శరణుచ్ఛు వాడు
• శిల లో లేడు శివుడు . . .
శిల లో లేడు .
• శరణుచ్ఛు శివుడు
శిలలో లేడు .
• నీ జననం లో తండ్రి యై
జన్మాంతరాలు విడువక ఉన్నాడు.
• పాప గా లాలిస్తూ
కనుపాప గా ప్రేమిస్తూ ఉన్నాడు .
• శయ్య న నీడవుతూ
నీ మరణ శయ్య న తోడున్నాడు .
• శిల లో లేడు శివుడు . . .
శిల లో లేడు.
• శరణుచ్ఛు శివుడు
శిలలో లేడు .
• ఆలోచన లలో శివుడు ఉంటే
అంబరం ఎక్కుతారు .
• ఆదమరచి ఉంటే మాయకు
ఆహారం అవుతారు .
• నీ ఈతి బాధలన్నీ చేసిన
కర్మల ఫలితాలు .
• అవి శివుని యోగాగ్ని తోనే
హారతి అగును .
• అడగనిదే అమ్మ
అన్నము పెట్టునా .
• పిలవనిదే శివుడు
పిల్లలకు పలుకునా .
• శిల లో లేడు శివుడు . . .
శిల లో లేడు.
• శరణుచ్ఛు శివుడు
శిల లో లేడు.
• కనులకు కానరాని శివుడు
మనసుకి మధురానుభూతి నిస్తాడు .
• స్పర్శ కి తాకలేని శివుడు
దేహాన్ని పరవశింప చేస్తాడు .
• శివ నామ స్మరణం
సుఖ శాంతుల సంగమం .
• శివ గీతా సారం
పాప పుణ్యాల జ్ఞానం .
• శిల లో లేడు శివుడు . . .
శిలలో లేడు .
• శరణుచ్ఛు శివుడు
శిల లో లేడు .
శరణుచ్ఛు = రక్షణ ఇచ్చు
శయ్య = నిదుర, పడక
యడ్ల శ్రీనివాసరావు 2 Apr 2025 6:00 AM
No comments:
Post a Comment