరించి ఉంది .  సత్య యుగం లో ఎవరైతే జన్మ ఎత్తిన   ఆత్మలు ఉన్నాయో  వారు తిరిగి ఇప్పుడు   జన్మించి ఉన్నారు . అటువంటి  వారందరికీ ఈ  సత్యమైన  విషయం తెలుసు. ఎందుకంటే వారందరూ  ఇప్పటికే  మనసా వాచా కర్మణా ,  తనువు  మనసు  ధనం ద్వారా   శివుని తో  అనుసంధానం అయి,   తమ సంకల్పాల  శక్తి ద్వారా  విశ్వ  పరివర్తన లో  నిమగ్నమై ఉన్నారు .


భగవద్గీతలో   శ్రీకృష్ణుడి ద్వారా  శివుడు  ఈ విషయం ఇలా చెప్పాడు.  ధర్మం  నశించినపుడు  తప్పకుండా తాను  భరత భూమి పై అవతరిస్తాను అని.

భగవద్గీత 4-7

“ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత |

అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ || ”


యడ్ల శ్రీనివాసరావు 23 APR 2025 , 9:00 PM .





No comments:

Post a Comment

695 . కొడుకా ఓ కొడుకా !

  కొడుకా    ఓ     కొడుకా ! • కొడుకా  ఓ  కొడుకా  !   కొడుకా  ఓ  కొడుకా  ! • అమ్మవారి   కంటే    ముందు   నీ   అమ్మను   కొలువ  రా  . . .  • పండ...