వెలుగు రేఖలు
• ఎన్నో జన్మల భాగ్యం
ఈ వెలుగు రేఖలు .
• అలసిన వారే తీరం చేరును .
సొలసిన వారికే అమృతం దొరకును .
• తీరం తో తనివి తీరుతుంది తనువు .
అమృతం తో అమరం అవుతుంది ఆత్మ .
• ఎన్నో జన్మల భాగ్యం
ఈ వెలుగు రేఖలు .
• ఓర్పు సహనం
రెండు కళ్లు అయిన నాడు
కాలం
నీ మనో నేత్రమే కదా .
• మాయా మెరుపులు
క్షణ భంగుర ఆకర్షణలు .
• రెప్పపాటులో సత్ బుద్ధి ని
ఆవిరి చేసే నీటి బుడగలు .
• ఎన్నో జన్మల భాగ్యం
ఈ వెలుగు రేఖలు .
• అలసిన వారే తీరం చేరును .
సొలసిన వారికే అమృతం దొరకును .
• తీరం తో తనివి తీరుతుంది తనువు .
అమృతం తో అమరం అవుతుంది ఆత్మ .
• భ్రమలలో బొంగరమై న
బొమ్మ వే కదా నీవు .
• నీవి కాని
ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలతో
నీవేమి మోసుకెళతావు .
• ఎన్నో జన్మల భాగ్యం
ఈ వెలుగు రేఖలు .
అలసిన = శ్రమ చేసిన
సొలసిన = చెమ్మగిల్లిన
యడ్ల శ్రీనివాసరావు 7 APR 2025 3:30 AM
No comments:
Post a Comment