Thursday, November 19, 2020
29. ఊహించలేదే.....
28. బాల్య మిత్రుల కలయిక రూపమా అపురూపమా?....
27. ఒక సందర్భంలో స్నేహితులను ఉద్దేశించి
26. స్నేహం.... స్నేహితుల దినోత్సవ సందర్భంగా
25. ప్రక్రుతి పిలుస్తోంది
24. అలజడి...నా మనస్...సలజడి
23. జాబిల్లి
22. చిరుగాలుల గలగలలు
21. చలనం....నిశ్చలనం
20. పదముల... చెలి... చెలిమి
19. ఓం నమఃశివాయ , ఉన్నాడులే... ఒకడున్నాడు లే
18. సుడిగుండాలు
సుడిగుండాలు
వికసించే విరజాజి మంచు వెన్నెల జాబిల్లి
పరిమళాల సంపెంగ కోటి తారల కాంతిమయి
ఆనందవల్లి
• ఏది ఆది ఏది అంతం
ఈ పయనం ఎందాకో ఎందుకో
• బందమో
అనుబంధంమో ఋణానుబందమో
• బందమా అంటే
బాధ్యతలు కాన రావడం లేదు
• అనుబంధమా అంటే
అనుభవాలు కాన రావడం లేదు.
• మరి ఇక మిగిలినది
ఋణానుబందమే కదా
• కలయిక చిత్రం కాదు
విచిత్రం కానే కాదు
యాదృచ్ఛికం అంతకంటే కాదు.
• అవుతుందా
అర్థం అవుతుందా
శక్తిని చూడలేం కాని అనుభవించగలం
• చూడు మనసు పొరలు చీల్చి చూడు
నీ పట్ల ఈ ప్రకృతి లీల కనిపిస్తుంది.
• పడ్డావు పడ్డావు
సుడులు తిరిగే సుడిగుండాలే
ఆయాసపడే కష్టాలు పడ్డావు.
• సుడిగుండాల్లో సుడులెన్నునా
సున్నితమే నీ సుందరాభరణం.
• ఆ సుందరాభరణానికే
ఎగిరే రెక్కల గుర్రం ఎక్కించుకుంది.
• విహరించు వినీలాకాశాన్ని
ఆలంబనతో ఆస్వాదించు
సుడులు తిరిగే సుడిగుండాలని.
• సాగరం లో శాంతిని చూసే
నీ మనసే నీకు శ్రీ రామ రక్ష
• ఉన్నాడు ఒకడున్నాడు
ఈ సర్వం జగత్ వ్యాపించి ఉన్నాననే
వాడొకడున్నాడు.
వాడిని చూడాలంటే
ఎన్నో సుడిగుండాలు దాటాలి మరి.
వాడు అనుగ్రహిస్తే
ఏదో ఒక దేహం తో దర్శనమిస్తాడు.
యడ్ల శ్రీనివాసరావు
Sunday, July 26, 2020
17. మనసా ఓ మనసా
Friday, July 10, 2020
16. మా బడి....అది మా బడి
• మా బడి.. అది మా బడి... బడిలో అడుగెడుతునే ఆవిరయ్యే మా మదిలో అలజడి.
• ఊయల ఊగే యూకలిప్టస్ చెట్లు ...అందలమెక్కిన అశోక చెట్ల తో స్వాగతం..సుస్వాగతం.
• రాచమార్గాన ఎర్రమన్ను రహదారి ... దారికి అటుఇటు తెల్లని గోడి ఇటుకలతో గమకము(వరుస) విందము …. ముఖారవిందము.
• ఆవరణలో పచ్చగడ్డిలో ఏపుగా దాగిన పల్లేరు కాయలు ...లేత పాదాలకు నొప్పులు...తీయని మెత్తని నొప్పులు.
• వైపుల్యమైన(ఘనమైన) వేదికకు(స్టేజ్) తోరణముల వలే అటుఇటు దేవదూతల అంజలిలు...నమఃస్సుమాంజలిలు.
• మా బడి… అది మా బడి…మా జీవన నాడికి నడక నేర్పి నా బడి.
• తెల్ల చొక్కాలు, ఖాకీ నిక్కర్లు... తెల్ల జాకెట్లు, నీలం లంగాలే మా భరణాలు ..... ఆభరణాలు.
• తలకి తైలం, ముఖానికి పౌడరు, చేతిలో సంచి, కాలికి రబ్బరు చెప్పులే మా బింబాలు...... నిలువెత్తు ప్రతిబింబాలు.
• లేవు లేవు మాకు చేతి రుమాళ్లు.... చెమట ను చెరిపే చేతులే మాకు ఆయుధాలు. జీవులం .....చిరు శ్రమ జీవులం.
• చిన్న విరామం లో చిరుతిళ్ళు ఆరాటం...గేటు బయట ఈగల్లా , ఐస్ సాంబను చుట్టూ చేరి... తెల్లని చల్లని కమ్మని కొబ్బరి సేమియా పాల ఐస్ లోట్టలతో చీకుతుంటే , కనురెప్పలు భారంగా మూసుకుంటే ఆహ మథురం..... ఎంత మధురం.
• అప్పుడప్పుడు మా బడి సందర్శనకు విచ్చేసిన విదేశీయులను( church visiting foreigners) వింతగా చూసి ముసిముసి నవ్వులతో, గుసగుసలతో ఆశ్చర్యాలు... సంభ్రమాశ్చర్యాలు.
• మధ్యాహ్న విరామం లో పాండవుల మెట్ట పై జారుడు ఆటలు, ఎండవేడికి సుర్రుసుర్రులు. రిక్షాలు రాకపోతే చెరువు గట్టు పై అడ్డదారిలో, పిచ్చిమొక్కల నడుమ ఒకరి వెనుక ఒకరి పిచ్చాపాటీ తో పయనం. ఆనందం.. మాకు మహదానందం .
• కార్యాలయం( ఆఫీస్) ముందు అందమైన నందనాన(ఉద్యానవనం) చిరుమందహసంతో మూర్తీభవించిన ప్రేమమూర్తి మేరిమాతకు వందనాలు...మా పాదాభివందనాలు.
• తనదైన విగ్రహంతో రక్షకుడిగా..... నిగ్రహంతో పరిరక్షకుడిగా.... అనుగ్రహంతో సంరక్షకుడివై…….మా అందరి అయ్య వయ్యావు దైవస్వరూప శ్రీ ఇన్నయ్య ..మా అయ్యా(తండ్రి)....వందనాలు….. మా శిరశాభివందనాలు.
• భయమో, భక్తో, ప్రేమో ఎన్నో పసి మనసులు చేతులెత్తి మ్రొక్కిన నీవు,...... మా బడికి, మాకు మథ్య పరమాత్మ ప్రతినిధివి కాక ......ఇంకేమీ అనగలం తండ్రి మా తండ్రి శ్రీ ఇన్నయ్య తండ్రి... వందనాలు.... మీకు ప్రేమాభివందనాలు.
• మా బడి రాజరిక భవనాలే మా బలమైన బంధాలు....నేడు మా బడి కి వృద్ధాప్యం రావచ్చు.... నాడు యవ్వనంలో మా బడికి సాటి ఏది…….సరిసాటి ఏది?..... గర్వం.... ఇది మా ఆనంద గర్వం.
• వీరోచితమైన జ్ఞాన గురువులే మాబడి సామ్రాజ్యానికి దశా దిశా నిర్దేశించిన యోధులు…..…మా గురువులు నిరంతర జ్ఞాన శ్రామికులు….. మా జీవిత గమనానికి మార్గదర్శకులు... వారికి వందనాలు....మా ఆత్మాభివందనాలు.
• జాతి కుల మత స్థాయి వర్గ వర్ణాలు కానరాని హరివిల్లే మా బడి.
• తరగతి గదిలోని గుంజీలు , గోడ కుర్చీలు, మోకాళ్లు, చింతరివ్వ ముద్దులు మా వ్యక్తిత్వాన్ని , సమస్యకు ఎదురీదే తత్వాన్ని , ఆత్మస్థైర్యాన్ని బలపరిచాయే గాని ......బలహీన పరచలేదు నేటితరం బడి లాగా ...అది మా బడి గొప్పతనం.
• మేడ మీద చివరి గదిలో సైన్స్ ప్రయోగశాలలో........ కిటికీ నుండి భయంభయంగా నక్కినక్కి వీక్షించే , వ్రేలాడే తెల్లని అస్తిపంజరం .....వింతవింత గాజు సీసాలు, రంగురంగుల రసాయనాలు......ఆ చిన్న వయసులో మా లోని కొత్త వింత అనుభూతుల్ని , అనుభవాలని పరిచయం చేసి చర్చించుకునే లా చేసింది బడి.... మా బడి.
• శిక్షణ క్రమశిక్షణ, రక్షణ పరిరక్షణ, వర్తన పరివర్తన, వర్తమాన ప్రవర్తనకు దర్శనం.... నిదర్శనం… మా బడి.
• లేడి పిల్లలు, జింక పిల్లలు, సీమ పందులు, గిన్నె కోళ్ళు, కొండ ఉడుతలు, తెల్లని నల్లని పావురాలు, పచ్చని చెట్లు, కోయిల కిలకిలలు, వడ్రంగి పిట్ట అరుపులు , థాన్యాగారం, వానకు తడిసిన మట్టి వాసన , గడ్డి పైన మంచు , చల్లగా వీచే గాలి, నల్లటి మబ్బులు , తరగతి గదిలో అరుపులు మా బడి జ్ఞాపకాలు….మా శక్తికి దోహదాలు.
• బడి లోని కరుణామయుడు అక్కున చేర్చుకుని జ్ఞానదాతై వందల వేల మందికి వెలుగునిచ్చాడు. ఏది మరువగలం.... ఎలా మరువగలం…. ఎందుకు మరువగలం .....మాబడి తో పాటు మా శరీరం ఇంకా ఉంది కదా.
• పరిపక్వత లేని, తేటతెల్లని, మరక లేని మనసులతో నాటి బాల్యమెంత స్వచ్ఛత .... అందుకేనేమో ఈ ఆనందం ..... పరిపూర్ణానందం.
• గురువే దైవం..... గురువే జ్ఞానం.....గురువే మార్గం.....అన్న మాబడి గురువు లే మాకు నాటికి నేటికి ఎప్పటికీ ఆదర్శం.
• ప్రధానోపాధ్యాయులు : గౌ.శ్రీ.ఇన్నయ్య ఫాదర్ గారు, గౌ.శ్రీ.జోజిబాబు ఫాదర్ గారు.
• కీ.శే. గౌ. శ్రీ బుచ్చి మాస్టారు , (ఎలిమెంటరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు ) మరియు గౌ. శ్రీ గాబ్రియల్ మాస్టారు( ఎలిమెంటరీ స్కూలు ప్రధానోపాధ్యాయులు)
• ఉపాధ్యాయులు: కీ.శే. శ్రీ రమణ మూర్తి గారు, కీ.శే.శ్రీ జోజి బాబు గారు, కీ.శే. శ్రీ గురునాథం గారు, కీ.శే.శ్రీ రాజారావు గారు , కీ.శే.శ్రీమతి గౌరి దేవి గారు, కీ.శే.శ్రీమతి అనురాధ గారు, కీ.శే.శ్రీ అంతోని గారు ( క్రాఫ్ట్ మాష్టారు), కీ.శే.శ్రీ పెద్ద తెలుగు మాస్టారు , కీ.శే.శ్రీ పెద్ద ఫ్రాన్సిస్ మాస్టారు , మరియు గౌరవనీయులైన శ్రీ అప్పారావు గారు, శ్రీ పాపారావు గారు, శ్రీ శంకర రావు గారు , శ్రీ నూకరాజు గారు , శ్రీ ప్రభాకర్ రావు గారు , శ్రీ సుందర్ రెడ్డి గారు, శ్రీ చిన్న ఫ్రాన్సిస్ మాష్టారు, శ్రీ ఆనందరావు మాస్టారు గారు.
చిరస్మరణీయులైన మన గురువులంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ ......
యడ్ల శ్రీనివాసరావు
ఎస్.ఎస్.సి. 1988, రోల్.నెం.92, బి.
(సెయింట్ థెరిస్సా రోమన్ కేథలిక్ మిషినరి హై స్కూల్, పెదబొడ్డేపల్లి, నర్సీపట్నం, విశాఖ జిల్లా)
Tuesday, July 7, 2020
15. వర్షమా.....ఓ వర్షమా
• వర్షమా!.... ఓ వర్షమా!.... నీ పలకరింపే మా మదిలో హర్షమా.
• వర్షమా! కారు మబ్బుల కన్నీరు వై .... మా కన్నీరు తుడుస్తావు.
• అలసి సొలసి విసిగిన భానుడి తాపానికి ....సేద తీరే తల్లి ఒడి వలె చల్లని వెచ్చని కమ్మని హృదయానందాన్నిస్తావు.
• వర్షమా! నీ రాకతో పసిపిల్లల కేరింతలు , కాగితం పడవలు, గుంతలలో గెంతులు .....రమణీయం ...ఆహా! ఎంత ఆనంద స్మరణీయం.
• మోడు వారిన చెట్లకు నీ స్పందనతో ....హరిత శృంగార సింగారమే.
• బీడు వారిన పంటలకు నీ నవ్వుతో .....పంచామృతమే .
• వర్షమా ! నీ రాకకై పుష్పాలు వేచి చూస్తాయి మధువు నివ్వడానికి ......తేనెటీగలు సిద్ధమవుతాయి మధువును గ్రోలడానికి.
• నీ పలకరింపుతో తుమ్మెదలు పులకరించి ఇంద్రధనస్సులా వర్ణాలు మారుస్తాయి…. ఆనందం..... ఎంత నయనానందం.
• వర్షమా! నిన్ను తాకిన మట్టి ముద్దై ముద్దు అయి ..అంతవరకు కానరాని సువాసన వెదజల్లుతుంది…….ఆహా! పువ్వులే కాదు మన్ను కూడా పారిజాతమే కదా! ఏమి చిత్రం .....ఎంత విచిత్రం.
• వర్షమా! నీతో కలసి మెలసి తడిసి అడుగేసిన మాకు ఎటుచూసినా చక్కిలిగిలి సంతోషమే.
• వర్షమా! నీ రాకతో సమస్త ప్రాణికోటి చల్లబడినా....మా లోని ఉష్ణ స్పర్శని తెలియ చేస్తావు. అద్భుతం ఆహా! ఎంత అద్భుతం.
• వర్షమా! నీ తొలకరి జల్లు కి ప్రకృతి నాట్యమాడుతుంది..... మయూరి నాట్యం చేస్తుంది.
• వర్షమా! నీవు ఆగ్రహిస్తే నీ కన్నీరు మున్నీరై, ఏరులై వరదలైన నిన్ను మేము శాంతింప గలమా! ఆ శక్తి మాకు లేదు.
• వర్షమా! నీలారవిందమైన నీలి ఆకాశం లో .నీ..ఇంద్రధనస్సు ....మా లోని పులకరింతకు ....నిన్ను పలకరింతకు .....ప్రకృతి సాక్ష్యం .
• వర్షమా ! మాయలో పడి నీటి బిందువుగనే చూస్తున్నాం . కానీ మానవాళి మనుగడకు ఎంతో మేలు చేస్తున్నావు. అవును! ఎంతైనా నువు ప్రకృతివి కదా.
యడ్ల శ్రీనివాసరావు.
Tuesday, June 23, 2020
14. ఓం నమఃశివాయ శివాయ నమః ఓం
• పంచభూత సమ్మిళిత రూపా
• మాయను మాపే మాయావి
• శ్మశానమే ఆవాస మంటావు
• ఈశ్వరా ఓంకార రూపేశ్వరా
• త్రిలోకం త్రిగుణం త్రినేత్రాధి నేతనంటావు
• ధ్యానమే ధ్యాసంటావు
• ధ్యానేంద్రా ఓ యోగీంద్రా
• కంఠ గరళంతో కరుణిస్తావు
• నీలకంఠేశ్వరా ఓ అర్ధ నారీశ్వరా
• నీ కంటి భాష్పాలే
• ఈశ్వరా ఓ రుద్రేశ్వరా
• ఢం ఢం ఢం ఢమరుకమే
• ఈశ్వరా ఓ చిదంబరేశ్వరా
• శరణు కోరిన జీవికి బోళాశంకరుడివి
• ఓ శంకరా బోళా శంకరా
• ఆడుకుంటావు మాతో
• ఈశ్వరా ఓ జ్ఞానేశ్వరా
• తెరిపించ వయ్యా మా మనోనేత్రం
యడ్ల శ్రీనివాసరావు. 2021 June
Wednesday, June 17, 2020
13. ఓ మనిషి.... జీవితం…… ఏది శాశ్వతం
• చేసిన చేతలు చేదయ్యేనా
• మాటాడిన మాటలు మౌనమా యేనా
• నడచిన నడతే నలుసయ్యేనా
• గెలిచిన గెలుపే గేళి య్యేనా
• కలసిన కలయిక కాటేసే నా
• ఈసడించిన ఈర్ష్య ఈల యేసేనా
• దేహించిన దేహం దేభ్యమయ్యేనా
• అందించిన అండే అణగతోక్కే నా
• అలవిగాని అసూయ ఆరాధన య్యేనా
• హేళన తో హోళీ చేస్తే హంకారమే (అహంకారం)
• ద్వేషంతో దండిస్తే దారిద్ర్యమే
• కాంతిని కాయలనే కన్ను కనుమరుగే
• పైన చేయ్యేస్తే పైవాడై అయిపోలేం
• ప్రతీకారానికి ప్రతి రూపమా నీ ప్రతిభ
• ఏం వజ్రం చీకట్లో మెరవదనుకున్నావా
• వజ్ర కాంతి కి చీకటి వెలుతురు సమానమే
• చేసిన చేతలు మనసు చెపుతున్నా ... అర్థం కానట్టు నటించాలా......లేకపోతే జీవితానికి మనుగడ కష్టమా. ఎందుకు ఈ దుస్థితి.
• ఏ ఎండకు ఆ గొడుగేనా జీవితం.
• పతనానికి ప్రయాణమైన జీవితానికి జాలి తప్ప ... ఏమి చేయగలము.
• మనం చేసే ప్రతి కర్మని పంచభూతాల తో సహా వందల కళ్లు గమనిస్తూ నే ఉన్నాయి. ఎందుకంటే ఆ కళ్లన్నీ గుడ్డివి కావు……కొన్ని కళ్ల లాగ….
• మాయ మంచిదే… భాధకు మగతనిస్తుంది. ఎక్కువైతే నిజం కాన రాక జీవశ్చవం అయిపోతాం.
యడ్ల శ్రీనివాసరావు June 2022
12. నవరసాల నవరత్నాల గోదావరి
• గోదారమ్మ గోదారి
• ముత్యమంత శాంతి నీదమ్మా
• గోదారమ్మ గోదారి
• నీలమంత నీలి నీలాంబరమ్మా
• గోదారమ్మా గోదారి
• రాగమంత పుష్యరాగానీ వమ్మా
• గోదారమ్మా గోదారి
• పచ్చ పచ్చాని ప్రాణదాత వమ్మా
• గోదారమ్మ గోదారి
• వజ్రమంటి వీరనారి వమ్మా
• గోదారమ్మా గోదారి
• వైడూర్యమంటి వయ్యారివమ్మా
• గోదారమ్మా గోదారి
• (కెంపు) మాణిక్యానికే మకరందాని వమ్మా
• గోదారమ్మ గోదారి
• పగడానికే నువ్వు పట్టమహిషి వమ్మా
• గోదారమ్మా గోదారి
• గోమేథమంటి గోమాత వమ్మా
• గోదారమ్మ గోదారి
యడ్ల శ్రీనివాసరావు. 2020 May
Monday, June 1, 2020
11. తొలి విఫల మలి సఫల ప్రేమికుడు
• పిలిచితివో......వలచితివో.......మైమరపించితివో ప్రేయసి.
• సంతోషం అంటే నవ్వే అని తెలుసు..... నీ పరిచయం తో అది నువ్వే అని తెలిసింది.
• కట్టేసిన కట్టుబాట్లతో కట్టెగా ఉన్న నాలో ప్రేమా ....ఏమి ఈ చలనం ...ఎందుకీ సంచలనం.
• అమ్మ తో ఉన్న పసితనాన్ని ఆస్వాదించలేదు...... కానీ నీతో ఉన్న క్షణాల నుండి నేనింకా పసితనం లోనే ఉన్నాను.
• పసి పిల్లాడికి రెండే తెలుసు... ఏడవడం, నవ్వడం.... కానీ అది ఎందుకో కారణం వాడికి తెలియదు...... ప్రస్తుతం నా స్థితి లాగ.
• జీవితం అంటే ఆట.... ఆ ఆటలో ఎందరినో గెలిపిస్తున్న ఛాంపియన్ని.....కానీ నిను పొందలేక ఓడిన ఆటగాడిని.
• జీవితం అంటే నటన..... ఎందరినో మెప్పిస్తున్న మహానటుణ్ని......కానీ నిన్ను పొందలేక విఫలమైన నటుడిని.
• మనసంటే ఒక్కటే......జీవితం అంటే ఒక్కటే...అంటారు..... మరి నాకెందుకో అవి రెండేసి గా కనిపిస్తున్నాయి .
• తనువుకు కట్టుబాట్లేమో గానీ...... మనసుకు కాదు కదా.
• మాటలు మాట్లాడలేను గానీ........మదిలో నాదైన జీవితం నీతో పంచుకోలేనా.
• నా ఈ ఆలోచన నేరమా...... నాకు నేను వేసుకున్న శిక్ష లో ఆనందించడం కూడా నేరమేనా.
• నా సంతోషం నువ్వని తెలుసు.......కానీ నా బాధకి కారణం నువ్వని చెప్పలేక కూడాపోతున్నా .
• వదులుకున్నాను...... వదిలేసుకున్నాను...... నిను పొందే భాగ్యం లేక నీతో నన్ను నేనే వదిలేసుకున్నాను.
• నీ వలపుల.... మలుపుల....తలపులు.... పౌర్ణమి వెన్నెలని.... అమావాస్య నిశని మిగిల్చాయి.
• కుటుంబం, వ్రృత్తి, సమాజం పట్ల భాథ్యతను విస్మరించలేదు….. కానీ నా పట్ల నా భాథ్యతను, సంతోషాన్ని గుర్తించలేని అంధుణ్ని.
• ఒక్కటి మాత్రం నిజం..... నను నమ్ముకున్న కుటుంబానికి నేను హీరోని.....కానీ నాకు నేను జీరోని .
• పరిపక్వత లేని వయసు లో నిను ప్రేమించాను…. కానీ నీ ప్రేమతో నే పరిపక్వత పొందాను.
• నీ ప్రేమ తోనే తెలిసింది…. శరీరం వేరు, మనసు వేరని……అందుకేనేమో శరీరం వద్దన్నా…. మనసు నిను కావాలంటుంది.
• ఈ శరీరం ఎక్కడ విహరించినా…. మనసు మాత్రం వదిలిన చోటే పదిలంగా ఉంది.
• ఎవరికి సాధ్యం........నా మనసుని నిలువరించడం ఎలా సాధ్యం .
• ఎంతకాలమైనా..... ఎంత మందితో ఉన్నా..... ఎన్ని రోజులు బ్రతికినా..... నీ జ్ఞాపకాలే నా ఊపిరి.
• ఈ ఆరు పదుల వయసు దాటినా నిను చూడాలని, మాట్లాడాలని ఉంటుంది….నీ తలంపు తో నావయసు రెండు పదులవుతుంది. బహుశా అదే ప్రేమకున్న బలమేమో.
• సంతోషము దుఃఖము రెండూ సమానమే,పాలలో నీళ్ళలా గా కలిసి ఉంటాయనే జీవిత సత్యాన్ని తెలియజేసిన నీ నా ప్రేమ ఎప్పటికీ సఫలమే....
• నేను కట్టుబాట్లకు కట్టుబడి...... కట్టబడి...... కట్టెగా ఉన్నాను…చివరికి కట్టెల మీద కడ చేరేలోపు… కడసారైన నిను భౌతికంగా చూడగలనో…లేదో…
యడ్ల శ్రీనివాసరావు
Sunday, May 24, 2020
10. బిచ్చగాడు
• అందుకు సాక్ష్యం
• గుడి కి వచ్ఛేపోయే వారిని
• భగవంతుని ముందు భక్తులు
• మూతపడే మా కళ్ళకు
• గుప్పెడు నాణెల కోసం
• ఛీ .. ఛీ ... ఛీత్కారాలే మాకు ఆశీస్సులు
• అలంకార వి-గ్రహానికి నైవేద్యం
• ఏమిటో ఈ మాయ
• దేవుని మొక్కే మీకు అను-గ్రహం
• గుప్పెడు మెతుకులు కోసం ఆరాటం
• ఎంగిలి ఆకుల కోసం పడే అన్వేషణ
• బిచ్చగాడికి దేవుడు లేడా
• భగవంతుడా
• అమ్మా దానం
యడ్ల శ్రీనివాసరావు May 2021
Thursday, May 21, 2020
9. కళ్లు
Monday, May 18, 2020
8. పిట్ట కధ..... స్నేహితుల యెుక్క మనోభావాలు
సుమారు 100 రోజు ల తరువాత అర్థాంతరంగా , రోజుకు ఒకరు చొప్పున నలుగురు మిత్రులు నిష్క్రమించారు. మిగిలిన స్నేహితులకి ఆశ్చర్యం, కారణం కోసం వెతికారు…. ఫలితం శూన్యం….. అందరు బాధ పడ్డారు. అందరి తో కలిసి మెలసి కొంత కాలం ఉన్నప్పుడు , వ్యక్తిగత కారణాల వల్ల నిష్క్రమించాలనుకున్నపుడు మిగిలిన స్నేహితులకి తెలియపరచాలి అనే కనీస ధర్మం తెలియని వారి పరిణితి చూసి మిగతా వారు భాథపడ్డారు.
ఆ తర్వాత కలిసి ఉన్న మిగతా స్నేహితులు మాత్రం యధాలాపంగా పార్క్ లో కూర్చుని ఇలా అనుకున్నారు. ” సరే పోనీలే…పాపం…విడిపోయన వాళ్లు కూడా మన స్నేహితులే కదా……ఎక్కడ….ఎలా.....ఏపరిస్థితిలో ఉన్నా సంతోషం గా ఉంటే చాలు. జీవితం లో ఎవరు ఇంకొకరికి పూర్తిగా అర్థం అవ్వాలనే నియమం ఏమీ లేదు. కానీ కనీసం ఎవరికి వారిమే కొంతైనా మిగతా వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, చేతనైతే చేయూత ఇవ్వాలి. ……. ఎందుకంటే ప్రతీ ఒక్కరూ ఎవరికి వారే చాలా విలువైన వారు. ఎప్పుడు, ఏ వయసులో, ఏ సమయంలో, ఎవరి నుండి ఎటువంటి సహకారం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో మనకి తెలియదు. దీనికి ఎవరూ……అతీతం కాదు. ఎందుకంటే మనం బ్రతికేసిన కాలం కంటే కూడా బ్రతకాల్సిన కాలం చాలా తక్కువ. “ అని మిగతా స్నేహితులు అనుకున్నారు. ఎందుకంటే మిగతా స్నేహితులకు తెలుసు …వారంతా సంతోషం గా శేష జీవితాన్ని గడపగలరని.
యడ్ల శ్రీనివాసరావు 18 May 2020.
7. అమ్మ...మాత్రృదినోత్సవం
• బాధ్యత నెరిగిన కూతురివి కాగలిగావో లేదో.... తెలియదు.
• ప్రేమను పంచే సోదరివి కాగలిగావో లేదో.... తెలియదు.
• సహనం కలిగిన భార్యవి కాగలిగావో లేదో.... తెలియదు.
• ఎందుకు తెలియదు అంటే నిన్ను అర్థం చేసుకోగల వయసు లేక.
• పరిపూర్ణత్వం తో దైవానికి ప్రతిరూపమైన అమ్మవు అయ్యావు.
• అమ్మ...ఓ అమ్మ ...ఈ సృష్టి నే ప్రతి సృష్టి చేయగల శక్తివి నీవు.
• నాన్న ఎవరో చూడక ముందే నిన్ను అణువణువు తాకాను గర్భంలో.
• నన్ను మోస్తూ నువ్వు ఆనందంగా పడే బాధ కు అర్థం....దైవమని తెలిసింది ఆలస్యంగా.
• సంతోషాన్ని ఇచ్చే నీలాంటి కూతురే కావాలనుకున్నాను.
• ప్రేమను పంచే నీలాంటి సోదరే కావాలనుకున్నాను.
• ఓర్పుకు ప్రతిరూపమైన నీలాంటి భార్యనే కావాల నుకున్నాను.
• ఎన్నో సుగుణాల కలబోత అయిన నువ్వే నాకు అమ్మ గా ఎన్ని జన్మలైనా కావాలనుకుంటున్నాను.
• ఇన్ని సులక్షణాల మిళితమైన నీ రక్తం నుండి ఉద్భవించిన నేను నీలా కాక....ఎలా ఉండాలి.
• నా ఈ జన్మ ఎంత పాపిష్టి ది కాకపోతే....నేను వృద్ధాప్యంలో నిన్ను విస్మరిస్తాను....నువ్వు నా బాల్యంలో ఇలా చేయలేదు కదమ్మా.
• నా ఈ జన్మ ఎంత నికృష్టమైనది కాకపోతే....నేను నీకు గంజి పోయ లేక పోతాను....నువ్వు నా బాల్యంలో ఇలా చేయలేదు కదమ్మా.
• ఉన్నతంగా బ్రతకమని....ఉన్నతమైన జన్మనిచ్చావు.
• నేను చేసిన కర్మలకు, అకృత్యాలకు ....బ్రతికుండగానే నిన్ను అంటరానిదానిలా ఉంచడం నా పుట్టుకకు అర్థం ఉందా....ఓ భగవంతుడా....అర్థం ఉంటే చెప్పు.
• అందరి అమ్మలకు అంకితం ----కొందరి కొడుకులకు మాత్రం కనువిప్పు.
Friday, May 15, 2020
6. కళాశాల
రంగురంగుల చొక్కాలు
• ఓరచూపు నీలి కళ్లు
• ఎదురే లేదన్న దైర్యం తో
• కండ కలిగిన బాహువులు
• నాలో (కళాశాల) అడుగు పెట్టగానే
• చెట్టు చాటు మాటలు
• గాలికి ఊగే ఝంకాలు
• బొద్దుగా ఉండే చెక్కిళ్ళు
• వాలు జడల వలపు హోయలు
• కాలి మువ్వల సవ్వడులు
• ఊగిసలాడే మనసులు
• ఆకలి లేని రోజులు
• ఉనికి చాటుకునేందుకు ఉపాయాలు
• ఒకరి కష్టానికి పదిమంది చేయూత
• కాలచక్రం తిరిగిపోయింది
• దగ్గరలోనే దూరం
• ఏకాకిలా వచ్చారు
• కొందరిది స్నేహం
• అర్థం కాని అనుభవాల తో
• జీవితం ఎవరిని గెలిపిస్తుందో
యడ్ల శ్రీనివాసరావు 16 May 2020
Tuesday, May 5, 2020
5. విద్యార్ధి....ఓ.... విద్యార్ధి
• విద్యార్థి...ఓ విద్యార్థి...విద్యను అర్జించే ఓ ఆర్థి.
• మేలుకో....మేలుకో ఇకనైనా మేలుకో.
• చదువంటే పుస్తకాలే కాదు....చదువంటే జీవితం.
• జీవితమంటే బ్రతకడమే కాదు....బ్రతికి చూపించటం.
• బ్రతుకంటే సంపాదనే కాదు.....బ్రతుకంటే బాధ్యత.
• విద్యార్థి....ఓ విద్యార్ధి.....మేలుకో ఇకనైనా మేలుకో.
• బాధ్యతంటే కుటుంబం....కుటుంబం అంటే రక్తసంబంధం….రక్తసంబంధం అంటే నీ రక్తం ఆవిరైయంత వరకూ ఎన్నో జీవుల తో ముడిపడిన బంధం.
• బాధ్యత అంటే సమాజం....సమాజం అంటే నీ ఉనికి....ఉనికి అంటే నీ ఆలోచనల ప్రభావం.
• విద్యార్థి....ఓ విద్యార్ధి....మేలుకో ఇకనైనా మేలుకో.
• బ్రతికి చూడు.....బ్రతుకు చూడు.
• లక్ష్యం వైపు నీ పయనం లో మొదటి ఓటమి నీ బలం అని తెలుసుకో.
• నీ బలం లోని శక్తిని స్పృశించి చూడు.....అది నీకు దాసోహం కాకపోతే చూడు.
• దాసోహమైన నీ శక్తి నిన్ను కీర్తి శిఖరాలకు చేర్చినపుడు....నీ కనుపాప లోని భాష్పం ఈ విశ్వానికి ఓ సాక్ష్యం.
• విద్యార్థి....ఓ విద్యార్ధి...మేలుకో ఇకనైనా
• జవాబులేని గణితం లేదు....పరిష్కారం లేని సమస్య లేదు.
• కేంద్ర బిందువు లేని వృత్తం లేదు.....నీ ఉనికి లేని భూ వృత్తం లేదు.
• చాటుకో.....చాటుకో.....చోటు లేని చోట కూడ చాటుకో.....హద్దులే లేని ఆలోచనల ఆకాశంలో నీ అంశని.
యడ్ల శ్రీనివాసరావు 4 May 2020
Saturday, May 2, 2020
4. ఏది సత్యం...... ఏది అసత్యం
• మాట్లాడేవా ....ఏరోజైనా మాట్లాడేవా ....మాట్లాడి చూడు ....నీతో నువ్వు మాట్లాడి చూడు ...అద్భుతం జరగకపోతే చూడు
• నీ సృష్టికి మూలం కణం ...కణానికి మూలం శక్తి (దైవం)...శక్తి కి మూలం పంచభూతాల సమ్మేళనం (పరమాత్మ)
• భౌతిక ధర్మప్రకారం( as per physics/material) ఒక పెద్ద రాయి నుండి చిన్న రాయి వేరుపడితే రెండింటికీ ఒకే లక్షణాలు ,గుణగణాలు (physical/ material properties)ఉంటాయి . అంటే పెద్ద రాయి స్వభావం ఎలా ఉంటుందో చిన్న రాయి స్వభావం కూడా అంతే. జీవం లేని రాయి భౌతిక ధర్మాన్ని ఆచరిస్తూ కూడా సృష్టి ధర్మాన్ని అనుసరిస్తుంది . మరి జీవమున్న మనిషి ఆచరిస్తున్నాడా.......
• అలాగే పంచభూతాల మిళితమైన పరమాత్మ యొక్క మూలకణం లోంచి వచ్చిన నీ ఆత్మ ...మాయ .... మిథ్యలో...పడి పంచభూతాలను విస్మరిస్తే ... దుఃఖం, క్షోభ కాక ఇంకేముంటుంది ఈ జీవాత్మ కి . సృష్టి ధర్మాన్ని మరచి భౌతిక ధర్మాన్ని ఆచరిస్తే మోక్షం సాధ్యం ఎలా.
• తెలుసుకో... ఇకనైనా తెలుసుకో... నీ గురించి తెలుసుకో ...ఏది సత్యం... ఏది అసత్యమో తెలుసుకో. భౌతిక సాధనాల సుఖం ఏ రోజుకైనా నశించేదే నీ శరీరం లాగా ..........ఆంతరంగిక సాధనల సుఖం శాశ్వతం నీ ఆత్మ లాగా .
• జీవంలేని మట్టి కాలే కొద్దీ దృఢంగా గట్టిపడి ఇటుక అవుతుంది...........జీవంతో ఉన్న నువ్వు బాధలతో, దుఖంతో కాలే కొద్దీ ఇంకేంత గట్టిపడాలో ఆలోచించు...
• పరమాత్మ లో ఉండాల్సిన నీ ఆత్మ... భౌతిక ప్రపంచం లోకి వచ్చిందంటే కారణం ఏమిటో తెలుసుకో ........ఏ కారణం లేకుండా నువ్వు ఏ చర్య (కర్మ, పని)చెయ్యవు. అలాగే ఏ కారణమూ లేకుండా నువ్వు జన్మించవు . ఏ కారణం కోసం నువ్వు జన్మించావో ఆలోచించు, అది నిర్వర్తించు .
• ఒంటరితనం నీకు ఎప్పుడూ శాపం కాదు .....ఒంటరితనమే నిన్ను ఈ విశ్వానికి చక్రవర్తిని చేస్తుంది .....ఒక్కసారి ఆలోచించి చూడు ...అందుకు చెయ్యాల్సింది నీతో నువ్వు అంతర్ముఖ ప్రయాణం .
• నీ ఏకాంతానికి నువ్వు రారాజు అయినా కూడా నీ సామ్రాజ్యానికి పదిమంది శ్రేయోభిలాషులు అవసరం అని తెలుసుకో.
• నీ చుట్టూ ఉన్న వారు నీకు అర్థం కావడం లేదు.......లేదా ..... నీ చుట్టూ ఉన్న వారు నిన్నుఅర్థం చేసుకోవడం లేదు అని క్షోభించే బదులు .....నీకు నువ్వు అర్థం అవుతున్నావా లేదా అనేది ఆలోచించి చూడు..
• వైరాగ్యం అంటే సర్వం త్యజించడం , బాధ్యతల నుండి తప్పుకోవడం కాదు. వైరాగ్యం అంటే సత్యం , నిజం.
• జ్ఞాన వైరాగ్యం అంటే భౌతిక ఆధ్యాత్మిక బాధ్యతలను ఏ మార్గంలో నిర్వర్తించాలో తెలుసుకోవటం.
• బంధించకు... బాధించకు... ఎవరిని... దేనిని. ఎందుకంటే నీ నుండి నువ్వు తప్పించుకు తిరగలేవు. నీ ఆలోచనే నీకు శిక్ష కాగలదు .
• రెండు నేత్రాలతో చూసిన నీకు ఈ భౌతికమే కనిపించును. పరమాత్మ యొక్క మూల కణ రూపమైన నీవు…..నీలో ఉన్న మూడో నేత్రం (భృకుటి మధ్య పినియల్ గ్రంథికి అనుసంధానమై ఉంటుంది. విశ్వంలోని సమస్త శక్తి పినియల్ లో నిక్షిప్తమై ఉంటుంది) తోచూడు ఈ విశ్వంలో జరిగే ప్రతిదీ నీకు స్పష్టంగా కనిపిస్తుంది .
• భయాన్ని వీడు ....ధైర్యం తో స్నేహం చెయ్ . ధర్మం కోసం నిలబడు .అది నిన్ను ఎంత ఎత్తులో నిలబెడుతుందో చూడడానికి నీ పాదాలు కూడా నీకు కనపడవు .
యడ్ల శ్రీనివాసరావు 3 May 2020
613. పద - నది
పద - నది • పదమే ఈ పదమే నదమై ఓ నదమై చేరెను చెలి సదనము. • ఈ అలల కావ్యాలు తరంగాలు తాకుతునే ఉన్నాయి ఎన్న...

-
నాగ సాధువులు • మనసు కి శక్తి ఉంటుందా?. అవును మనసు కి శక్తి ఉంటుంది. అసలు శక్తి నిల్వ ఉండేదే మనసు లో. కానీ నేటి కాలం మనిషి పూర్తిగా ...
-
మైత్రి మాధుర్యం • కలిగే భావం లో మెదిలే నీ రూపం శివ • చూసే తారల్లో మెరిసే నీ వదనం శివ • నీ వెంట నేనుంటే రాత రా...
-
జీవిత స్వరం • సత్యమెన్నడు సతో ప్రధానం నిత్యమెన్నడు అమోదనీయం. • రేగుతున్న అలజడులే మనిషి కి రజో ప్రధానం. • ఎగిసిపడు ఉ...