Thursday, April 10, 2025

620. మౌనభాష

 

మౌనభాష 



• మౌన   భాష     తెలుపు

  నీ    అంతర్ముఖతను .

• అందు      చూపు

  నీ    స్థితి    రూపతను  .


• బాహ్య  భాషల   రణగొణులు

  మనసులో    నింపును

  మలినాలు    . . .  మలినాలు .


• ఆసక్తి ని    పెంచే     వ్యర్ధ మాటలు 

  నీ శక్తి ని    తుంచే     జీవాయుధాలు .


• మౌన    భాష     తెలుపు

  నీ    అంతర్ముఖతను .

• అందు     చూపు

  నీ    స్థితి    రూపతను .


• బాహ్య   భాషల    ఘోషల లో

  నిండి ఉండును

  విష  వాయువులు   . . .  విష  వాయువులు.


• తేనే  లొలుకు   అపరిపక్వ  పలుకులు 

  కానరాని    కలతల    కారకాలు .


• మౌన    భాష    చేయు

  నీ     మనసును    శుద్ధము.

• అందు       పెరుగు

  నీ   శుభ   సంకల్పపు   శక్తులు .


• మౌనం     మహిమాన్వితం

  మౌనం     మహిమాన్వితం .


కానరాని = కంటికి కనపడని

కలతలు = Disturbance , చిందర వందర



యడ్ల శ్రీనివాసరావు 10 APR 2025 10:00 PM 



No comments:

Post a Comment

624 . గోదారి బంగారం

   గోదారి  బంగారం • దినచర్యలో  భాగంగా నే  యధావిధిగా   సాయంత్రం 5 గంటలకు ,  సరస్వతి ఘాట్ లో   వాకింగ్ కి వచ్చాను.    గేటు దాటి  ఘాట్ లోనికి  ...