విరాజమానం
• గోదావరి మిల మిలలు
నా గుండె గలగలలు .
• కలిసాయి ఈ సంధ్య లో
మెదిలాయి ఓ రాగమై .
• గోదావరి మిల మిలలు
నా గుండె గలగలలు .
• కలిసాయి ఈ సంధ్యలో
మెదిలాయి ఓ రాగమై .
• ముద్దుగుమ్మ గోదారి
ముచ్చటగా చూస్తుంది .
• మురిపాలు చిందిస్తూ
రా … రా … అంటున్నది .
• గజ్జెల ఘల్లు ల్లే
ఉరుకుతున్న కెరటాలు .
• గాలులు చిందుల తో
కూస్తున్న రాగాలు.
• ఇదే కదా . . . ఇదే కదా
సంగమం. . . . ప్రకృతి సంగమం.
• ఇదే కదా . . . ఇదే కదా
పరవశం . . . ప్రకృతి పరవశం.
• గోదావరి మిల మిలలు
నా గుండె గలగలలు .
• కలిసాయి ఈ సంధ్య లో
మెదిలాయి ఓ రాగమై .
• కలల అలల వలల లోని
మీనమైన నేను
దిగులు సెగల వగల లో లేను.
• అసలు సిసలు దిశల లోని
మైనా అయిన నేను
దశల కుశల సుజల పై ఉన్నాను .
• గోదావరి మిల మిలలు
నా గుండె గలగలలు .
• కలిసాయి ఈ సంధ్య లో
మెదిలాయి ఓ రాగమై.
విరాజమానం = మిక్కిలి ప్రకాశించునది.
మీనం = చేప
దిశలు = మార్గాలు, దారులు
మైనా = కోకిల
దశలు = జాతక గ్రహ దశలు.
సుజల = కమలము
యడ్ల శ్రీనివాసరావు, 22 APR 2023 10:00 PM .
No comments:
Post a Comment