Fairness - స్వచ్ఛత
• పూర్వం రోజుల్లో , కొన్ని తరాల క్రితం ఈ స్వచ్ఛత fairness అనే పదం అందరూ దేహ స్వరూపం లో ముఖ వర్చస్సు , వస్త్ర ధారణ శుభ్రత విషయం లో ఉపయోగించే వారు . ఆ పదం శరీర అందం కోసం వర్ణించే వారు.
ఎందుకంటే ఆ పూర్వ కాలం లో అందరూ ఇతరులను దేహభిమానము తో చూసేవారు , గౌరవించే వారు . ఎందుకంటే ఆరోజుల్లో వారికి మనుషుల మనసు ల గురించి, వాటి అంతర్గత లోతు స్వభావం గురించి మరియు వాటి శుభ్రత , స్వచ్ఛత (fairness) అనే విషయాలు కనీసం అవగాహన ఉండేది కాదు. వారికి ఆ అవసరం ఉండేది కాదు. ఎందుకంటే , ఆ రోజుల్లో ప్రతి ఒక్కరి స్వభావ సంస్కారాలు ఏ కల్మషాలు లేకుండా స్వచ్ఛంగా, శుభ్రత తో (fairness) ఉండేవి.
• అందుకే సామాన్య ఆదాయం కలిగి ఉండి, 10 మంది పిల్లలు ఉన్న ఉమ్మడి కుటుంబాలు కూడా ఒకే మాట పై ఉండేవారు, ఆనందం గా జీవించే వారు. సంఘం, సమాజం అంతా ఒక మాట పై నడిచేవి. మనుషుల లో స్వతంత్రత , స్వేచ్ఛ అనేవి పూర్తిగా ఐకమత్యం లో ఇమిడి పోయి ఉండేవి.
☘️☘️☘️☘️☘️☘️
• కానీ నేటి కాలంలో ఫెయిర్ నెస్ అనే పదం పూర్తిగా మనిషి మనసు కి , మనిషి అంతర్గత స్వభావానికి సంబంధించినదిగా మారిపోయింది . ఎందుకంటే నేటి కాలంలో ప్రతీ ఒక్కరూ తమ స్థితులు , పరిస్థితులు బట్టి మానసిక కాలుష్యం తో జీవించడానికి అలవాటు పడిపోయి ఉన్న వారే.
• నేటి కాలం లో స్వతంత్రత, స్వేచ్ఛ అనేవి మనిషి యొక్క వ్యక్తిగతం గాను , మనోభావాలు గాను పరిగణించే స్థాయి కి తన మానసిక స్థితి ని ఏర్పరచు కున్నాడు . మనిషి ఎప్పుడైతే వీటి పై అధికారి గా తయారు అయ్యాడో , తాను ఏది ఎలా చేసినా సరే తాను పెర్ఫెక్ట్ అనే భావం , తనకు తానే గొప్ప అనే భావన పొందుతున్నాడు .
ఇలా ప్రతి మనిషి ఎవరికి వారే తాము కరెక్ట్ అని అనుకోవడం చాలా సహజంగా అయిపోయింది. అంతే కాని , నేను చేస్తున్నది కరెక్టా , కాదా అని కనీసం ఆత్మ విమర్శ చేసుకోవడం లో పూర్తిగా . . . . పూర్తిగా విఫలం అవుతున్నారు. దీనికి కారణం కనీసం , తమ యధార్థ స్థితి పై తాము నియంత్రణ కోల్పోవడం మరియు ఆలోచించే గుణం లేకపోవడమే .
• ఈ విషయం బట్టే తెలుస్తుంది , మనిషి కి స్వచ్ఛత, శుభ్రత ( fairness) అనేది తన మనసులో కొరవడుతోంది అని . తద్వారా అహంకారం , అజ్ఞానం , మూర్ఖత్వం , మాయా వికారాలు రాజ్యమేలుతున్నాయి అని .
🌹🌹🌹🌹🌹
అసలు ఈ ఫెయిర్ నెస్ ను ఎలా చెక్ చేసుకోవాలి.
• మనం మాట్లాడే మాటలు, చేసే కర్మలు అసలు ఎంత వరకు నిజాయితీ తో ఉంటున్నాయి. అందులో మనల్ని మనం ప్రతీ విషయం లో సమర్థించుకుంటూ సరిపెట్టుకుంటున్నామా ? లేదా లోపాలను సరిచేసుకుంటూ ఉత్తమం గా మార్చుకుంటున్నామా ?
• మన కోరికలు , అవసరాలు తీర్చుకునేందుకు తగినట్లుగా మన వ్యక్తిత్వాన్ని ఎవరు చూస్తారు లే అని, అస్తమాను మార్చుకుంటూ ఉంటామా ? లేదా ఒక నిబద్ధత, విషయ పరిశీలన తో ధృడం గా నిశ్చయం తో ఉంటామా ?
• వ్యక్తిత్వ హద్దులు మరచి విస్తృత మైన ఆలోచనలు చేస్తూ వాటి పరిధి పెంచుకుంటూ, speculation తో I am always perfectly correct అనే ముసుగులో , కర్మలు(actions) చేస్తూ ఉంటామా ?
• కళ్లెం లేని మనసు కి , స్వచ్ఛత శుభ్రత (fairness) అనేవి కొరవడతాయి అనేది వాస్తవం. ఇది ఆత్మ లో కుసంస్కారమై మరలా జన్మాంతరాలు మనిషికి ఆపాదన అవుతుంది .
• నేడు ఫెయిర్ నెస్ అనేది మనసు కి సంబంధించిన అంశం . ఇది ఎవరికి వారే స్వయంగా చెక్ చేసుకోవాల్సిన అంశం. ఎందుకంటే , ఫలితం ఎవరికి వారే అనుభవిస్తారు.
• ఒక మనిషి మనసు ఫెయిర్ గా ఉంటే , తనకు ఉన్నంత లో సంతోషంగా ఉంటాడు. ఏ లోటు ను అనుభవించడు. ఈ గందర “గోళం” లో గజిబిజి గా ఉండడు. మంచి ఆరోగ్యం తో ఉంటాడు.
ఎందుకంటే మానసిక శక్తే మనిషి ని మనిషి గా నిలబెడుతుంది …. ఎన్నటికైన …. ఎన్నాళ్లైన
యడ్ల శ్రీనివాసరావు 11 APR 2025 10:00 PM.
No comments:
Post a Comment