Saturday, September 6, 2025

686 . ఆత్మ స్థితం

 

ఆత్మ  స్థితం 


• ఆత్మ   నైన   నేను

  పరమాత్మ ను    చూస్తున్నాను .

• సూక్ష్మ   బిందువైన   నేను

  శివుని  స్మృతి   యాత్ర ను   చేస్తున్నాను .


• ఈ దేహం లో    నేను    ఉన్నాను .

  ఈ దేహం  

  దహనమైనాక   కూడా   ఉంటాను .

• నా    పేరు   ఆత్మ .

  మరణం  లేని    చైతన్యం   నేను .


• ఆత్మ     నైన   నేను

  పరమాత్మ ను    చూస్తున్నాను .

• సూక్ష్మ    బిందువైన    నేను

  శివుని  స్మృతి  యాత్ర ను   చేస్తున్నాను .


• ఒకా   నొక  నాడు . ‌. .

‌ నా తండ్రి    పరమాత్మ ను

‌ విడిచి   భూమి   పై కి    వచ్చాను .

• జన్మలు    తీసుకున్నాక

‌  బంధనాల   వలలో    

  బందీ   అయ్యాను .

• కర్మల   గుహ్యం   తెలియక

  మాయ లో    ఎన్నో

  వికర్మలు    చేశాను .


• భవ  బంధాల లో   ఎన్నడూ 

  సత్యత    కాన  రాలేదు  

  సరికదా  . . .  అవి 

  కర్మ  బుణాలని   తెలిసింది  . 

• ఐహిక    భోగాల లో   ఎన్నడూ 

  సుఖశాంతులు   కాన  రాలేదు

  సరికదా  . . .  అవి 

  నీటి  బుడగ లని   తెలిసింది .


• ఈ గందర  " గోళం " లో  . . .

  నా తండ్రి    పరమాత్మ ను  మరచి 

  అనాధ లా    అయ్యాను .


• ఆత్మ    నైన   నేను

  పరమాత్మ ను      చూస్తున్నాను .

• సూక్ష్మ   బిందువైన    నేను

  శివుని  స్మృతి   యాత్ర ను   చేస్తున్నాను .


• ఈ  దేహం లో    నేను    ఉన్నాను .

  ఈ  దేహం   

  దహనమైనాక   కూడా  ఉంటాను .

• నా   పేరు   ఆత్మ .

  మరణం  లేని   చైతన్యం   నేను .



గుహ్యం  =  రహస్యం 

ఐహిక  =    ప్రాపంచిక 

గోళం  =  భూమి 


యడ్ల శ్రీనివాసరావు 6 Sep 2025 , 10:00 AM.


Thursday, September 4, 2025

685 . వినాయకుని విశిష్టత

 


వినాయకుని విశిష్టత


• ప్రస్తుతం అంతా గణపతి నవరాత్రుల సందడి జరుగుతుంది. విగ్రహాలను నిలబెట్టడం లో వీధి వీధిలో పోటీ, చందాలను వసూలు చేయడం లో  (అనేక ప్రాంతాలలో ) భక్తి  పేరుతో  దౌర్జన్యం , మండపం లో దేవుని పాటలు ఉదయం ఒక గంట  మిగిలిన రోజంతా డి.జే. వికారీ  పైత్యపు పాటలు . . . 

చివరి రోజు లడ్డూ వేలం పాటలో   హంగు ఆర్భాటం , ఇక ఆఖరి ఘట్టం నిమజ్జనం ఊరేగింపు లలో  తాగి తందనాలు , గుడ్డలు చింపుకొని డాన్సులు , డి.జే లలో  వికారీ సాహిత్య సినిమా పాటలు …. ఇది నేటి కాలంలో మనిషి భక్తి   పేరుతో  ప్రత్యక్షంగా  దేవుని కోసం  సృష్టించుకున్న   సంస్కృతి .   

కానీ విచిత్రం ఏమిటంటే ,   ఇదే  నేడు మానవులందరికీ  చాలా  ఆహ్లాదకరం  . ఈ విధమైన  వ్యవహారాల తో చేస్తున్న  గణపతి పండుగ  యే అనేకులకు  ఓ విశిష్టత ,  ఒక పెద్ద వినోదం (ఎంటర్టైన్మెంట్) . ఎందుకంటే వారందరి జీవితాలు  ఒత్తిడి తో నిండిపోయాయి కాబట్టి ఈ రకమైన వినోదం అవసరం . 

• నేడు గణపతి గురించి ఇంతకు మించి గొప్ప గా చెప్పుకోవడానికి, సమాజం లో మనిషి దగ్గర  ఏమైనా సమాధానం ఉందా ? . . .  అంటే  అది మనం కొంచెం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తుంది.  ఎందుకంటే, నేడు అందరూ కాస్త అటుఇటుగా చూస్తున్నది, చేస్తున్నది,  ప్రోత్సాహిస్తున్నది   ఇదే కదా . భగవంతుని పై ఈ భక్తి ఒక వినోదం , కాలక్షేపం . అందుకే ఇది కలికాలం, మాయా కాలం, పోయే కాలం, వినాశన కాలం .


• అసలు వినాయకుడు గురించి మనం మన తరాలకు ఏం చెపుతున్నాం ? అంటే ఒక అద్భుతమైన  కధ . ఇది కల్పితమా ?  వాస్తవమా? అనేది మనిషి చిన్ని మేధస్సు కు తెలియదు . . .  శివుడు తపస్సు చేసి చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చాడు. ఇంతలో పార్వతీ దేవి ఒక బాలుడు ని కాపలా పెట్టి స్నానానికి వెళ్ళింది. ఆ బాలుడు శివుడి ని అడ్డగించడం వలన శివుడు కోపంతో ఆ చిన్న బాలుడి తల నరికేశాడు. ఆ తర్వాత పార్వతి దేవి ఏడుస్తూ ఉంటే శివుడు ఏనుగును చంపి , దాని తలను ఆ బాలుడికి అతికించాడు . అసలు వింటుంటే, వినాయక వ్రత కల్ప పుస్తకం లో ఇదంతా చదువుతూ ఉంటే ... ఆహా ఎంత అద్భుతం . అనిపిస్తుంది కదా.  ఎందుకంటే మనిషి  మనస్సాక్షి  గుడ్డిది అయిపోయింది కాబట్టి .

• ఇలాంటి కధలు ఎవరు రాసారో, ఎందుకు రాసారో ఆ   భగవంతుడికి కూడా తెలియదు .


• శివుడు సృష్టి కర్త .  పరంజ్యోతి బిందు శక్తి స్వరూపుడు . శివుడు పరమాత్మ. శివుని కి  దేహం లేదు కాబట్టి  లింగాకారం చూపించారు. మరి శివుడు  తపస్సు చేయడం ఏంటి ? ఆ తపస్సు ఎవరి కోసం చేసాడు ? సరే … సాధారణంగా తపస్సు పూర్తి చేసినవారు క్రోధం , అహం వంటివి జయించి శాంతమైన మనసు తో ఉంటారు. అటువంటిది , కనికరం లేకుండా అహం తో చిన్న బాలుడి తల , లోక రక్షకుడు అయిన  శివుడు నరకడం ఏంటి ? వీటికి మనలో సమాధానాలు ఉన్నాయా ? ఆలోచించండి.


• అసలు శివుడు కి, శంకరుడికి తేడా గ్రహించ లేని స్థితిలో కధలు రాశారు. శివుడు సృష్టి చేస్తాడు . బ్రహ్మ విష్ణు శంకరులు శివుని యొక్క సృష్టి రచన . బ్రహ్మ ద్వారా స్థాపన , విష్ణువు ద్వారా పాలన , శంకరుని ద్వారా వినాశనం (మంచి కోసం, రీ సైక్లింగ్) జరుగుతుంది . శంకరుడు కూడా శివుని ని ధ్యానం తో స్మృతి చేస్తాడు. 


☘️☘️☘️☘️☘️☘️☘️


• ఇకపోతే  . . . వినాయకుడు . . . గణపతి .

ఓం   గం   గణపతయే  నమః.

" ఓం "  ఆత్మ  నైన  నేను  

“ గం ”  అనే శబ్ద తరంగం ఉచ్ఛారణ చేయడం వలన

“ గణ ” (గణములు) శరీర నరముల చైతన్యానికి 

“ పతియే ”   ఆధిపత్యము వహించు వానికి

“ నమః “  ప్రణామములు .


• ఈ గణపతి  మంత్ర నామం నిత్యం సవ్యంగా 108 సార్లు , ఆ పైన ఉచ్చరించడం వలన మానవుని నరములు చైతన్యం అయి, మూలాధారం (నాభి కింది స్థానం) నుంచి సహస్రారము (తల పై) వరకు అనంతమైన విశ్వ శక్తి ప్రవహించును.

తద్వారా బుద్ధి వికాసం చెంది , ఆలోచనలు శ్రేష్టం అగును. 

అప్పటి వరకు మనిషి  కలిగి ఉన్న ఆలోచనలలో చైతన్య  శక్తి  లేకుండుట  వలన , ఏర్పడిన  విఘ్నాలు ఆటంకాలు   సమస్తం తొలగును. సమస్యలకు పరిష్కారం లభించును. అందుకే బుద్ధి కి  చిహ్నం గా గణపతి ని చూపిస్తారు. నరములు చైతన్యం అవడం వలన గణిత శాస్త్రం లో ప్రావీణ్యం పొందుతారు . 

గరిక గడ్డి తాకడం , వాసన పీల్చడం వలన నరముల లో దోషం నివారణ అగును . అందుకే గణపతి కి గరిక నివేదిస్తారు .


☘️☘️☘️☘️☘️☘️


• గణపతి కి ఏనుగు తల ఆపాదించి చూపించడం  వెనుక  ఒక  రహస్యం దాగి ఉంది. అదే  మానవుని శ్రేయస్సు . రాబోయే యుగాలలో మనిషి బుద్ధి పూర్తిగా వికారాల లో  మునిగి భ్రష్టు తో  ఉంటుందని ముందే గ్రహించిన  మునులు , అందు నుంచి బుద్ధి విముక్తి కోసం వినాయకుని పూజించమని తెలిపారు.


• విశాలమైన ఏనుగు చెవులు వలే , మనిషి తన చెవులను  ఉంచి  అనంతమైన సృష్టి  జ్ఞాన విషయాలు వినాలని .

• ఏనుగు కళ్ల  వలే మనిషి తన కళ్లు పెద్దవి గా ఉంచి  జీవితం లో   ప్రతీ అంశం పట్ల  సూక్ష్మ దృష్టి , దూరదృష్టి   కలిగి ఉండాలని .

• ఏనుగు తల అంత విస్తారం గా  మనిషి బుద్ధి మంచి ఆలోచనలతో   కలిగి ఉండాలని .

• గణపతి పొట్ట అంత ఎక్కువగా మనిషి తనలో  జ్ఞానాన్ని  ఇముడ్చు  కోవాలని  .

• మనిషి  స్థిరం గా  ఉన్న ప్రదేశం లోనే  ఉండి , ఏనుగు తొండం చాపి నట్లు గా  సుదీర్ఘమైన శుద్ద సంకల్పాలు లోక కల్యాణం కోసం  చేయాలని .

• మనిషి ఇన్నీ  దైవీ గుణాలు కలిగి ఉంటూ , అహంకారం , ఆడంబరం లేకుండా ఉండాలని ఉద్దేశం తో  అంత పెద్ద గణపతి  ఆకారానికి చిన్న పీట పై ఆసీనం అయినట్లు చూపించారు.

• ఇక చివరిగా ఎలుక వినాయకుని వాహనం. అసలు ఇది వాస్తవానికి సాధ్యమే నా ? ఆలోచించండి . . .  దీని సూక్ష్మార్థం వినాయకుడి అంత  భారీ శరీరం మోసేది  సూక్ష్మమైన  ఎలుక  వలే ,    ఎన్నో  సుగుణాలు, లక్షణాలు, కలిగిన మనిషి శరీరాన్ని   నడిపించేది  సూక్ష్మమైన ఆత్మ అని తెలియ  చేయడానికి  ఎలుక తో వినాయకుడిని సృష్టించారు .


వినాయకుడిని పూజించడం వలన మనిషి మహా జ్ఞాని అవుతాడు .


ప్రతీ శుభకార్యానికి ముందు , వినాయకుని పూజ చేయడానికి కారణం . . . మనిషి బుద్ధి  లో  ఉన్న వ్యర్ద (నెగెటివ్) ఆలోచనలు సంకల్పాలు  సమాప్తం అయి ,  పాజిటివ్ ఆలోచనలు వృద్ధి చెంది  ,  సత్బుద్ధి నొందడం ద్వారా  మంచి శక్తి పొంది  తలపెట్టిన శుభకార్యాలు   ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయవంతం గా  పూర్తి కాబడతాయి .


• నేటి మానవుడే , ఒకప్పటి సత్య, త్రేతా యుగాలలో దేవతా లక్షణాలు, దివ్య శక్తులు, బుద్ధులు కలిగి ఉండేవాడు . తరువాత కాలంలో ద్వాపర కలియుగాలలో ఆ మానవుడు అసురుడి లక్షణాలు కలిగి ఉంటాడు . అందుకు నిదర్శనం పైన ఉదహరించిన వికారమైన చేష్టలతో , బుద్ధి హీనత తో చేయకూడని విధంగా గణపతి భక్తి చేయడం లాంటివి మరెన్నో .

 భగవంతుని కోసం  చేసే భక్తి పూజ  వెనుక , దాగి ఉన్న సత్యమైన సూక్ష్మం తెలుసుకుంటేనే  శ్రేష్ట ఫలితం లభిస్తుంది .

 

ఈశ్వరుని  జ్ఞానం  పరమ  సత్యం . 

సత్యాన్ని మనిషి  అనేక సార్లు వింటాడు, చదువుతాడు , తెలుసుకుంటాడు.  కానీ ఆచరించడు . ఎందుకంటే  ఆచరిస్తే  అందరితో వివాదాలు తలెత్తుతాయి అనే భయం .  అందుకే మనిషి లో ఉన్న  శరీరం మరియు  ఆత్మ పొందవలసిన ఉన్నతి పొంద లేకపోతున్నాయి .


  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏


యడ్ల శ్రీనివాసరావు 4 Sep 2025 , 9:30 PM .


Monday, September 1, 2025

684 .తల్లి తండ్రులు – పిల్లలు – ఉపాధ్యాయులు

 


తల్లి తండ్రులు – పిల్లలు – ఉపాధ్యాయులు



• నేటి మన పూర్తి జీవితానికి మన పిల్లలు మరియు మన తల్లి తండ్రుల బంధమే మనకు పునాది.  పిల్లలు అందరూ తమ చిన్నతనంలో అలవర్చుకునే  అలవాట్లు వారి తల్లిదండ్రుల నుండే నేర్చుకుంటారు. తరచుగా తల్లిదండ్రులు పిల్లలపై ,తమకు సానుకూలంగా(అనుకూలంగా) ఉండే అలవాట్లను రుద్దుతుంటారు .

• పిల్లలు కోపం తెచ్చుకున్నా, అబద్ధాలు చెప్పినా, టి.వి, ఇంటర్‌నెట్‌ వంటి సైన్సు మాధ్యమాలలో తప్పుడు సమచారాన్ని చూసినా లేక చిన్న వయసులో తప్పుడు స్నేహం చేసినా, తాగుడు, ప్రొగ తాగడం వంటి అలవాట్లు ఉన్నా తల్లిదండ్రులు పిల్లలను తిడుతూ ఉంటారు.

• తల్లిదండ్రులు ఏర్పరచిన నియమాలను పిల్లలు పాటిస్తూ , పిల్లలు వారి ఆలోచనల స్వభావ సిద్ధంతో తీసుకువచ్చే మార్పులకు తల్లిదండ్రులు చాలాసార్లు సంతృప్తి చెందరు. ఇది పిల్లలు-తల్లిదండ్రుల బంధాన్ని చాలా ఇబ్బందిపాలు చేస్తుంది . వారి మధ్య మానసిక దూరం పెంచుతుంది .

• తల్లిదండ్రులు తమ బాగు కోసమే చెప్తున్నారన్న విషయం తెలిసినా గానీ పిల్లలు ఎందుకు వారి మాట వినరు? 

మాటలకన్నా శక్తివంతమైనవి, పిల్లల భౌతిక స్థాయి పై ప్రభావం చూపించేది తల్లిదండ్రుల యొక్క వ్యక్తిత్వం . ఇది పిల్లలపై  అదృశ్యంగా ( పైకి కనిపించని ) ప్రభావం చూపుతుంది. తల్లిదండ్రుల మాటలకన్నా వారి వ్యక్తిత్వమే పిల్లలకు త్వరగా చేరుకుంటుంది.

• తల్లిదండ్రులు మార్పును చెప్తారు గానీ మార్పును స్వయం తాము అవలంబించరు. ఏ చెడు అలవాట్లనైతే పిల్లలలో వద్దు అని తల్లిదండ్రులు చెప్తున్నారో అవి వారిలో ఉంటున్నాయి . కామము, క్రోధము, లోభము, మోహము, అహంకారము మొదలైనవి … ఇవి పిల్లల సూక్ష్మ స్థాయికి చేరుకుంటూ ఉంటాయి.

  ఈ ప్రతికూల గుణాలు , శక్తులు పిల్లల మనసులను తల్లిదండ్రులు ఇచ్చే సూచనలు, శిక్షణలకన్నా  ఎక్కువగా ప్రభావితం చేసి, మాటలవలన పొందే ప్రయోజనాన్ని శూన్యంగా చేస్తున్నాయి.


• పిల్లలకు ఉండే మరో ముఖ్యమైన బంధం గురించి ఆలోచిస్తే, వారికి వారి స్కూలు టీచరుతో ఉన్న బంధం. పిల్లలపై ఉపాధ్యాయులకున్న ఆపేక్షలు, మంచిగానీ చెడుగానీ, అవి పిల్లల విద్యా సామర్థ్యాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తాయని అనేక పరిశోధనల ద్వారా నిరూపించబడింది . విద్యార్థులలో తక్కువ సమర్థత ఉంది అని అనుకునే కంటే . . . టీచర్లు మరియు పిల్లలలో మంచి సమర్థత ఉంది, వారు మంచి ఫలితాలను తీసుకువస్తారన్న నమ్మకాన్ని కనబరిచినప్పుడు పిల్లలు కూడా తమ సమర్థతకు ఏ మాత్రం తగ్గకుండా తమ మానసిక శక్తి తో పని చేసి మంచి ఫలితాలను పొందుతారు.

• తరచుగా పాఠశాలలో, పిల్లల సమర్థత గురించి ఉపాధ్యాయులు మాట్లాడే మాటలకు, ఆలోచించే ఆలోచనలకు పొంతన ఉండటం లేదు . ఉపాధ్యాయుల మాటలు చూస్తే వారికి విద్యార్థులపై పూర్తి నమ్మకము, ఆశ ఉన్నట్లుగా మాట్లాడుతారు, కానీ వారి ఆలోచనలలో మాత్రం అంతటి సానుకూలత ఉండటం లేదు అనేది నిజం . 

పిల్లలు ఫెయిల్ అవుతారేమో అన్న భయంతో కూడిన ప్రతికూల ఆలోచన ఉపాధ్యాయులలో ఉన్నప్పుడు వారు మాటలతో ఎంత ప్రోత్సాహకరంగా మాట్లాడినా కానీ పిల్లల మనసుపై ప్రతికూలత యొక్క ప్రభావమే పడుతుంది. దీని కారణంగా పరీక్షలలో పిల్లలు తక్కువ సమర్థంగా ఉంటున్నారు . 

 నేటి కాలంలో పాఠశాల విద్య బోధన అనేది విలువలకు తిలోదకాలు ఇచ్చేసింది . దీని వలన సమాజ శ్రేయస్సు కి అన్ని విధాలా జరగవలసిన నష్టం జరగడం అనేది ఇప్పటికే ఆరంభం అయింది . దాని ఫలితం నిత్యం అశాంతి, హింస, కామము , క్రోధము తో కూడిన సంఘటనలు  వార్తలలో చూస్తూ ఉన్నాం .  

దురదృష్టం ఏమిటంటే ఇదంతా నేడు సహజం అని అనుకుంటూ మనం జీవించడం. 


యడ్ల శ్రీనివాసరావు 1 Sep 2025 5:00 AM.


Friday, August 29, 2025

683. అందరిలో అందరూ కొందరు.

 

అందరిలో అందరూ కొందరు




• అందరికీ   ఉంటారు   

  ఎందరో    కొందరు .

  ఆ   కొందరి లో

  ఎందరో    కొందరే    ఆప్తులు .


• కొందరికే   ఉంటారు    

  కోరుకున్న    వారు .

  ఆ  వారి లోని

  అందరే   శ్రేయోభిలాషులు .


• అందరిలో   అందరూ 

  కాలేరు   హితులు .

• కొందరిలో    కొందరే 

  అవుతారు   సన్నిహితులు.


• అందరికీ   ఉంటారు    

  ఎందరో    కొందరు .

• కొందరికే    ఉంటారు 

  కోరుకున్న   వారు .


• అన్నీ    ఉన్నా   ఏమీ

  లేనట్లు   ఉంటారు   కొందరు .

• ఏమీ    లేకున్నా   అన్నీ

  ఉన్నట్లు   ఉంటారు  మరికొందరు .

• అందరిలో    అందరూ

  మహా   మహా  నటులు .

• కొందరిలో     కొందరే

  మౌనమైన   ప్రేక్షకులు .


• అందరికీ  ఉంటారు     

  ఎందరో     కొందరు .

• కొందరికే   ఉంటారు 

  కోరుకున్న   వారు .


• మనుషుల తో    ఆటలు

  ఆడువారు    కొందరు .

• మనసులతో     ఆటలు

  ఆడువారు    మరికొందరు .

• కాలక్షేపాలకు   

  కలిసే   వారు    కొందరు .

• కాలక్షేమాన్ని  

  తెలిపే వారు   మరి కొందరు.


• అందరిలో   అందరూ 

  సుందరాంగులు .

• కొందరిలో    కొందరే 

  నిమిత్తమాత్రులు .


• అందరికీ   ఉంటారు

  ఎందరో    కొందరు .

• కొందరికే    ఉంటారు

  కోరుకున్న   వారు .



యడ్ల శ్రీనివాసరావు 29 August 2025 , 9:30 PM.


Wednesday, August 27, 2025

682. శివగణం

 

శివగణం


• శివమే    బీజం

  శివుని కి   వశమే  మోక్షం .


• శివమనే    స్వరము లో

  శుభమనే    వరము

  ప్రసన్నం  . . .  ప్రసన్నం .

• శివం      . . .   శివం


• శివమనే      ధ్వనము తో

  సప్త ధాతువుల   యోగం

  చైతన్యం . . .  చైతన్యం .

• శివం      . . .  శివం .


• శివమే      బీజం

  శివుని కి   వశమే    మోక్షం .


• మనము న    ఈ నాదము   నదము యైన

  జీవము    జలము లా   జారేను .

• తలపు న     ఈ తపన    తరుముతు ఉన్నా 

  ప్రతికూలము   కరుణ తో     కరిగేను .


• శివమే      బీజం

  శివుని కి   వశమే    మోక్షం .


• శివమనే     పలుకు తో 

  శిరము న    కంపనలు

  శీతలం  . . . శీతలం .

• శివం   . . .  శివం .


• శివమనే       పదము తో

  నర నరము న    నవ్యత కు

  శ్రీకారం   . . .   శ్రీకారం .

• శివం   . . .  శివం .


• చిత్రమైన    ఈ   విచిత్రం

  చిత్రము   చూడని   స్మృతి   స్మరణం .

• విశ్వాంతర       ఓం  కారం

  మన  గుండె లయల   శక్తి తరంగం .


• శివమే     బీజం

  శివుని కి   వశమే    మోక్షం .

• శివమే      బీజం

  శివుని కి    వశమే    మోక్షం .



భావం 

• శివుడే సృష్టి కి మూలం.

• శివుని కి దాసోహం అవడమే , అనుభవిస్తున్న పరిస్థితి  నుంచి  విముక్తి .


• శివం  అని  అంటున్న  స్వరానికి , శుభం కలిగే వరం  ప్రసన్నం  అవుతుంది.

• శివం  అని  అంటున్న  ధ్వని వలన శరీర పోషణకు అవసరమైన ఏడు ముఖ్య పదార్థాలు (సప్తధాతువులు) , రసము, రక్తము, మాంసము, మేధస్సు (బుద్ధి), అస్థి (ఎముక), మజ్జ (కొవ్వు) , మరియు శుక్రము (వీర్యము) శుద్ధి అయి చైతన్యం అగును.


• మనసు లో   శివ నాదం   నదిలా ప్రవహిస్తూ ఉన్నచో   మనిషి ప్రాణం (ఆత్మ)  నీటి వలే తేలికగా  జారుతూ ప్రవహిస్తూ , దుఃఖం లో  కూరుకు పోకుండా   జనన  మరణాలు  పొందును .

• మనిషి  ఆలోచనల లో   శివం అనే   కోరిక విపరీతంగా  పెరిగినట్లయితే  ప్రతికూలమైన విఘ్నాలు  అన్నీ  సజావుగా  సహజంగా తొలగిపోతాయి .


• శివం అని  పలకడం  వలన   శిరస్సు లో ఆలోచనల  అలజడులు   అన్నీ  చల్లారును .

• శివం అనే  పదం వలన  మనిషి లోని  నర నరాలు   తనకే   తెలియని  కొత్తదనానికి శ్రీకారం చుడతాయి .


• ఆశ్చర్యం  అనిపించే  ఈ విశిష్టతలు అన్నీ శివుని  యొక్క రూపం  చూడకుండానే  మనసు తో స్మృతి   చేయడం  వలన  సాధ్యం .

• విశ్వం యొక్క  మూలం లో  అనుక్షణం  ప్రతి ధ్వనించే    “ ఓం ”  అనే  శబ్దం ,  మనిషి గుండె కొట్టుకోవడానికి  శక్తిని  ఇస్తున్న  తరంగం .



విశ్వం లో   ఉన్న  సమస్త మానవాళికి ,  దేశ విదేశాల్లో  ఉన్న  తెలుగు వారందరికీ  వినాయకచవితి   శుభాకాంక్షలు 🙏 


  శివ బాబా (తండ్రి)  సహకారం తో . . . 

  ఓం శాంతి 🙏

  ఓం నమఃశివాయ 🙏

 

యడ్ల శ్రీనివాసరావు 27 August 2025 2:00 AM.



Sunday, August 24, 2025

681. సత్య యుగపు స్వర్గం

 

సత్య యుగపు స్వర్గం




• మురిపించే     మురళి

  మైమరిపించే   రవళి

  ఇది

  వేణు  గానాల   హోళీ.


• మురిపించే     మురళి

  మైమరిపించే   రవళి

  ఇది

‌  వేణు గానాల   హోళీ.


• గోపిక ల  నాట్యం తో  నిండెను  బృందావనం

  గోవుల   మౌనం తో   అయ్యెను  శాంతివనం .


• మధురమైన   మాధవుని   జ్ఞానామృతం

‌  మకరందమై   విరిసెను  అంతటా  మధువనం .


• మురిపించే     మురళి

‌  మైమరిపించే   రవళి

  ఇది

‌  వేణు గానాల   హోళీ.


• మురిపించే     మురళి

‌  మైమరిపించే   రవళి

  ఇది

  వేణు గానాల    హోళీ .


• పరిమళాల     పవిత్రం

  నందుని     వనం .

• సుగంధాల     సారభం

  ఈ   శ్రీ కృష్ణుని       స్వర్గం .

 

• ఆనంద   కేళీలు

  అడుగడుగునా  రమణీయం .

• సంబరాల    అంబరం

  ఈ సత్య యుగపు   కోలాటం .


• దుఃఖమెరగని      దివ్యం

   అబూ     పర్వతం .

• భువి లోని    దివి  అయింది 

   ఈ  వైకుంఠ  వాసం  .

• ఇది   ఆత్మ  పరమాత్మ ల  సంగమాల 

   కైలాస   మానస  సరోవరం .

  

• మురిపించే      మురళి

‌  మైమరిపించే    రవళి

  ఇది

  వేణు   గానాల   హోళీ.



ఓం శాంతి 🙏 

ఓం నమఃశివాయ 🙏 


యడ్ల శ్రీనివాసరావు 24 August 2025 10:00 AM.


Wednesday, August 20, 2025

680. జీవ దాహం

 

జీవ దాహం


• దేహము లో    దాహము

  దైవమయిన   వేళ

  జపమే    జలము .

• ఆత్మ కు     ఆకలి

  దైవమయిన   వేళ

  ఆధ్యాత్మిక తే   పరమాన్నము .


• ఆకలి దప్పికల    జీవితము

  దేహం   ఆత్మ ల   జీవము .

• ప్రేమ  తపముల   సంయోగము

‌ పరమాత్ముని   చేరు   మార్గము .


• శివుని     ధ్యానమే

‌  నరుని వికర్మలకు   విముక్తి.

• శివుని    ధర్మమే

  స్వర్గ   స్థాపనకు   శక్తి .


• దేహము లో      దాహము

‌  దైవమయిన     వేళ

  జపమే    జలము .

• ఆత్మ కు     ఆకలి

  దైవమయిన    వేళ

  పరమాత్మ యే    పరమాన్నము .


• దర్శకుడెవరో    తెలియని  నాడు

‌  నాటకం లో

  నీ పాత్ర     ఓ బూటకం .

• శివుని  సూక్ష్మం    ఎరుగని   వాడు

‌  జన్మం లో

  జీవమై  నా    ఓ  నిర్జీవమే .


• దేహము లో     దాహము

  దైవమయిన   వేళ

‌  జపమే     జలము .

• ఆత్మ కు     ఆకలి

‌  దైవమయిన    వేళ

  పరమాత్మ యే    పరమాన్నము .


యడ్ల శ్రీనివాసరావు 21 Aug 2025 11:30 AM.


807. మనో శతకం -12

  మనో శతకం -12   భవుడి  బాట  భవదీయుగ    జేయ   చితి కి  చేరు చింతల్ .   తపమున  తరియించు  నరున్    ధ్యానంబు  ధన్యము  గాంచెన్ .    యోగాగ్ని నంద...