కనుల లోని మేఘం
• వర్షించ కే . . . వర్షించ కే
నీలాల కనులలో నీలి మేఘమా
వర్షించ కే .
• హర్షించ వే . . . హర్షించ వే
నీలాల కనులలో నీలి మేఘమా
హర్షించ వే .
• వర్షించి నా మోము
వెల వెల పోవు నే .
• హర్షించి నా నవ్వు
మిల మిల మెరియు నే .
• కనుల కు
బరువు కాని మేఘమా
మనసును
కడిగే ను నీ ఆర్ద్రం .
• భావాల భారాల
ఊటను
తేలిక చేసేను నీ తేమం .
• వర్షించ కే . . . వర్షించ కే
నీలాల కనులలో నీలి మేఘమా
వర్షించ కే .
• హర్షించ వే . . . హర్షించ వే
నీలాల కనులలో నీలి మేఘమా
హర్షించ వే .
• ఆనంద బాష్పమై హర్షం ఇస్తావు
ఎడారి మనసులకు .
• అదిమిన వేదనంతా వర్షం చేస్తావు
బంజరు మనుషులకు .
• కనుల లో దాగిన మేఘమా
శాంతమే నీ ఉద్వేగం .
• మనసు లో నిండిన మేఘమా
మౌనమే నీ సౌందర్యం .
• వర్షించ కే . . . వర్షించ కే
నీలాల కనులలో నీలి మేఘమా
వర్షించ కే .
• హర్షించ వే . . . హర్షించ వే
నీలాల కనులలో నీలి మేఘమా
హర్షించ వే .
యడ్ల శ్రీనివాసరావు 27 APR 2025 9:30 AM.
No comments:
Post a Comment