విశ్వ రాజసం
• కనులకు ఏమయిందో
కలలను కాదంటుంది .
కాదంటుంది . . . కలలను కాదంటుంది .
• కలల లో వెలిగే కాంతులను
చూడనంటుంది . . . చూడలేనంటుంది .
• బహుశా . . . బహుశా
కలలకు చీకటి కావాలేమో
కావాలేమో . . . చీకటి కావాలేమో .
• నిశి లో విరిసిన శిశిరమా
శశి నే దాచిన తరుణమా
• కలలు లేని కనుల లో
కలవ లేని కలవరింతలు
మౌనం గా ఉన్నాయి.
• అలల లోని గాలులు
వీనుల ను వయ్యారం గా
తాకుతూ ఉన్నాయి .
• కాంతి లేని ఏకాంతం
ఏకం చేస్తుంది కమ్మగా
విశ్వ రాజసం తో .
• నిశి లో విరిసిన శిశిరమా
శశి నే దాచిన తరుణమా
• కనులకు ఏమయిందో
కలలను కాదంటుంది .
కాదంటుంది . . . కలలను కాదంటుంది .
• కలల లో వెలిగే కాంతులను
చూడనంటుంది . . . చూడలేనంటుంది .
• బహుశా . . . బహుశా
కలలకు చీకటి కావాలేమో
కావాలేమో . . . చీకటి కావాలేమో .
నిశి = చీకటి
శిశిరం = మంచు , చల్లని , బుతువు
శశి = చంద్రుడు
వీనులు = చెవులు
యడ్ల శ్రీనివాసరావు 14 APR 2025 6:00 AM.
No comments:
Post a Comment