ఏకరసము
• సాగే నీ సమయం సంబరం
అది చేర్చును నిన్ను అంబరం .
• అవని లో అందలం ఎక్కినా
మోసే నలుగురికి భారం .
• ఆ భారం అవుతుంది
తిరిగి నీకు ఓ బుణం .
• రాజయోగ సాధనతో కావాలి
నీవొక సూక్ష్మ స్వరూపం .
• బిందువు గా మారి
జ్ఞాన సింధువు లో కలిసి
చేరాలి విశ్వనాథుని సన్నిధి .
• సాగే నీ సమయం సంబరం
అది చేర్చును నిన్ను అంబరం .
• వైకల్యపు కర్మ ఫలితాలు
మోయలేని భారం .
• ఆ భారం తో భూమి ని
విడవడం నరకం .
• ఏకరసమై కావాలి శివ సంధానం .
అది చేర్చును నిన్ను అంబరం .
• సాగే నీ సమయం సంబరం
అది చేర్చును నిన్ను అంబరం .
అవని = భూమి
అంబరం = ఆకాశం.
అందలం = పల్లకి
ఏకరసము = ఒకే ఒక మానసిక స్థితి.
యడ్ల శ్రీనివాసరావు 4 APR 2025 9:00 AM.
Mr.Srinivas, i see lot of your writings have lot of expressions, small and effective. but i find lot of words difficult to understand. i guess telugu is not your mother tongue. Are you trying to write every thought as a song? i believe you are able to sing with a beautiful tune on all your writings. keep up good writing.
ReplyDeleteThank you so much 🙏. My mother tongue is Telugu. Some words belongs to ancient తెలుగు గ్రాంధికం. I am giving the meaning to such words below my content. .... Yes I am writing the thoughts in the form songs. Thank you so much 🙏
ReplyDelete