Thursday, December 30, 2021

118.మనసు తోడుకి నీడ

 మనసు తోడుగా నీడ



• మనసా  ఓ మనసా  ఆయాసపడకే

• తపనతో నీవు తడబడుతుంటే 

  తనువు కు  రోదనే కదా


• మనసా  ఓ మనసా  చింతించకే

• చింతించి నా  చింతలు వీడుతాయా


• మనసా  బరువే లేని  

  నీవు  ఆనందిని వి కదా

• ఎందుకు    మరి ఎందుకు  ఈ దిగులు

  ఎవరేమన్నా రని   ఎదురెవరున్నారని

• బరువే లేని నీకు  భారమనే  దిగులెందుకు.


• మనసా  ఓ మనసా

  నీ వోక కావ్యం  కల్పన కు  అందవు.

• పువ్వులు పలకరిస్తుంటే 

  ఎందుకు చిన్న బుచ్చుకుంటావు.


• మనసా  ఓ మనసా  

  తేనెతో దరిచేరిన  తేనేటీగ పై కోపం ఎందుకు.

• జాబిలి జాలితో 

  వెన్నెల వేదనతో చూస్తుంది

  ఇకనైనా మౌనం వీడు మనసా.


• అలసి సొలసిన నీకు 

  జలపాతం నీడలో     సెలయేటి సేదతో

  హంసల వనంలో  పవళింపు  

  తేజోమయమే కదా

  మనసా  ఓ మనసా.


ఏకాంతం  లోని  కాంతి 

  నీకు  తోడు  అయితే 

  నీలో  ఏకం  కావాలని 

  ఒక  నీడ  ఎదురు చూస్తుంది 

  మనసా..….ఓ మనసా.


YSR 29 Dec 21 10:00 pm












Tuesday, December 21, 2021

117. గులాబీ పరిణయం – లిల్లీ మోహనం

 

గులాబీ పరిణయం – లిల్లీ మోహనం


• మనసే దోచావే మగువా

  మదిలో దాచావే పిల్లా.

• మౌనమెందుకే

  ఇంకాఆఆఆ మౌనమెందుకే.


• దోచుకున్నది దాచుకునేందుకు కాదే

   అనుభవించడానికే.

• ఇంకా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు 

  ఈ దాగుడు మూతలు.


• చూడు చూడు ఈ ఎర్రని గులాబీ🌹 ప్రేమతో 

  ఎదురు చూస్తోంది మన పరిణయ కోసం.


• ఈ గులాబీ వి నువ్వే అయితే

   ముల్లు గా రక్షణ నేనయి అల్లుకు పోతా.


• ఈ గులాబీ వి నువ్వే అయితే

   గుబాళింపు నేనయి ప్రదక్షిణాలు చేస్తా.


• ఈ గులాబీ వి నువ్వే అయితే

   పోషించే ఆకును నేనయి తల్లిని అవుతా.


• ఓ హాసిని  సుహాసిని   నా సౌందర్య హాసిని.


• మనసు తెరిచినంత లో చిన్న బోవులే.

  దాయాలంటే దాగేది కాదే మన ప్రేమ.

  కావాలంటే దాచి చూడు

  భారం నీకే తెలుస్తుంది.


• చూడు చూడు ఈ శృంగార లిల్లీ 🌼 

  మోహం తో చూస్తోంది 

  మన సమ్మోహనం కోసం.


• ఈ లిల్లీ వి నువ్వే అయితే

  పుప్పొడిని నేనయి మధువు నే ఇస్తా.


• ఈ లిల్లీ వి నువ్వే అయితే

   తేమని నేనయి సుగంధ పరిమళమే ఇస్తా.


• ఈ లిల్లీ వి నువ్వే అయితే

   తెల్లని మనసు తో తాజాదనమే ఇస్తా.


• ఓ హాసిని   సుహాసిని  నా సౌందర్య హాసిని


• మనసే దోచావే మగువా

   మదిలో దాచావే పిల్లా.

• మౌనమెందుకే

  ఇంకాఆఆఆ మౌనమెందుకే

• దోచుకున్నది దాచుకునేందుకు కాదే.


• ఇంకా ఎన్నాళ్ళు, ఎన్నేళ్ళు 

  ఈ దాగుడు మూతలు.


• ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడే


• మాట చెప్పవే

  మనసున దాగిన మూట విప్పవే


• గులాబీ లు, లిల్లీ లు ఎదురు చూస్తున్నాయి 

  నీ మాట కోసం

  నీ మనసు కోసం

  మన కలయిక కోసం😔


• గులాబీ రేఖలు వీడినా

  లిల్లీ తెలుపు వాడినా

  ఎదురు చూపులే    ఎడారి శిలలు అవుతాయి.



యడ్ల శ్రీనివాసరావు 18 డిసెంబర్ 21 11:45 pm.





Thursday, December 16, 2021

116. పుష్పధామము


పుష్పధామము

• పూలతోటలన్ని భూలోక

  స్వర్గధామములవుతుంటే

  స్వర్గలోక దేవతలే 

  నందనవనము లో ని పుష్పములు.


• పువ్వులు ఎన్నున్నా పరిమళమన్నది ప్రత్యేకం.


• పువ్వుల రూపం ఏదైనా రమణీయం ఒక్కటే.

• పూరంగులు ఎన్నైనా రంజనమనమే ప్రత్యేకం.

• పూపరిమళం ఏదైనా పరవశం ఒక్కటే.


• తొలకరి తొడిమ న ఊయల ఊగుతూ, 

  ఊగిసలాడే మొగ్గ లోని మనోహరం 

  మొక్క కెంతో సింగారం.


• వసంతాన కేరింతల లో, 

  విరజిల్లే పరిమళం తో, 

  వికసించిన పుష్పానికి, 

  ఫ్రౌడ(యవ్వనం) మెంతో పారవశ్యం.


• చేతి లో చేరిన చామంతులు 

  చెక్కిలి గిలికి చెలగాటమాడుతుంటే 

  సిగలో చేరిన మల్లెలు సిరిసిరిమువ్వలా 

  సిగ్గు పడుతున్నాయి.


• ఎదపై చేరిన మాల కనక “ అంబరాల “

   ఆనందంతో ఉంటే 

   పాదముల చేరిన పారిజాతాలు పూజకు 

   తపించే పద్మములై ఉన్నాయి.


గులాబీ ల గుబాళింపు గుండె లోన

   అలజడులవుతుంటే

   మల్లె లోని ఉద్వేగమే మరువలేని మైధునం.


విరజాజి ల   విరహమే   వరూధినికి 

   వన్నె తెస్తుంటే

   బంతి  లోని  బరువు శరీరానికి ఉల్లాసము.


సంపెంగ సుగంధం వెన్నెల రాత్రి లో 

  విహారం చేస్తూ ఉంటే

  చందమామ కలువలా చూస్తూ ఉంది.


•  లిల్లీ ల   లీల లే  సంగమ  కేళి లో  

   కెరటాలవుతుంటే

   మొగలి పువ్వు  మన్మధునికై పరితపిస్తూ ఉంది.


• మనసు నెరిగిన మందారం 

  మగువని పిలుస్తూ ఉంటే

  సిత్రాల  సన్నజాజి  నడుము కై  

  వెతుకుతూ ఉంది.


• పులకరించే పువ్వులు పలకరిస్తూ ఉంటే

  ప్రేయసి పలుకుకున్నా

  పువ్వులు పదముల  రూపం లో  పోంగి పొర్లి

  ప ద ని స లై    ప్రియురాలి చెంతకు చేరాయి.

యడ్ల శ్రీనివాసరావు 16 Dec 21 9:00 pm.

Tuesday, December 14, 2021

115. బ్రహ్మ బాబా _ ఓం శాంతి

 బ్రహ్మ బాబా_ ఓం శాంతి

• నడిపించు బాబాా ,  నడయాడే బాబా

• ఓ బ్రహ్మ్హ బాబా…. మా దివ్య రూపా…(2)

• నీ వదనం సుందర మనోహరం.

• నీ తలంపే జన్మ జన్మల పుణ్యఫలం.

• నీ మనసే మంచు శిఖరమంటి మహిమాన్వితం.

• నీ కరుణ లో ని చల్లదనము మా జీవితాల కి మహా వృక్షము.

• నీ ప్రేమ లోని పరిమళం తామరాకు వికాసం.

• తరగనిదే నీ జ్ఞానం…..చెరగనిదే నీ రూపం.

• అంధకారాన మాకు వెలుగు నిచ్చిన జ్యోతి వి, జ్ఞాన జ్యోతి వి

• దుఃఖసాగరాన మాకు తేజ మిచ్చిన మూర్తివి ప్రేమమూర్తి వి

• పాలకడలి లో వెన్న లాంటి నీ చిరునవ్వు మా ఆకలిదప్పుల కు అమృతము.

• నీ పిలుపే అష్టపదుల ఆరాథనము

• నీ చూపే కోటి తారల తేజోమయం

• నీ నీడే సప్తపదుల సాంగత్యము

• నీ బాటే సత్య సాధన సోపానం

• నీ సేవే సకల జీవులకు జీవన ముక్తి

• నడిపించు బాబా నడయాడే బాబా

• ఓ బ్రహ్మ్హ బాబా…. మా దివ్య రూపా…

ఓం శాంతి

ఓం నమః శివాయ🙏


యడ్ల శ్రీనివాసరావు 14 Dec 21 10:00 am.


Friday, December 10, 2021

114. పరిణయ నిశ్చితార్థం

                       పరిణయ నిశ్చితార్థం

(బాల్య మిత్రురాలి కుమార్తె వివాహ నిశ్చితార్థం సందర్భంలో, ఆ ముక్కంటి ఆదేశానుసారం …✍️)


• పరిణయమే పరిణయమే మనసు ను చేరిన పరిణయమే

• మధువనమే మధువనమే వధువు ను గాంచిన మధువనమే

• ఉప్పొంగుతున్న ఉల్లాసమే,

• ఎదలోతులోని లావణ్యము.


• ఉవ్విళ్లూరుతోన్న ఆరాటమే,

• నవజీవనాన సౌభాగ్యము.


• మేళ తాళాల వైభోగమే,

• తెర చాటు సిగ్గు సౌందర్యము.

• ........అదియే.....అదియే....తొలకరి మొగ్గకి ఆనందము.

🥀🥀🥀🥀🥀

• పరిణయమే పరిణయమే మనసు ను చేరిన పరిణయమే

• మధువనమే మధువనమే వధువు ను గాంచిన మధువనమే


• దేవతల దీవెనలే  తలంబ్రాలవుతున్నవేళ లో

• సింధూర తిలకాన సౌందర్యమే,

• సింధూరి దారల సమ్మోహనం.


• సింధూర రాగానా సన్నాయి యే,

• సింధూర గానాన మధురామృతము.


• పసుపు ఛాయన సింధూర కి

• పాదాల పారాణి సింధూరము.

• ........అదియే.... అదియే..... సత్య శంకరుల ఆనందము.

🌹🌹🌹🌹🌹

• పరిణయమే పరిణయమే మనసు ను చేరిన పరిణయమే

• మధువనమే మధువనమే వధువు ను గాంచిన మధువనమే


• నవ వధువరుల తాంబూలమే పరిణయ సాక్షి అవుతున్న వేళలో

• అరిటాకు తోరణాల అభివందమే,

• విందు వేడుకల ఆతిధ్యము.


• హరివిల్లు తుమ్మెదల విహరమే,

• తాటాకు పందిరి కి మకరందము.


• వేద మంత్రాల సాంగత్యమే,

• ముత్తైదు తాంబూల ఆశీస్సులు.

• …….అదియే..... అదియే..... శివ పార్వతుల సంకల్పం.

• …….అదియే..... అదియే..... అది దంపతుల ఆశీర్వాదం.


• పరిణయమే పరిణయమే మనసు ను చేరిన పరిణయమే

• మధువనమే మధువనమే వధువు ను గాంచిన మధువనమే


🙏🙏🙏

యడ్ల శ్రీనివాసరావు 8 Dec 21 10:45 pm.


Monday, November 29, 2021

113. యువతరం – నవతరం


యువతరం – నవతరం

(SRKR Engineering college , Bhimavaram Freshers Day & Parents meet (29/11/21 10:00am ) సందర్భంలో , ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులు సాధించిన విజయాలు exhibition లో చూసి, విద్యార్థులు నైపుణ్య వంతులు గా మారే విధానం professors ద్వారా విని…. ప్రేరణతో  యువత కోసం, యువతను ఉద్దేశించి✍️)

• నింగి ఎంత ఎత్తు నున్న

ఎగిరే పక్షి కి హద్ధే ముంది లే.


• సంద్రం ఎంత లోతు ఉన్న

ఈదే చేప పిల్ల కి అలుపే ముంది లే.


• బురద ఎంత మురికి గున్న

పూచే తామర కలువకి ధుర్గుంధ మేముంది లే.


• బ్రతుకు ఎంత భారమైన

భరోస నిచ్చే అండ ఉంటే బరువే ముంది లే.


• దారి ఎంత దూరమైన

దారి ఎంత ధీనమైన

గుండె నిండ ధైర్యముంటే దారి అంత  దివ్యమేలే.


• చింత లెన్ని   చిగురు లైన

చిద్విలాసి తోడు ఉంటే   చింతే ముంది లే.


• కష్టం తో కరిగించు నీ   లో లో ని   కాలుష్యాన్ని

నింగి కెగిరే చేప పిల్ల   నీ   కే  సొంతం.


• తపన తో సృష్టించు నీ దైన తారాలోకాన్ని

సంద్రం లో ఈదే పక్షి పిల్ల  నీ   కే  సొంతం.


• ఏకాగ్రత లో ఏకం కానియ్ నీ గతం

కలువ వంటి మనసు నీ  కే  సొంతం.


• లక్ష్యమెంత కఠినమైన   లక్షణమే నీ ఆయుధం.

భారమై న   చింత లన్ని    నీ    లో  నే  అంతం.


• నైపుణ్యం లో  నే  ఉంది   నీ  పుణ్యం

అదే తరతరాలకు చెక్కు చెదరని నీ రూపం….నీ ప్రతిభ.


YSR 29 Nov 21 , 6:00 pm.


Saturday, November 20, 2021

112. స్నేహ చక్రం

 స్నేహ చక్రం


• స్నేహం…స్నేహం…ప్రాణానికి సాయం.

• బుడి బుడి అడుగుల వయసులో……తెలిసి తెలియని రాగం.

• (Elementary 5-10 yrs)


• స్నేహం…స్నేహం…జీవానికి ప్రాణం.

• చిట్టి పొట్టి నడకల వయసులో……..తపన చెందే తానం.

• (Primary 10-12 yrs).


• స్నేహం…. స్నేహం…. ప్రాణానికి మోహం.

• వడి వడి అడుగుల వయసులో…….ఉరకలు వేసే పల్లవి.

• (Upper Primary 13-15 yrs).


• స్నేహం…స్నేహం….మోహనికి సంతోషం.

• తడి పొడి మాటల వయసులో……. మబ్బుల చాటున దాగిన రహస్యం.

• (Intermediate Teen 16-19 yrs).


• స్నేహం….స్నేహం…. సంతోషానికి సంబరం.

• గల గల చేతల వయసులో….. వెంట ఉండే ధైర్యం.

• (youth 20-30 yrs).


• స్నేహం…. స్నేహం….సంబరానికి *మేళం.

• భవ బంధాల ముడుల వయసులో….. అవసరమయ్యే సుగంధ పరిమళం.

• (Above Youth 30-50 yrs).


• స్నేహం….. స్నేహం…..మేళవింపుకి జీవం.

• ఎద లోతుల అనుభవాల వయసులో….. మనసు విడనాడలేని బంధం.

• ( Pre old 50-65 yrs).


• స్నేహం…. స్నేహం….. జీవానికి పునరుజ్జీవనం.

• ఏకాంతపు ఒంటరి వయసులో…. మనసుకి ప్రేమ, తనువుకి చేయూత అదే స్నేహానికి పరమార్థం.

• (Till to Death 65 + yrs)

స్నేహమంటే కాలక్షేపం కాదు..... స్నేహమంటే కాలక్షేమం.

 …..అదే అదే సుగంధ భరితమైన స్నేహం , బంధాలు ఎన్నో ఉన్నా, సృష్టి లో స్నేహం ప్రత్యేకం. ఎందుకంటే …. స్నేహానికి బంధుత్వం, వయోభేదం, లింగభేదం, జాతి కులమతాలు, ధనిక పేద భావాలు, లేవు….. మంచి స్నేహం లో ఉండేది, ఉండవలసింది ఒక్కటే, నిజాయితీ…. విశ్వాసం…..సహాయం….అర్థం చేసుకోవడం.

ఈ స్నేహం అనేది కేవలం కలిసి చదువుకున్న వారిలో నో,  లేదా కలిసి పని చేసే వారిలో నో ఉండవలసిన అవసరం లేదు... స్నేహం ఒక యోగం అయినపుడు భార్య, భర్త, పిల్లలు, తల్లి తండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్ని భవ బంధాల లో ను ఉంటుంది.... కానీ ఈ ముడి బంధాల లో  స్నేహం చిగురించాలంటే...... ఎంతో స్వేచ్చ,  త్యాగనిరతి తో   అర్థం చేసుకునే విశాలమైన హృదయం  కావాలి....

తామరాకు లా, కలువ పువ్వులా కలుషితం కానిదే స్నేహం.


YSR 20 Nov 2021, 7:00 pm.

Friday, November 19, 2021

111. నాతో వస్తావా ... నాతో ఉంటావా

 నాతో వస్తావా ... నాతో ఉంటావా ...



• నాతో వస్తావా ... 

  నాతో వస్తావా …

• నాతో వస్తే  ఆకాశవీధిలో 

  తారల మెరుపుల వలపులు చూపిస్తా…


• నాతో ఉంటావా ... 

  నాతో ఉంటావా …

• నాతో ఉంటే  జాబిలి నీడలో 

  మేఘాల పానుపు చేసి,  మధువందిస్తాను.


• జన్మకు కలిసిన మనసులం 

  జతగా ఎందుకు కాలేము.

• జననం    మన చేతిలో లేదు ...

  మరణం   మన చేతిలో లేదు …

  మరి మన ప్రేమకు మాత్రమే 

  ఎందుకు ఈ బంధీఖానా.

• తరిగిన కాలం ఎంతో ...  

  మిగిలిన కాలం కొంతే.

• ఆలోచించు …

  ఆలోచించు …


• నాతో వస్తావా …

  నాతో వస్తావా …

• నాతో వస్తే   రెక్కల గుర్రాన్నై 

  రేయింబవళ్లు   ఊరేగిస్తానే.


• నాతో ఉంటావా  …

  నాతో ఉంటావా  …

• నాతో ఉంటే  కమ్మని  కౌగిలిలో  

  మాటల ఆటలతో  లాలిస్తా …


• నేను  ఉన్నది  నీ కోసమే …

  నేను  అన్నది   నీ కోసమే.

• ఒకే కుందెలో   ఒత్తులు కాము. 

  అయినా ...

  ఒకరి వెలుగు   ఒకరి పై   పడుతుంది ...

  దీనిని ఎలా ఆపగలం ...

• సూర్యుని  వెలుగు   ఆపలేము 

  చంద్రుని    వెన్నెల   దాచలేము 

  మరి మనలో   ప్రేమను ఎలా ఆపగలం.

• ఆలోచించు … ఆలోచించు ...


• నాతో వస్తావా ... 

  నాతో వస్తావా …

• నాతో వస్తే సప్త సాగరాలు మించిన 

  ప్రేమ సాగరమే  చూపిస్తా …


• నాతో ఉంటావా …  

  నాతో ఉంటావా ...

• నాతో ఉంటే మొగలి వనంలో 

  మన్మధుడినై ,  రతీదేవి నే తలపిస్తా ...


• ఆలోచించు … ఆలోచించు …

• నీ ఎదపై సేద కోసం 

  ఎన్నాళ్ళని చూడాలి … 

  ఎన్నేళ్ళని  అలసి  ఉండాలి.

• తరిగిన కాలం ఎంతో ... 

  మిగిలిన కాలం కొంతే.

• ఆలోచించు …  ఆలోచించు ...

• నాతో వస్తావా … 

 నాతో ఉంటావా….


యడ్ల శ్రీనివాసరావు 19 Nov 21 Fri 11:00 am.


Tuesday, November 16, 2021

110. నండూరి వారి ఎంకి

 

నండూరి వారి ఎంకి

(ఈ కవితా పాట, మొదటి సారి, ప్రయోగాత్మకంగా, పల్లెటూరి జానపద శృంగార మేళవింపు తో, చాలా సహజంగా రాయడం జరిగింది. ఈ zone లో ప్రయోగాత్మకంగా రాసినది.)


• వంగపండు చీర లో……వయ్యారి వలపు లో

• చిక్కకున్న చుక్క వే……చక్కనైన భామ వే.


• తేనే కళ్ల చూపు తో….కొంటె నడుము ఊపు తో

• పాలబుగ్గ పసిడి వే…….పైట జార పోరి వే.


• సన్నజాజి రూపు తో…….సయ్యాటల ఆట తో

• కాలు దువ్వే గిత్త లా….కలబడే వు కొత్త గా….

• పిల్లా….ఓ పిల్లా…


• చెంగావి చీర న…..చెరువు గట్టు చెట్టు న

• తొక్కుడు బిళ్ళ ఆట న……ఎగిరెగిరె పైట న …. ఎగసి పడినే  ఎద  నా...


• వంగ తోట మాటున …వంగి వంగి నడిచినా

• వయ్యారమే పిలిచినా….వగలు సిగలు తగ్గు నా…

• పిల్లా….ఓ పిల్లా…నా పిల్లా చింపిరి జుత్తు పిల్ల. 


• నుదుటి బొట్టు వెలుగుతో…. ఇంద్రధనుసు మెరిసెనా

• కాలి గజ్జె ఘల్లు తో….చిలిపి చూపు పిలుపు తో

• చందమామ నీడ లో…. కురుల మాటు చేర నా….చిన్ని ముద్దులివ్వనా..

• మబ్బులేమో పరిచెనే…పాలపొంగు విరిసెనె.

• పిల్లా....ఓ పిల్ల…నా కలువ పువ్వు కమలమా…


• హంస నడక పాటు లో…..జడగంటల పోటు లో

• కౌగిలింత ఘాటు లో....గంథమయ్యె ఊపిరి….. సుగంధ మయ్యె కౌగిలి.

• పిల్లా..ఓ పిల్లా….నా చందనాల బొమ్మా.



YSR 15 Nov 21 , 10:00 pm


Saturday, November 13, 2021

109. జగన్నాటకం


జగన్నాటకం


• సాగుతున్నది  

  కాలం   కలలా .

• ఊగుతున్నది 

  జీవితం  ఊయల లా .

• సాగే   ఊగులాటలో 

  తేలి   మునుగుతున్నది 

  మనసు మంచు పల్లకి లా.


• ఎందాకో    ఈ  పయనం

  ఎటువైపో   ఈ  గమనం.

• పయనంలో 

  ప ద ని స ల   పరిచయాలు   ఎన్నెన్నో.

• గమనం లో 

  గడబిడ లు   ఎందరో 

*గమకమలు   ఎవ్వరో.


• ఆటుపోటుల    ఆటల్లో 

  అమృతమే     దొరికేనా 

  గరళమే     మిగిలేనా.

• అమృతమే   దొరికితే 

  ఆనంద  నందనము లను   నిర్మిస్తా.

• గరళమే  దొరికితే 

  గంధర్వ మని   జ్ఞానముతో  సేవిస్తా.


• దర్శకుడు   లేని   నాటకం 

  ఎంతో    పేలవం.

  పరమాత్మ ను  ఎరుగని  

  జగన్నాటకం  మహా  ప్రళయం.


• పయనంలో   పోతూ  ఉంటే 

  రంగుల  లోకం  

  రా…రా…. అంటుంది.

• పాత్రధారులంతా 

  రంగులతో రమణీయంగా ఉన్నారు.

• రమణమెంత   ఉన్నా 

  రక్తి లేదు    నాటకానికి

  బహుశా  రంగు వెలసి   పోతుందేమో.


• గమనంలో పోతూ ఉంటే

  దివ్యలోకం  

  దా… దా… అంటుంది.

• పాత్రధారులు 

  లేరక్కడ  

  అందరూ సూత్రధారులే (దేవతలు).


• ఎటు వెళ్ళాలో  ...

  ఎన్నాళ్ళో   ఈ పయనం 

  ఎన్నేళ్ళో    ఈ గమనం.


• ప్రతిభ    కలిగిన  నటునికి 

  నాటకం  ఒక   ఆట

  జగన్నాటకం  ఒక  పాట.


యడ్ల శ్రీనివాసరావు  14 Nov 2021 , 4:00 am.


*గమకము = హృదయంగమము, మనసు కు ఇంపైన వారు

*ఆనందనందలాలు = సంతోషమే నే పూల తోటలు

*గంధర్వుము = మరణానికి  పునర్జన్మ కి  మధ్య కాలంలో  యాతనా శరీరమును ధరించిన ప్రాణి





108. సర్వే జనా సుఖినోభవంతు

 శివా…శుభం

🙏సర్వే జనా సుఖినోభవంతు 🙏


• శివా….ఓ శివా

• మహారాజు వే   రారాజు వే

  మనుషుల పాలిట యుగరాజు వే


• జ్ఞాన సాగరుడివైన శివా! 

  నీ లోని జ్ఞానము ఆవిరై మేఘమై వర్షించిన  

  అందు తడిచిన మేము ధన్యులము.


• వికారములనే  సర్పాలను కంఠహరంగా 

  చేసుకుని బుధ్ధి అనే జ్ఞాన గంగ ను మోస్తుంటావు.


• చేత చేయి పట్టి  మరణశయ్య న 

  కాయానికి తోడుగా  నీడలా కాస్తూ 

  జనన  మరణాల బాధ్యత నీదే నంటావు.


• స్మశానము నే నివాసము తో

  వైరాగ్యము నే ఆదర్శం గా చేసుకుని  

  జ్ఞానమనే త్రినేత్రముతో 

  నిశీధిన ఏలుతూ ఉంటావు.


• శివా అంటే శుభం

  శివా శివా అని పలుకగా శుభము కాక 

  మాకు ఇంకేమి కలుగు.


• మా లోని దుర్గుణములే

  నీ కంఠమున ఉన్న గరళముగ దాచి

 మమ్ము సంస్కరింప కంఠుడివి   నీలకంఠుడివి.


యడ్ల శ్రీనివాసరావు 13 Nov 2021, 7:00 pm





Friday, November 12, 2021

107. ఆత్మ రహస్యం (కధ)

 

ఆత్మ రహస్యం (కధ)


అది 1990 కాలం, నిడదవోలు అనే ఊరిలో ఒక పేరు ఉన్న ఇంటర్మీడియట్ ప్రైవేటు కాలేజి. ఆ కాలేజీ ఊరికి దూరంగా , ప్రశాంతమైన పచ్చని పొలాలు మధ్య విశాలంగా ఉంది. ఆ కాలేజీ లో వాసు లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. వాసుకి 28 సంవత్సరాలు. ఇంకా పెళ్లి కాలేదు. వాసు టీచింగ్ బాగా చేస్తాడని, స్టూడెంట్స్, తోటి లెక్చరర్స్ అందరితోనూ కలిసి మెలిసి ఉంటాడని మంచి పేరు. మధ్యాహ్నం సమయంలో స్టాఫ్ అంతా కలిసి, ఒకేచోట కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం వారికి నిత్యం అలవాటు.

 సుజాత ఆ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్ గా చేస్తుంది. వీరిద్దరూ రోజు లంచ్ టైమ్ లో కలిసేవారు, కానీ మాట్లాడుకునే వారు కాదు. సుజాతకు వాసు అంటే మనసులో చాలా ఇష్టం, గౌరవం ఉండేది. ఒక విధంగా వాసు మీద ప్రేమ ఉండేది కానీ , ఎవరికీ తెలియదు.....  కానీ, వాసు కి మనసు లో సుజాత మీద ఏ విధమైన వ్యక్తిగత ఫీలింగ్ లేక పోయినా, సుజాత ను చూసినపుడు, సుజాత దగ్గరగా వచ్చి నప్పుడు ఏదో , ఎప్పుడో తనకు తెలిసిన మనిషి గా అనుభూతి పొందేవాడు. ఇలా తనకు ఎందుకు అనిపిస్తుంది అని వాసు ఆలోచించే వాడు , మరలా అంతా మరిచిపోయి యధాలాపంగా తన పని తాను చూసుకునేవాడు.

ఒకరోజు వాతావరణం చల్లగా మబ్బులతో నిండి ఉంది, మధ్యాహ్నం 2 గంటలు సమయం లో , స్టాఫ్ రూం లో వాసు, మరో ఇద్దరు లెక్చరర్స్ తో కూర్చోని , సీరియస్ గా ఎగ్జామ్ పేపర్ ప్రిపరేషన్ గురించి చర్చిస్తున్నాడు. ఆ సమయంలో సుజాత స్టాఫ్ రూం లో ఉన్న వాసు దగ్గరకు వచ్చి, “వాసు సార్ “ ఒకసారి మీతో రెండు నిమిషాలు మాట్లాడాలి అంది. వాసు ఒక్కసారిగా ఉలిక్కిపడి , చిన్న గా నవ్వుతూ సరే అని లేచి, స్టాఫ్ రూం బయట కారిడార్ లోకి ఇద్దరూ వచ్చారు. బయట పచ్చని మొక్కలు, గార్టెన్, చల్లని వాతావరణం ఆకాశం నీలిమయం తో ఆహ్లాదకరంగా ఉంది. చెప్పండి సుజాత గారు, ఎందుకు పిలిచారు అని అన్నాడు వాసు. వెంటనే సుజాత గొంతు సవరించు కొని సార్ నేను ఈ కాలేజీ లో , జాబ్ రిజైన్ చేసేసాను . ఇక్కడకు 20 కి.మి. దూరం లో వెలివెన్ను లో వేరే కాలేజి కి వెళ్ళి పోతున్నాను. ఆ కాలేజీ హాస్టల్లో నే నాకు అకామడేషన్ ఇస్తున్నారు. నేను మీ డిపార్ట్మెంట్ కాకపోయినా , మీ తో చెప్పి వెళ్ళాలనిపించింది, ఉంటానండి అని సుజాత వాసు తో చెప్పి వెనుతిరిగింది కానీ , సుజాత కు తెలియకుండా కంట నీరు జారుతుంది. వాసుకి కూడా ఏదో తన నుండి బలవంతంగా ఏదో విడిపోయి దూరంగా వెళ్లి పోతున్నట్లు మనసులో అనిపించింది.

ఒక నెల రోజులు గడిచింది, వాసు ఏ పని చేసుకుంటున్నా తరచుగా మధ్యలో సుజాత గుర్తుకు వస్తుండేది. అసలు ఎందుకు నాకు గుర్తు వస్తుంది , ఏంటి తనకు నాకు ఉన్న సంబంధం, నేనేమీ తనను ప్రేమించడం లేదు, ఇష్టపడడం లేదు కదా , ఎందుకు ఇలా అవుతుంది అని ఒక కన్ఫ్యూజన్ తో ఉన్నాడు వాసు.

వాసు ఉన్నట్లుండి, అకస్మాత్తుగా ఒక రోజు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో , స్టాఫ్ రూం లో కూర్చున్నవాడు లేచి , సుజాత ను చూడాలనిపించి, తను వర్క్ చేసే కాలేజీ కి బయలు దేరి వెళ్లాడు. కాని చాలా దూరం వెళ్ళాక తెలిసింది , తాను కాలి నడకతో వెళ్తున్నానని, అప్పటికే సాయింత్రం సమయం 6 గంటలు అయింది అని తెలిసింది. పైగా ఒక్కసారిగా వాసుకి‌ ఒళ్లు జలదరించింది తన ఒంటిపై షర్ట్ లేదని గ్రహించాడు. మరలా సుజాత వద్ధకు రేపు వెళ్దాం లే అని వెనుక తిరిగాడు. సాయంత్రం 6 గంటలు దాటింది, రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. అలా వాసు తిరిగి నడుచుకుంటూ వస్తున్న సమయంలో, దారి మధ్యలో ఒక సంఘటన జరిగింది.

వాసు ఒక్కడే అలా చీకటి పడుతున్నా సరే నడుచుకుంటూ వస్తూ, ఒక నిర్జనమైన ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ ఒక పెద్ద పాత పెద్ద పురాతనమైన భవనం, చూడడానికి హాస్పిటల్ భవనం లా ఉంది. ఎత్తైన పెద్ద చెట్లు, అక్కడ నేలనిండా ఎండిపోయిన ఆకులు ఉన్నాయి. వాసు నెమ్మదిగా ఆ చీకటి లో, వెన్నెల వెలుగులో లోపలికి అడుగులు వేశాడు. లోపల చాలా మంది స్త్రీలు జుట్టు విరపూసుకొని, కొంతమంది నేలమీద ఇష్టం వచ్చినట్టు దొర్లుతూ, మరి కొంతమందరు నిద్రలో ఉన్నట్లు ఉన్నారు. వారు దెయ్యాలు గా, ప్రేతాత్మ లు గా మనసులో అనిపిస్తుంది వాసుకి. అదంతా చూస్తూ వాసు నెమ్మదిగా వారి మధ్యలో నుండి నడుస్తున్నాడు. వాసు కి ఏంటి ఇదంతా అని ఒక వైపు భయంగా, చెమటలు పడుతున్నాయి.

వారందరినీ దాటుకుని వెళ్తుండగా వాసుకి ఒకచోట ఒక తల్లి, ఆమెతో పాటు ఒక 12 సంవత్సరాల చిన్నపిల్ల నేలపై పడుకొని ఉండటం గమనించాడు. వారిని దాటుతూ ఉండగా, ఆ చిన్నపిల్ల ఒక్కసారిగా “ వాసు, ఎరుకల గోత్రం” అని అరిచింది. వాసు కి ఒక్కసారి ఒళ్లంతా చెమటలు పట్టేశాయి, నా పేరు మీకు ఎలా తెలుసు, ఎవరు మీరు అని అడిగాడు. ఆ చిన్నపిల్ల మౌనం గా ఉంది, గాని వాసు కి సమాధానం ఇవ్వలేదు , సరికదా మరలా రెండో సారి, పేరు గోత్రం తో వాసు ని పిలిచింది. వెంటనే వాసు రెండు చేతులు జోడించి , ఎవరు మీరు, నా గురించి ఎలా తెలుసు అని ఏడుస్తూ ఆ పిల్ల ని అడిగాడు. వెంటనే ఆ చిన్నపిల్ల నీ గురించి అంతా తెలుసు, మా అమ్మ అయితే బాగా చెపుతుంది అని, వాళ్లు అమ్మని తట్టి లేపుతూ “అమ్మా అమ్మా వాసు అసలు ఎవరో చెప్పమ్మా” అని అడిగింది. వెంటనే తల్లి లేచి కూర్చుని వాసు తో, నువ్వు ఎవరో తెలుసా, ఎలా చనిపోయావో తెలుసా అని అడిగింది వాసు ని. వాసు వెంటనే భయబ్రాంతుడై , ఆశ్చర్యంగా “ తెలియదు” అని సమాధానం ఇచ్చాడు. ఆ తల్లి వెంటనే నీ పేరు శ్రీనివాసు, నువ్వు గతజన్మలో ఒక జైలర్ గా చిన్న ఉద్యోగం చేసే వాడివి. నీకు నీ భార్య అంటే విపరీతమైన ఇష్టం, ఆమె అంటే పంచ ప్రాణాలు. నీ భార్య కోసం ఏదైనా సరే చేసే వాడివి. ప్రేమ కు ప్రతి రూపం నువ్వు. నువ్వు జైల్లో పని చేస్తూ, నీ భార్య కు కధలు ఇష్టం అని , రోజు కధలు చదివి చెపుతూ ఉండేవాడివి. నీ భార్య కోసం ప్రేమ గా కవితలు రాసి వినిపిస్తూ ఉండేవాడివి. ఇదంతా వింటున్న వాసు కి, కాళ్లు వణకడం మొదలైంది. అసలు ఏంటి ఇదంతా అని మనసు లో అనిపిస్తుంది. వెంటనే వాసు, ఆ తల్లి తో “మరి నా భార్య ఎవరు, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ తల్లి కళ్లు మూసుకుని చిన్నగా నవ్వి , నువ్వు ఒంటి మీద చొక్కా లేకుండా, పది కిలోమీటర్లు కాలి నడకతో , ఎవరిని కలవడానికి వచ్చావో ఆ సుజాత లో నే, నీ భార్య ఆత్మ ఉంది. ఆ సుజాతే నీ భార్య గత జన్మలో అని వాసు తో అన్నది. గత జన్మలో నువ్వు నీ భార్య ను బాగా ప్రేమిస్తూ, ఆకస్మికంగా చనిపోయావు అని చెప్పింది. కొంచెం సేపటి క్రితమే సుజాత ను కలవడానికి వెళ్లి నప్పుడు, రోడ్డు ప్రమాదం లో చనిపోయి నీవు ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, మళ్లీ నీ ఆత్మ  జన్మిస్తుంది. నీ భార్య  ఆత్మ సుజాత ను వీడి మరొక శరీరం లో ప్రవేశిస్తుంది. అని ఆ తల్లి వాసుకి చెప్పింది.

****************

అప్పుడు సమయం తెల్లవారుజామున 3:15 నిమిషాలు, 28 ఆగష్టు 2021. ఇదంతా నిద్రలో జరిగింది. ఒళ్లంతా అచేతనం, చెమటలు, గుండెల్లో భారం, స్పృహ లో కి వచ్చిన పది నిమిషాల వరకు శరీరం ఆధీనం లోకి రాలేదు.

అప్పుడు తెలిసింది నా ఆత్మ వెళ్లి, చూసింది, అనుభవించింది అంతా ఆత్మలో లోకానికి. ఆ తల్లి, పిల్ల గా కనపడి మాట్లాడిన వారు కూడా ఆత్మలే అని అర్థం అయింది. ఈ శరీరం , భూలోకం అనేది ఎంత నిజమో ఆత్మ అత్మలోకం అనేది కూడా అంతే నిజం. ఇది అనుభవించిన వారికే తెలుస్తుంది. కాని చాలా మంది ఇదంతా ఒక మానసిక రోగం అనో లేదా Psychic Disorder అనో చెపుతుంటారు. అందరికి బాహ్య దృష్టి ఉంటుంది, బాహ్య ప్రపంచం కనిపిస్తుంది.   కానీ కొంతమంది కి మాత్రమే బాహ్య దృష్టి తో పాటు,  అంతర్గత దృష్టి ఉంటుంది వారికి మాత్రమే ఊర్ధ్వ లోకాం,  అధోః లోకం కూడా చూడగలరు. ఇది కేవలం శివుని భిక్ష ద్వారా సాధ్యం అవుతుంది.

*************

వెను వెంటనే అదే సమయంలో కలలో జరిగిన చూసిన ఈ విషయం అంతా పుస్తకం లో రాసుకున్నాను.

ఈశ్వర సాక్షి గా ఇదంతా నా స్వీయ అనుభవం.

ఇదంతా నిజమే నా, అని ఆలోచిస్తే చాలా సంవత్సరాలు టీచర్ గా పనిచేయడం,  అసలు సాహిత్యం గాని , రాయడం గాని తెలియని వ్యక్తి ని , గత రెండు సంవత్సరాలుగా కధలు, ప్రేమ, ఆధ్యాత్మిక , సామాజిక అంశాలు,  కవితలు, రచనలు కలిపి వంద పైగా  సునాయాసంగా రాయడం లో మర్మం ఆ ఈశ్వరుని కే తెలియాలి.



యడ్ల శ్రీనివాసరావు 13 Nov 2021 5:00 am.


106. ఎందుకు ఉన్నానో

 

ఎందుకు ఉన్నానో


• మైనమవుతున్నదే

  మనసు మైనమవుతున్నది.

• నీ చేతిలో సున్నితమైన బొమ్మ

  కావాలని నా మనసు మైనమవుతున్నది


• కరిగి పోతున్నానే

   హిమము లా కరిగి పోతున్నాను

• నీ పాదముల చెంత చేరాలని

   నీటి నై కరిగి పోతున్నానే.


• ఆకాశంలో అందమైన మేఘాలే

   కారుమబ్బులై  కలవరపెడుతున్నాయి.

• ఎందుకో ఏమిటో తెలియదు  

   ఆశల స్వర్గమంతా 

   నిరాశ తో నరకం అవుతున్నది

• ఔనన్నా కాదన్నా 

  తెలుస్తొంది తెలుస్తోంది

  నీ కంటి జారే నీరు

 నా ఊపిరిని బంధిస్తుంది.


నేను లేని నిన్ను తో జీవించగలను

  కాని నువ్వు లేని నేను జీవం తో ఉండలేను.


• ఇవి అక్షరాలు కావే

  మనిషి మాటలు కావే

  మనసు వేదన.

• ఉండలేక ఉన్నాను

  నిను చూడలేక ఉన్నాను

  నీ తోడు లేక ఉన్నాను

  ఎందుకు ఉన్నానో   తెలియకనే ఉన్నాను

  ఎందుకో  మరి ఎందుకో  తెలియదే.


• నిజము కాని నిజము లో  

  ఊయల ఊగలేకున్నానే.


యడ్ల శ్రీనివాసరావు 12 Nov 2021 3:00 pm.







Thursday, November 11, 2021

105. మదిని మెండుగా గాంచు మల్లన్న

 

మదిని మెండుగా గాంచు మల్లన్న


• కరుణజూపగ రావ కొండ మల్లయ్యా

  జ్ఞాన జ్యోతి తో తెరిపించు 

  మా కనులు కార్తీక మాసాన.


• మెండుగా దీవించు మమ్ము  మూడు కన్నులయ్య 

  పండునే మా బ్రతుకు నిండు పౌర్ణమిన.


• నిశీధి వేళల నిర్మల నిరంజనా

  తెలియక పుట్టిన వారము 

  అజ్జాన  అంధకారంతో.


• నిత్యమూ సత్యమై నా మదిన నింపు

  కొత్తగా నేర్చిన మెత్తని నీ భజన శివా.


• ఏమిచ్చినా నీ భిక్ష

   అదే మాకు రక్ష.


• ఓం నమః శివాయః

  శివాయః నమః ఓం.


• కనులు మూసిన మాకు

  నీ మేని తేజము తో జగత్ సూక్ష్మముు గా   

  కనుల విందు చేయచు

  కనులు తెరిచిన వెంటనే ఎందుకయ్యా 

  ఈ అశ్రునయనాల దుఃఖారవిందం.


• ఓ నిర్మల వాసి   నిత్య ధ్యాని 

  పాలకడలి వంటి ఈ సృష్టి  

  స్థితి తప్పిన నాడు 

  నీ ఢమరుక భేరి తో లయం చేస్తుంటే

  ఆత్మల ఆర్తనాదాలే అంతులేని శోకాలు.


• పులి పాలు బంగారు పాత్రన 

  పోసినా దివ్యమగునట్లు

  మా బుద్ది పాలను 

  నీ జ్ఞాన పాత్ర న గాంచవయా.


• ద్వాపర కలియుగాన 

  వికర్మదారులమైన మాకు 

  సకర్మల జ్ఞానము నిచ్చి 

  త్రేతా యుగము నుండే 

  దేవతగణములను గాంచి

  అకర్మతో   ఆత్మను  పరంధామమున్న

  సత్యయుగమునకు గైకొను ఈశ్వరా..


యడ్ల శ్రీనివాసరావు  11 Nov 2021 5:00 am 





Wednesday, November 10, 2021

104. ఏమని చెప్పను

 

ఏమని చెప్పను

• ఏమని చెప్పను

  ఏముందని చెప్పను

  ఎలా చెప్పను.


• ఏమీ లేని దానికి

  ఏదో ఉందనే భ్రమలో ఇన్నాళ్లు 

  ఉన్నానని చెప్పానా.


• నా లో ని ఆలోచనలే 

  నాకు భ్రమ కలిగిస్తున్నాయని చెప్పనా.


• నీ అంతరార్థం 

  అర్థం కావడం లేదని చెప్పనా.


• ఆకాశానికి నిచ్చెన వేసే 

 ఆశాజీవిని అవుతున్నానని చెప్పనా.


• ఏమని చెప్పను.

• నా అనాలోచనకు 

  హద్దే లేకుంటుదని చెప్పనా.


• నేనోక ప్రత్యేకం 

  అందుకే నేనోక విపరీతం 

  అని చెప్పనా.


• అనుక్షణం నిను అర్థం చేసుకోవడం లో 

  నాకు నేను అర్థం కావడం లేదని చెప్పనా.


• నిజమే   

  ఏమని చెప్పను

  ఏమున్నదని చెప్పను.


• ఏమీ లేదనుకుంటే

  ఉన్నదంతా ఊహే అని చెప్పనా.


• నేను మనిషి నే

  అందరి లాంటి మనిషి నే

  కానీ భావోద్వేగాల బలహీనతల మనిషిని

  వాటి తోనే నా జీవితమని చెప్పనా.


• అయినా  ఇంకా ఇంకా చెప్పడానికి 

  నా మనసు లో ఇంకేం మిగిలిందని చెప్పను.


• చివరిగా ఒకటే చెప్పగలను

  నువ్వే నా సర్వస్వం అని

  ఇంతకన్నా చెప్పడానికి 

  నాకు ఆకారమే లేదని చెప్పగలను.


యడ్ల శ్రీనివాసరావు   10 Nov 2021 6:00 pm.






Monday, November 8, 2021

103. ఒకటి పైన ఒకటి…..ఒకటే

 

ఒకటి పైన ఒకటి…..ఒకటే


• “ఒక” లాంటి వారమే

   ”ఒకే” లాంటి వారమే


• ఒకటి ప్రక్కన ఒకటి ఉంటే 

  అది ఒకటి కాదు.

• ఒకటి పైన ఒకటి ఉంటే 

  ఎప్పటికి ఒకటే కదా.


• ఒకరి ప్రక్కన ఒకరుంటే 

  ఒకటి కాము.

• ఒకరి పైన ఒకరుంటేనే 

   ఒకటవుతాము.


• స్థిరమైన మనసుకు 

  సుస్థిరమైన మనిషి కలయిక 

  ఎన్నటికీ అస్థిరం కాదులే.


నాకున్నది ఏనాడూ నాదనుకోలేదు

 ”నాదనుకున్న నన్ను” 

  నిన్ను నాదే అనుకుంటున్నా.


• వెలుగు నిచ్చి కరుగుతున్న 

  మన జీవీతాలకు కూడా ఎద లోతుల్లో ని 

  చీకటి నశించే సమయం ఆసన్నమైనది.


• కాలం ఎంతుందో

  జీవనం ఎంతుందో తెలియదు కానీ 

  ఇకపై జీవన కాలమంతా మనదే.


యడ్ల శ్రీనివాసరావు 9 Nov 2021 11:00 am.






102. మాటిస్తున్నానే

 

మాటిస్తున్నానే


• మదిలో మల్లెపూవా 

  మనసే మీటి పోవా.


• సిగలో జాజి పూవా 

   వలపే విచ్చి పోవా.


• కలలో కలువ పూవా 

  ఇలలో ఇంపు నివ్వా.


• పదనిసల పూవులే 

  సరిగమల రాగమవుతుంటే.


• పూవు లోని పరిమళం 

  నా పాటలోని పల్లవై

  నీ సొగసుకు సొంపు అవుతుంటే

  నా మనసుకు ఇంకేం కావాలే.


• చెలి…..ఓ చెలి

  చంచలమై   అలుపెరిగిన  అలజడి తో 

  ఊగిసలాడకే ఊరికే.


• ఉదయించే సూర్యుడిలా 

  మందారమంటి వెలుగు నీకిస్తా.


• సతమతం తో మన సంగమాన్ని 

  అలలు కానివ్వకే ఓ కల్పవల్లి.


• మాటిస్తున్నానే

  మరణం వరకు తోడవుతా, 

  తనువు నొదిలిన కాని

  మాటనొదలనే  మాటిస్తున్నానే.


• మనసు లో ని మౌనం తో 

  మరువ లేని మాటలనే 

  సంథిస్తావే మౌన తరంగిణి.


• ఆనంద నందిని నీ గలగల నవ్వులకు 

  నడయాడెనే నా మనసు లో ని తేజం 

  పదముల వారధిగా  

  మన ప్రేమ కు పారిజాతముగా.


• నీ లోని ప్రేమే

 నా లోని జీవానికి సంజీవని గా 

 తలచి చిరంజీవి నవుతానే


• మన మనసులేకం చేసిన 

  మృత్యుంజయుని పాదపద్మములకు 

  ఆత్మ ప్రణామములు.


యడ్ల శ్రీనివాసరావు 8 Nov 21, 8:35 pm.





Saturday, November 6, 2021

101. ఎవరివి

 

                                ఎవరివి

• ఎవరివి…నీవెవరివి

• బుల్లి బుల్లి బుజ్జాయి వా

  చిట్టి పొట్టి పొన్నారివా.


• లేడి కళ్ల లేపాక్షివా

  సన్నజాజి సింగారివా.


• పరువాల పాలపిట్ట వా

  తీగ నడుము *తంగేడు వా


• మిల మిల లాడే *మీనానివా

  రుస రుస లాడే కందిరీగ వా.


• మనసు నెరిగిన మహారాణి వా

  దారి చూపిన దేవత వా.


• ఎవరివి ... నీవెవరివి


• బుల్లి బుల్లి బుజ్జాయి వయితే 

 జాబిల్లి నై బుల్లి బుల్లి గోరు ముద్దలే తినిపిస్తా.


• చిట్టి పొట్టి చిన్నారి వయితే 

 చేతనెత్తుకుని చందమామ నే చూపిస్తా.


• లేడి కళ్ల లేపాక్షి వయితే 

  లేత లేత చలిగాలుల్లో ఆటపాటలే ఆడిస్తా.


• సన్నజాజి సింగారి వయితే 

 తీయనైన తేనెటీగలా అల్లుకు పోతా.


• పరువాల పాలపిట్ట వయితే 

  పదనిసల పాటలతో ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటా.


• తీగ నడుము *తంగేడు వయితే 

  చిరకాలం చిరంజీవి గా నీతోనే ఉండి పోతా.


• మిల మిల లాడే *మీనాని వయితే 

  దాగుడు మూతల సరసాలే ఆడుతూ ఉంటా.


• రుస రుస లాడే కందిరీగ వయితే 

  చిన్నిబాబు నై రెండు చేతులు కట్టుకుంటా.


• మనసు నెరిగిన మహారాణి వయితే 

  రాజ మహలు నే కట్టి ఉంచుతా.


• దారి చూపిన దేవత వయితే 

  నీ పాద సేవయే చేసుకుంటా.


• ఇంతకీ ఎవరివో

  నీ వెవరివో

  ఈ జన్మకు తెలిసేనా….


యడ్ల శ్రీనివాసరావు , 6 Nov 21, 6:00 am.


*తంగేడు = ప్రకాశవంతమైన పసుపు రంగు పువ్వు. దీర్ఘాయుష్షు నిచ్చే ఔషధ పువ్వు. ఎన్నో రకాల రోగాలకు ఔషధం గా ఉపయోగిస్తారు.

*మీనం = చేప పిల్ల.


Friday, November 5, 2021

100. రుద్ర అక్షిత

 రుద్ర  అక్షిత

• ఈశ్వరా పరమేశ్వరా

  ఏమిటయ్యా ఈ చిత్రం

  ఎందుకయ్యా ఈ విచిత్రం.


• గమ్యమెరుగని పాదచారి కి

  అలసి సొలసి న బాటసారి కి 

*భవితమేమిటో చూపిస్తున్నావయా.


• కలలు *కల్లలైన బాల్యానికి 

  నడి యవ్వనాన  బాల్యం కలపిస్తున్నావయా.


• జ్ఞానమెరుగని ఈ క్షీణ జీవి పై

  కరుణ చూపి కమలం చేస్తున్నావయా.


• ఏమి ఈ చిత్రం

  ఎందుకో ఈ విచిత్రం 

  ఈశ్వరా పరమేశ్వరా.


• మూగబోయిన మాటకు 

  మూలనిధినే స్వరము గా చేసావయా


• కదలలేని కరములకు  “కధ”లనిచ్చి  

*కదం  తొక్కిన కవి గా   కాంచావయా.


• నీ మననం తో    మనోనేత్రం లో

*ఆరుద్ర గా  చేసి  ఆత్మ చరితం  చేసావయా.


• ఏమివ్వగలను నీకు

  ఏమి చేయగలను నీకు

  నీ కీర్తనతో సంకీర్తన తప్ప.


• జన్మమెరుగని వానికి 

  పూర్వజన్మ శేషం కరిగిస్తున్నావయా‌


• నీ పాద ధూళి నై,  నిను తాకాలని ఉంది 

  ఈశ్వరా…పరమేశ్వరా…


యడ్ల శ్రీనివాసరావు 4 Nov 21 10:00 pm


*భవితము = Destiny, విధి, తలరాత, అదృష్టం

*కల్లలైన = నాశనమైన, పాడైన

*ఆరుద్ర = శివుని కంటనీరు తో తడుస్తూ ప్రకాశించే నక్షత్రం

 *కదం= గుర్రం పరుగు


Wednesday, November 3, 2021

99. వెలుగు నీడలు


వెలుగు నీడలు


• నీ పై కలిగే ఆశ కనులకు వెలుగవుతుంటే

  కన్నీరు నిరాశై చీకటనిస్తుంది.

  చీకటి లో కూడా నీ నీడ స్పష్టమవుతుంటే 

   ఆశ నిరాశ లతో నా కేమి.


• నీ ముత్యాల పలుకులు 

  నా ముంగిట లేకపోయిన ఏమీ

  నీ మురిపాల *హసములు నిత్యం 

  ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి.


• నీ రతనాల రూపం 

  నా కంటికి కానకున్న ఏమీ

  నీ *రమణీయం నిరంతరం రంగుల రాట్నం లా

  నా చుట్టూ తిరుగుతూనే ఉంది.


• నీ చెక్కిలి చామంతులు 

 నను పిలవకున్న నేమీ

 నీ మధురం మకరందమై 

 నా కు అధరామృతం అవుతూనే ఉంది.


• నీ అరచేతిలో నా చేయి లేకున్న నేమీ

  నా నుదుటిరాతలో నీవొక రేఖ వని 

  తెలుస్తూనే ఉంది.


• ఈ జన్మకు తోడు కాకపోతే నేమి

  గత జన్మలోని నీడ వని తెలుస్తూనే ఉంది.


• నా ఊహే నా మనసు కు వరమవుతుంటే

 నా మాటే నా కవితకు పదమవుతుంటే

  అనంత కోటి తారల్లో నేను ఏడ ఉంటే నేమి 

  ఏమి చేస్తే నేమి

  నా ఆత్మలో అంతరాత్మవి నీ వే కదా.


• నీ ప్రేమ లోని వెలుగే

  నా మనసు లో ని ప్రకాశం. 

  అదియే నీ నీడ లేని,  నా జీవితానికి 

  జన్మ జన్మల దీపావళి వెలుగు.



యడ్ల శ్రీనివాసరావు 3 Nov 11:00 pm 9293926810.

*హసములు = నవ్వులు

*రమణీయం = మనోహరం, సుందరం


Monday, November 1, 2021

98. ప్రేమ సామ్రాజ్యం


                              ప్రేమ సామ్రాజ్యం

• కిల కిల లాడే అటు ఇటు ఊగే 

  పూవుని అడిగితే

  తన సంతోషానికి కారణం 

  నీ కురులలో స్థానం అంటుంటే ...


• ఏమై పోవాలి

  నేనేమై పోవాలి  ... నేను ఏమవ్వాలి.


• రెప రెప లాడుతూ రివ్వుమంటున్న 

  గాలి ని అడిగితే

  తన ఉత్సాహనికి కారణం 

  నీ ముంగురులు తాకినందుకు అంటుంటే ...


• ఏమై పోవాలి

  నేనేమై పోవాలి ...  నేను ఏమవ్వాలి.


• జర జర జారే వొంపుల సొంపుల 

  సెలయేరు ని అడిగితే 

  తన కేరింతలకు కారణం 

  నీ పాదముల స్పర్శ అంటుంటే ...


• ఏమై పోవాలి….

  నేనేమై పోవాలి   …  నేను ఏమవ్వాలి.


• గలగలలాడే *గమపద 

  కాలి గజ్జెలని అడిగితే

  తన సవ్వడి కి కారణం 

  నీ నెమలి నాట్యమే  అంటుంటే …


• ఏమై పోవాలి

  నేనేమై పోవాలి   …  నేను ఏమవ్వాలి.


• తహతహలాడే తలపు వలపుల 

  మనసు ని అడిగితే

  తన పులకరింతకు కారణం 

  నీ మనసు లో ఉన్న నేనే అంటుంటే  …


• ఏమై పోవాలి

  నేనేమై పోవాలి  ...  నేను ఏమవ్వాలి.


• పూవునై   గాలిలొ ఎగిరి   

  సెలయేరు లో పడి  

  నీ మనసు కు గజ్జె  నై 

  అల్లుకు పోవాలని ఉంది.


🥀🥀🥀🥀🥀


• నీ తో ఆడిన ఆటలే ఆనందాలవుతుంటే 

  అంతు చిక్కని *నందనాలకు 

  ఎదురు చూస్తున్న   ఓ *ప్రణయని.


• నా లోని ప్రతిభ

  నీ లోని *బింబం 

  కలిసిన ప్రతిబింబమే 

  మన జీవన బింబం   ...  ఓ *చంద్రహాసిని.


• నీ అడుగు లోని నా అడుగు లే 

  పయనించే మన జీవన *మడుగు అవుతుంటే

  ఆకాశమంతా జీవితం కావాలనిపిస్తోంది

  ఓ *వరూధిని.


యడ్ల శ్రీనివాసరావు 31 Oct 10:00 pm 8985786810.

• గమపద= ఒయ్యారమైన నడక.

• నందన = అధిక సంతోషాలు.

• బింబం = రూపం, వెలుగు.

• ప్రణయని= వివాహం చేసుకొనే ప్రేయసి.

• చంద్రహాసిని= చంద్రుని రూపము వంటి స్త్రీ.

• మడుగు = జలాశయం, శుద్ధి యైన గుణము.

• వరూధిని = గంధర్వ స్త్రీ.


Friday, October 29, 2021

97. మరణ శాసనం _ జననం జీవనం

 మరణ శాసనం _ జననం జీవనం


• మానవ జన్మ ఎత్తిన ప్రతి మనిషి కోరుకునేది ఒక్కటే సుఖం, సంతోషం, ఆనందం. వీటిని సంపాదించుకోవడానికి పరిగెత్తే ఆరాటం లో పడేది, కష్టం, బాధ, దుఃఖం. అంటే వీటిలో ఏ ఒక్కటి కావాలన్నా తప్పనిసరిగా రెండవది అనుభవించాలి. కానీ మానవుని మనసు అది అంగీకరించదు .

• మనిషి అంత అమాయక జీవి ఈ సృష్టిలో ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే పుట్టిన దగ్గరనుంచి తనకు అవసరమయినది, కావలసిన దానికంటే అనవసరమయిన దాని కోసమే అతిగా పరితపిస్తూ ఉంటాడు.

• ఇది మనం ఏవిధంగా అనుకోవచ్చు అంటే , మనిషి తన జీవితంలో చివరి వరకు ఏ దశలో ను కూడా తన సంతృప్తి ని మనస్పూర్తిగా వ్యక్తపరచడు, అంగీకరించడు. ఒకవేళ పొరపాటున సంతృప్తి ని వ్యక్తపరిస్తే, తన పురోగతి ఆగిపోతుందేమో అని భయం. అంటే ఏ దశలో ను కూడా సహజం సిద్ధం గా అనుభవించాల్సిన, ప్రకృతి ప్రసాదించిన వనరులను గాని, జీవన విధానం తో కూడిన అనుభూతులను గాని ఆస్వాదించలేక ఏది సంతృప్తో, ఏది అసంతృప్తో తేడా గ్రహించలేక పుణ్యకాలం అంతా గడిచిపోతుంది.

• మనిషి జీవితానికి మంచి మందు ఏమిటంటే రాజీ (compromise) పడిపోవడం. ఇక్కడ రాజీ పడడం అంటే పోరాట పటిమను వదులు కోమని కాదు ఉద్దేశం. రాజీ అనేది ఓటమి కి, గెలుపు కి మధ్యలో సమాంతరంగా ఉన్న బిందు స్థానం. ఈ బిందు స్థానం లో మనసు ను నిలిపితే ఓర్పు , సహనం తో నిర్దిష్టమైన ప్రణాళిక ప్రకారం జీవించడానికి, లేదా ఏదైనా కార్యాచరణ చేయడం ఎలాగో తెలుస్తుంది.

• ఎందుకంటే ఆధునిక కాలంలో పరుగులు పెడుతున్న జీవన విధానం తో , అసలు ఏది ఎందుకు చేస్తున్నామో, ఏది అవసరమో , ఏది అనవసరమో కూడా తెలియని విచిత్రమైన అయెమయ స్థితి లో ఉంటున్నాం. దీనికి మూల కారణం ఒకటి మన ఆలోచనా రాహిత్యం అంటే మన మానసిక శక్తి యొక్క సామర్థ్యాన్ని మనం గ్రహించలేక పోవడం. మరొకటి మన చుట్టూ ఉన్న సమాజం, మనుషుల ప్రభావం మనల్ని శాసించడం. అవునన్నా, కాదన్నా ఇటువంటి స్థితి లో నే నేటి ఆధునిక మనిషి జీవితం గడుపుతున్నాడు.

• అసలు ఈ సృష్టిలో ఏ జీవికి లేని ఈ విపరీతమైన సమస్య మనిషి కి ఎందుకు అంటే, కాలం కంటే కూడా ముందు గా పరిగెత్తాల నే మనిషి అత్యాశే కారణం. ఆఖరికి ఈ అత్యాశ విలువైన జీవన కాలాన్ని తగ్గిస్తుంది. వృద్ధి అనేది సృష్టిలో ప్రకృతి ప్రసాదించిన సహజ సిద్ధమైన వరం. కాని మనిషి అభివృద్ధి అనే ముసుగులో సరియైన పోషక ఆహారం తినలేక, సాంకేతిక అనే ముసుగులో వినాశనం తెచ్చుకొని, వ్యాపార పోటీ అనే విపరీతమైన తత్వం తో ఔషధాలు, హాస్పిటల్స్, విద్యాలయాలు ఒకటేమిటి అన్నీ కలిసి కలిసి కలిసి మనిషిని సమస్యల వలయంలో కూర్చో పెడుతున్నాయి. అశాంతి -దుఃఖం, నిరాశ-నిస్పృహ, రోగాలు-ఒత్తిడి తో చివరికి తన ఉనికిని కోల్పోయి, సంతోషంగా, ఆనందం గా నలుగురితో ప్రేమ గా బ్రతకలేక ఢీ లా పడిపోతున్నాడు.

• ఇదివరకు కాలం లో ఒక కధ చదివితే అందులోని నీతి మనసు లో నిక్షిప్తమై , ప్రతీ ఒక్కరూ ఆచరణలో పెట్టే వారు. ఇది బాల్యదశ నుంచే గృహంలో, విద్యాలయాల్లో తప్పనిసరిగా ఉండేది. ఇది సమాజానికి, మనిషి శ్రేయస్సుకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ నేడు ఆ పరిస్థితి ఉందా అంటే….. లేదు అనేదే సమాధానం. మరి ఇది కాదా మనిషి తన మరణానికి కావలసిన శాసనాన్ని తనే రాసుకుంటున్నాడు అనడానికి.

• నేటి ఆధునిక మనిషి మానసిక దృఢత్వం కోల్పోయి మేడిపండు లా జీవిస్తుంటే, భవిష్యత్త్ తరాలకు ఏమి చెప్పగలడు.


యడ్ల శ్రీనివాసరావు 29 Oct 21 10:00 pm 8985786810


96. కలల జాగృతం

 కలల జాగృతం



• కలలకు ప్రాణం పోసే కలమా, కన్నులకు వరమా.

• ఊయలలో ఊగే ఊహలన్నీ, కలము దాటి కవిత లవుతున్న వేళలో….

• కాగితమున చేరిన కవితలన్నీ, కలలు దాటి కన్నుల పండుగ అవుతున్న వేళలో…

• ఏమనుకోవాలి….నేనేమనుకోవాలి….. కలలు నా కోసమే పుట్టాయనుకున్నాను….

• కలయే నా ఇల అనుకుంటే….ఇల మాత్రం కలవరమవుతుంది.

• కరుగుతున్న కాలం లో కలలు జీవంగా కనిపిస్తుంటే….. అనిపిస్తుంటే..

• ఇది కేవలం కల మాత్రమే , సజీవం కాదు కదా…. అనిపిస్తుంది

• కలలోని జీవం  సజీవం కానపుడు ……ఊహలతో ఊయల ఊగడం ఎందుకు.

• ఏది ఎందుకు జరుగుతుందో తెలియదు….జరిగే ప్రతి దానికి అర్ధం ఉంటుందో లేదో తెలియదు.

• అందమైన మేఘాన్ని చూసి ఆనందపడాలే కానీ , స్పర్శిస్తే శూన్యమే.

• వర్ణించ లేని భావాలు కూడా సృష్టిలో ఉన్నాయనిపిస్తుంది…వాటికి అనుభవమే తప్ప , వర్ణన ఉండదు….. అనుభవానికి కూడా ఒక అదృష్టం ఉండాలేమో.

• ప్రతి బాధకు ఒక అర్థం ఉంటుంది…. కానీ అర్థం లేని బాధలు అనుభవిస్తే నే తెలుస్తాయి…..బాధ అర్థమా వ్యర్థమా అనేది.

• ఆశ నిరాశ నిరంతరం కలిసే ఉంటాయి. ఆశకు నీడ నిరాశ…. ఇకనైనా తెలుసుకో.

• మేలుకో మేలుకో ఇకనైనా మేలుకో …నీ పయనం ఎ టో తెలుసుకో…. జరిగినదంతా జాగృతం…..

• ప్రకృతిని చూసి ఆనందించు కానీ ఆస్వాదించాలనుకోకు, ఎందుకంటే నీ ఆకృతి ప్రకృతికి ఒక వికృతి.


యడ్ల శ్రీనివాసరావు 29 Oct 4:00 am 8985786810


Thursday, October 28, 2021

95. మా బడి సజీవం

 మా బడి సజీవం




ఒకప్పుడు ఆ దారి లో వస్తూ, పోతూ ఉంటే తెలియని సంతోషం, ధైర్యం ఉండేవి , ఎందుకంటే ఆ దారి లోని మా బడి ఎన్నో బాల్య జ్ఞాపకాలను ఇస్తూ ఉండేది. కాని నేడు…. మా బడి ఇక కనిపించదు అంటుంటే….

• లేదు లేదు ఇకలేదు ….మా జీవన జాగృతి కి చిహ్నమైన …మా బడి ఇక లేదు.

• లేదు లేదు ఇకలేదు….మా జన్మ జ్ఞాన జీవనానికి మూలాధారమైన….. మా బడి ఇక లేదు.

• లేదు లేదు మా జీవనధార కి రహదారైన ఆనవాలు…..మా బడి ఇక లేదు.

• లేకపోతే నేమి…..లేకపోతే ఏమి….

• బడి…ఓ బడి…నీ స్థానం ప్రస్థానం….నీ చరితం సుచరితం….నీ నామం దేదీప్యమానం……నీ వైభోగం వైకుంఠం…..నీ కథ కైలాసం….

• నీ ఒడి లో పెరిగిన మాకు…..నీ దడి లో నడిచిన మాకు….. నీ వడి తో నడవడి నేర్పిన మాకు …. జడి లేని, తడి లేని జీవన నాడి వైన….. మా బడి నీకు ప్రణామం.

• బడి , ఓ బడి….ఏమని చెప్పాలి…ఏమని అనాలి…నీ రూపం నిర్మలం, నీ మనసు మందిరం, నీ శిక్షణ సుందరం, నీ ప్రేమం పరమం, నీ దీవెన దివ్యం…

• విలువల వలువలతో బహుముఖ ప్రజ్ఞాశాలురైన గురు వైడుర్యాల నిధి మా బడి.

• బడి…ఓ బడి….నీ ఆదర్శాలు ఆచరించిన ఎందరికో ఆలంబనవై, ఎందరో ఆకారాలకు సాకారమై, అందరి వికారాలను రూపుమాపి , ఆకృతి నిచ్చిన స్వర్గధామ మైన నీకు పాదాభివందనం.

• సంతోషానికి సన్నిధివి…. జ్ఞానానికి పెన్నిధివి….స్నేహలకు స్వర్ణ దుందుభివి.

• బడి…ఓ బడి…..నీ చెంత చేరిన ఎన్నో, గడ్డిపరకలకు గలగలలు నేర్పి……. ఎన్నో రాళ్లను రమణీయం చేసి….. మరెన్నో కందిరీగలను సీతాకోకచిలుక లుగా చేసి……ఎన్నో కంచు పాత్రలను కనకముగా మార్చి……తల్లడిల్లే తల్లి వయ్యావు. నీ అక్కున చేరిన మేము ధన్యజీవులం.

• బడి…ఓ బడి….తల్లి తండ్రుల తో సరాసరి మా బాధ్యత మోసిన బంగారానివి…….తల్లి తండ్రులను మరచిన వారి జన్మ నికృష్టం…..నిన్ను మరచిన వారి జీవనం అస్పష్టం.

• బడి…ఓ బడి….. మనిషి కి మనిషి కి మధ్యలోని తెర అహంకారమైతే……. మనసు కి మనిషి కి మధ్యలోని తెర ఆత్మయే కదా…..ఇది నీవు చెప్పిన మాట యే కాదా…...నేటి రోజున నీ నుండి వచ్చిన మా ప్రతి ఒక్కరి అంతరాత్మలకు తెలుసు, ప్రస్తుత మా నడవడిక, మా మానసిక స్థితి సుగమనమా , అథోఃగమనమా లేక తిరోగమనమా…...అదియే ప్రస్తుత మా జీవన శైలి.

యడ్ల శ్రీనివాసరావు 27 Oct 10:00 pm 8985786810

జాగృతి = మెలకువ

దడి = చుట్టూ రక్షణగా అల్లుకున్నది

వడి = కాలంతో

జడి = దుఃఖం

తడి = చెమ్మ

ప్రస్థానం = విజయానికి మూలమైన ప్రదేశం, యాత్ర

ఆలంబన= పట్టుగొమ్మ

స్వర్ణ దుందుభి = విశేషమైన బంగారు వాయిద్యం


Thursday, October 14, 2021

94. కుసుమం

 కుసుమం

• నీ నవ్వు లో ని రాగం *నవనీత యోగం.

• నీ చూపు లో ని ప్రేమం *కారుణ్య మోహం.

• నీ మాట లో ని మధురం జనరంజక *తానం.

• నీ మోము లో ని నిర్మలం వెన్నెల నిలయం.

• నీ ముక్కెర లో ని అందం చిలిపి *చందం.

• నీ చెవుల లో ని *శ్రవణం కలువ పూల *నందం

• నీ గొంతు లో ని *శ్రావ్యం తరంగాల *శ్రీ రాగం

• నీ చేతి తో ని *కార్యం ప్రగతి కి సోపానం.

• నీ మనసు లో ని శాంతం చందమామ తేజం.

• నీ మేని లో ని ఛాయ స్పర్శమణి ప్రభవం.

• నీ నడక లో ని హొయలు ప్రకృతి *పాటవం.

• నీ రూపు లోని బింబం అజంతా శిల్పం.


YSR 14 Oct 21 3:00 pm

నవనీత యోగం = వెన్న లాంటి రాజసం

కారుణ్య మోహం = కరుణ తో నిండిన ఇష్టం.

తానం = అభిషేకము

చందం = రూపం

శ్రవణం = వింటూ ఉండుట

నందం = అభినందనము

శ్రావ్యం = తీయనైన

శ్రీ రాగం = శంకరాభరణం

కార్యం = పని చేయుట

స్పర్శమణి ప్రభవం = స్వర్ణం, బంగారు మెరుపు.

పాటవం = నైపుణ్యం.


Wednesday, October 13, 2021

93. మనసు నీడలు


   మనసు నీడలు

• మనసా ఏల దాగుంటివే……..కనులకు నీ వు కనపడవు కానీ , కలలకు మాత్రం *కాణాచివి.

• మనసా దోబూచులాడకే………వయసుకు నీ వు *వన్నె వే అయినా , *వలపు కు మాత్రం విరజాజి వి.


• మనసా సిగ్గు పడకే…. పూల లోని మకరందం
*పుప్పొడి యై మన్మధుడు మదనమయ్యెను.

• మనసా కవ్వించకే………కళకళలాడే *కిన్నెర లో కూడా సింగారి సిగ్గులు సిగురిస్తున్నాయి.


• మనసా తుళ్ళి పడకే…...తుమ్మెద లాంటి పరువం తో ఉక్కిరిబిక్కిరి యై విహరిస్తావు.

• మనసా నిరీక్షించకే…...ప్రేయసి పిలుపు కై ఎదురు చూసిన క్షణాలన్ని యుగాలు గా అనిపిస్తున్నాయి.


• మనసా భాధించకే……..ప్రేయసి మౌనం ప్రేమ కు భారమై ప్రాణం పరితపిస్తుంది.

• మనసా ఆశపడకే…... జీవం ఉన్న ప్రేమ , జీవితం కాకపోతే, నిరాశ తో “చెలి” మి చేస్తావు.



కాణాచి = నెలవు, చిరకాల స్థానం.
వన్నే = తేజస్సు, అందం
వలపు = కోరిక
కిన్నెర = శృంగార కుసుమం
పుప్పొడి = ధూళి

YSR 13 Oct 21 , 6 00 am

Thursday, October 7, 2021

92. తొలిప్రేమ

 

                    తొలిప్రేమ 


• ఆకాశం వర్షించే….ఆలాపన హర్షించే.

• ఎదలోతులు వికసించే…ప్రేమేమో చిగురించే.

• ఇది యే సంతమో… ఇది యే వసంతమో.

• ఆకాశం వర్షించే…ఆలాపన హర్షించే.


• నా తొలిప్రేమ కి తొలకరి

 స్వాగతమవుతుంటే

 పచ్చని పైరులన్ని 

 చిరు తోరణాలయ్యాయి.


• ఇది యే సంతమో

 ఇది యే వసంతమో.

• మేఘాలే దీవించే 

  మనసంతా మురిపించే

• చిరు జల్లులే   చిరు చిరు చిరుజల్లు లై

 తలంబ్రాలైన వేళ మన చెట్టాపట్టాలేే

 తాంబూలాలైయ్యొను.


• ఆకాశం వర్షించే

  ఆలాపన హర్షించే

• ఎదలోతులు వికసించే

  ప్రేమేమో చిగురించే.


• చెలి...ఓ చెలి…..నా చెలి.

• నీ తో ని నా క్షణాలే 

  మన పరిణయానికి పునాదులై.

• నీ సన్నిధే మన బంధానికి పెన్నిధయ్యెను.

• ఆకాశం వర్షించే

  ఆలాపన హర్షించే

• నీ మాటల మంత్రాలతో 

  మన పలుకులే పల్లకి యై విహరిస్తుంటే.

• ఆకాశం వర్షించే

  ఆలాపన హర్షించే.


• ఈ ప్రకృతి పరవశం లో 

  గోదావరి పులకరిస్తుంటే

• ఆకాశం వర్షించే  

  ఆలాపన హర్షించే

• సాయంత్రం కరుణించే 

  మన పయనాన్ని సాగించే

• నిశి రాతిరి దీవించే 

  ప్రేమేమో పరితపించే

• వెన్నెల సాక్షిగా

  మన కన్నుల సాక్షిగా.(2)


• చెలి…ఓ చెలి…నా చెలి

• ఇది యే సంతమో  

  ఇది యే వసంతమో

• మనసు మకరందమై  

  మధువు కావాలని,  

  నా ప్రేయసి గా నీ వలపు కోరుకుంటే.


• ఎల్లలు దాటిన   నా  మనసు కి

  నీ  మౌనమే నాకు శిక్ష  

  మన ప్రేమ యే నాకు శిక్షా.

• ఆకాశం వర్షించే

  ఆలాపన హర్షించే

• ఎదలోతులు వికసించే

  ప్రేమేమో చిగురించే.

• ఇది యే సంతమో 

  ఇది యే వసంతమో.


YSR 5 Oct 2021 10:00 pm  






Monday, September 27, 2021

91. ”శ్రీ” చరితం

 

         ”శ్రీ” చరితం



• ఎందుకో తెలియదు ఇది జీవితంలో ఒక అందమైన అనుభవం, జ్ఞాపకం… పేపర్ పై రాయాలని అనిపించింది ... ఒక మంచి కథ అవుతుందనుకున్నాను. కానీ రాయడం అనే అనుభవం లేని నేను , నాకు తోచిన విధంగా రాసుకున్నాను…అని మనసు లో అనుకుంటూ రాయడం మొదలు పెట్టింది సరిత.

🌷🌷🌷🌷🌷

• సరిత తను దిగాల్సిన స్టేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి లగేజీ అంతా సర్దుకుని ట్రైన్ దిగడానికి సిద్ధం గా ఉంది. ఇంతలో స్టేషన్ రానే వచ్చింది. అక్కడ ట్రైన్ పది నిమిషాలు అగుతుంది కాబట్టి, కాస్త నిధానంగా దిగుదామని అనుకుంది. స్టేషన్ అంతా వచ్చిపోయే ప్రయాణికులతో సందడిగా ఉంది. ట్రైన్ దిగిన, సరితకు ఫోన్ రావడంతో , ఒక పక్కగా వచ్చి, ఫ్లాట్ ఫామ్ మీద నిలబడి మాట్లాడుతుంది. ఇంతలో హలో మేడం, అని ఎవరో పిలిచినట్లు అనిపించింది, సరిత ఫోన్ కట్ చేసి , ఎవరా తనను పిలిచేది అని , పక్కకు తిరిగి ఆశ్చర్యంగా చూసింది ... అంతే ఊహించని ఆశ్చర్యం, ఒక్కసారిగా సరిత తను కళ్లు పెద్దవి గా చేసి….. శ్రీ కాంత్ అని అంటూ….తన చిన్ననాటి స్నేహితుడు శ్రీకాంత్ అక్కడ కనిపించేసరికి ఒక్కసారిగా సంతోషంతో ఓయ్.. నువ్వేంటి ఇక్కడ అని అడిగింది సరిత. వెంటనే శ్రీకాంత్ ఇది మా ఊరు, ఒక ఫ్రెండ్ ని, ట్రైన్ ఎక్కించడానికి వచ్చాను. వెళ్తూ వెళ్తూ నిన్ను చూసేసరికి, అరె సరితలా ఉందే, సరితే కదా అని సందేహం తో నిన్ను పలకరించాను. నువ్వు గుర్తు పట్టేసరికి హమ్మయ్య అనిపించింది.

• ఇలా నిన్ను చూసి ఎన్ని సంవత్సరాలయ్యింది, నువ్వేమీ మారలేదు సరిత , అలాగే ఉన్నావు. ఈ రోజు నిన్ను ఇలా చూస్తానని అనుకోలేదు అంటూ, తన ఆనందం అంతా మాటల్లో చూపించేస్తున్నాడు శ్రీకాంత్. కాఫీ అయినా ఇప్పిస్తావా లేక ఇలాగే నిలబెట్టి మాట్లాడెస్తావా అని సరిత అడిగేసరికి, సారీ సరిత అంటూ, అక్కడే ఉన్న కేంటీన్ లోకి వెళ్ళి కూర్చున్నారు ఇద్దరూ. ఊ... ఇప్పుడు చెప్పు " శ్రీ" ఏం చేస్తున్నావు, చెప్పు చెప్పు అని సంతోషం గా అడిగింది, సరిత. “ శ్రీ “ అని నువ్వు మాత్రమే పిలుస్తావు సరిత ... నువ్వు ఏదీ మర్చిపోలేదు అని చిన్నపిల్లాడిలా సంబరంగా అన్నాడు.

🌷🌷🌷🌷🌷

• ఇంతలో కాఫీ వచ్చింది. నవ్వేస్తూ కప్ తీసుకుంటూ ఇంకేంటి చెప్పు అంది సరిత. శ్రీకాంత్ ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయాడు...

• సరిత, శ్రీకాంత్ స్కూల్ నుండి డిగ్రీ కాలేజ్ వరకు కలిసే చదువుకున్నారు. వాళ్ళ ఇళ్ళు కూడా దగ్గర్లోనే ఉండేవి. చిన్నప్పటి నుండి శ్రీకాంత్ ఎప్పుడూ ముభావంగానే ఉండేవాడు, అందరితో కలవ లేక పోయేవాడు, అంతో ఇంతో సరిత తోనే మాట్లాడే వాడు. సరిత స్వభావం వేరు, తనకు నచ్చితే , వాళ్ళతో ఇట్టే స్నేహం చేసేస్తుంది. సరదాగా కలిసిపోతుంది. ఈ స్వభావమే బహుశా శ్రీకాంత్ కు, సరితలో నచ్చిందేమో, తనతో స్నేహంగా ఉండేవాడు. కాని ఏదో తెలియని బిడియం అయితే ఉండేది. కానీ సరిత అంటే ఇష్టం కూడా ఉండేది. చదువులు అయిపోయాక ఎవరి దారులు , వాళ్ళవి అయిపోయాయి. మళ్ళీ సరితను ఇంత కాలానికి ఇలా చూస్తానని అనుకోలేదు , అని మనసు లో శ్రీకాంత్ అనుకుంటున్నాడు.

• సరిత పిలవడంతో ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఏంటి అబ్బాయ్ ఎక్కడికి వెళ్ళి పోయావు మళ్ళీ చిన్నతనంలోకి వెళ్ళిపోయావా? అని సరిత అంటుంటే, అవును సరిత” నిన్ను చూసేసరికి మళ్ళీ ఆ జ్ఞాపకాలు అన్ని గుర్తొచ్చాయి, అంటూ, ప్రస్తుతం తను ఏం చేస్తున్నది, తన కుటుంబ వివరాలు అన్నీ సరితకు చెప్పాడు శ్రీకాంత్. మరి నువ్వెక్కడ సరిత, నీ గురించి చెప్పు అనేసరికి ఆ ఏముంది, మామూలే అందరిలా, రోటీన్ జీవితం , మంచి కుటుంబం, ముగ్గురు పిల్లలు అని క్లుప్తంగా చెప్పింది సరిత. బంధువుల పెళ్ళికి వెళ్తూ ఇలా ఇక్కడ దిగి, వేరే ట్రైన్ మారాల్సి వచ్చింది, “శ్రీ” అని సరిత అనగానే, సరే నువ్వు ఎక్కవలసిన ట్రైన్ ఎక్కించి వెళ్తా అన్నాడు ”శ్రీ”. సరే అనేసింది సరిత. ఇన్నాళ్ళకు “శ్రీ” ని చూసేసరికి సరితకు తనతో, ఇంకా మాట్లాడాలి అని చాలా కుతూహలంగా అనిపించింది. ఇంతలో తను ఎక్కాల్సిన ట్రైన్ కూడా చాలా ఆలస్యంగా వస్తుందని, అని రైల్వే స్టేషన్ లో చెప్పారు. మామూలుగా అయితే అంత వెయిటింగ్ ను చిరాకుగా భరించేదేమో, కాని సరిత కు ఇప్పుడు అది సంతోషంగా అనిపిస్తుంది.

• “శ్రీ” వెంటనే, అంత సేపు ఈ స్టేషన్ లో వెయిటింగ్ ఎందుకు, నాకు నచ్చిన ప్రదేశం ఒకటుంది, ఇక్కడికి చాలా దగ్గర, నిన్ను తీసుకెళ్తాను సరేనా అనేసరికి, ఎక్కడికి , అని అడిగింది సరిత. శ్రీకాంత్ తను తీసుకువెళ్లాలి అనుకునే ప్రదేశం గురించి చెప్పగానే, సరిత ఒప్పుకునేసరికి “శ్రీ” సంతోష పడిపోయాడు.

🌷🌷🌷🌷🌷

• లగేజీ మొత్తం క్లాక్ రూం లో పెట్టి , స్టేషన్ బయటకు వచ్చారు. శ్రీ తన బైక్ తీసుకొచ్చాడు. ఇద్దరు బయలు దేరారు, దారిలో అంతా చూపిస్తూ చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు “శ్రీ”. సరిత మనసులో అనుకుంటుంది, చిన్నప్పుడు ఎంత బిడియం గా, సిగ్గు గా ఉండేవాడు. ప్రక్కన కూర్చున్న ముడుచుకు పోయేవాడు అని తలచుకొని మనసులోనవ్వుకుంది సరిత. ఇంతలో తీసుకెళ్తానన్న ప్రదేశం రానే వచ్చింది. అది అందమైన గోదావరి తీరంలోని ఘాట్. ఇద్దరూ బైక్ దిగి నడుచుకుంటూ ఘాట్ లోపలికి వెళ్తే అద్భుతంగా ఉంది. పరవళ్లు తొక్కుతున్న విశాలమైన గోదావరి, తీరం అంతా నడవడానికి అనుకూలంగా అందమైన టైల్స్ వేసారు. అక్కడక్కడ రంగు రంగుల సిమెంట్ బెంచీలు , చుట్టూ చెట్లు, మధ్య మధ్యలో క్రోటన్ మొక్కలు, ఇంకా రకరకాల పూల మొక్కలు, పచ్చని మెత్తని లాన్, తీరం లో ఉన్న నావలు, ఒక ప్రక్క గోదావరి నీరును తాకుతూ ఉన్న అమ్మవారి దేవాలయం, గోదావరి లో దూరం గా వెళ్తున్న పడవ, ఆకాశం అంతా మేఘాలతో నీలివర్ణమయం, ఎంత బావుందంటే చూడడానికి సరితకు రెండుకళ్ళు సరిపోలేదు. సరితకు ఆ ప్రదేశం చూస్తుంటే మనసు సంతోషంతో పురి విప్పి నాట్యం చేసే నెమలిలా అనిపిస్తుంది.

• “శ్రీ” మృదువుగా, నెమ్మదిగా చెప్తున్నాడు, ఇది నాకు చాలా ఇష్టమైన ప్రదేశం, రోజు లో ఒకసారి అయినా ఇక్కడ ఏకాంతం గా పదినిమిషాలు కూర్చొని వెళ్తుంటా, అని ఇంకా ఏదే ఏదో చెప్తూ తన పక్కనే నడుస్తున్నాడు. నిజంగా ఆ వాతావరణం, అలా చూసేసరికి “సరిత” కు చెప్పలేని ఆనందం అనిపించింది. ఇద్దరూ ఒక సిమెంట్ బెంచీ పై పక్క పక్కనే కూర్చున్నారు. చల్లని ఆహ్లాదకరమైన గోదావరి గాలి, “శ్రీ” ని తాకుతూ , సరిత ముంగురులు తాకుతూ ఉంటే, సరితకు అది ఒక పారిజాతపు పరిమళంలా మనసులో అనిపిస్తుంది. “శ్రీ” ముఖం అయితే ఆనందంతో వెలిగిపోతుంది. “శ్రీ” ఎప్పుడూ అనుకోలేదు. ఇలా తనకు ఇష్టమైన వ్యక్తితో, ఇష్టమైన ప్రదేశంలో కూర్చుని మాట్లాడే అవకాశం వస్తుందని. సరిత కి కూడా అలానే ఉంది.

• ఇద్దరూ ఏ మాత్రం గమనించలేదు, ఊహించలేదు. అప్పటికే ఆకాశం మేఘలతో , కారు మబ్బులతో నిండిపోయింది. వర్షం వచ్చేలా ఉంది, సరిత భయపడుతూ వెళ్ళిపోదాం ‘శ్రీ’ అంది. శ్రీకాంత్ ధైర్యం చెప్తూ, నిన్ను క్షేమంగా ట్రైన్ ఎక్కిస్తా, సరేనా ఇప్పడు ఈ అందమైన వాతావరణం ఎంజాయ్ చెయ్యి, అని భరోసా ఇచ్చేసరికి, నెమ్మదిగా వర్షం మొదలయ్యింది. వర్షం గోదావరి మీద కురవడం సరిత నిజ జీవితం లో, ఎప్పుడూ చూడలేదు. ఇలాంటి అరుదైన అందమైన అనుభవాలు అందరి జీవితాల్లో రావు దానికి కూడా అదృష్టం ఉండాలి, అని ఒక మంచి జ్ఞాపకం గా మార్చుకుంది సరిత. ఇద్దరూ అప్పటికే వర్షం లో కొంచెం తడిచి పోయారు, నెమ్మదిగా అక్కడే ఉన్న అమ్మవారి దేవాలయం లో కి వెళ్ళి నిలబడ్డారు.

🌷🌷🌷🌷🌷

• “శ్రీ” మాట్లాడుతున్నాడు, ఆ క్షణం, ఆ సందర్భం, ఆ సమయం, ఆ ప్రదేశం, ఆ వాతావరణం అంతా మరచి పోయి, కాసేపు “శ్రీ” కి ఏమీ తెలియనట్టుగా అయిపోయి, విచారం వదనంతో మాట్లాడుతున్నాడు. చిన్నప్పటి నుండి తన మనస్సులో దాగి ఉన్నదంతా ప్రవాహంలా వచ్చేస్తుంది. “శ్రీ” ఇంత ఎలా దాచుకున్నాడో , అవును లే తాను కాదు కదా, తన మనస్సు మాట్లాడుతుంది…. అనుకుంది సరిత. వర్షం పెద్దదయ్యింది, “ శ్రీ” తన పట్ల చిన్నప్పటి నుండి పెంచుకున్న ఇష్టం, స్నేహం, ప్రేమ అన్నీ చెప్పాడు. సరిత వింటూనే ఉంది. తనకు కూడా తెలియదు, ఒక మనిషి పట్ల ప్రేమ ఉంటే, ఆరాధన ఇలా ఉంటుందా, ఇంతగా ఉంటుందా... తనకు అసలు ఎలా స్పందించాలో కూడా తెలియలేదు కానీ బాధ మాత్రం విపరీతంగా అనిపించింది. ఇంతలో వర్షం తగ్గిపోయింది. అంతా నిధానంగా విన్న సరిత ఏమీ మాట్లాడక పోయేసరికి, “ శ్రీ “ ముఖం చిన్నబోయింది. అక్కడినుంచి అయిష్టంగానే స్టేషన్ కి బయలుదేరాడు. ఇద్దరూ స్టేషన్ కు చేరారు. మౌనంగా ఉన్నారు ఇద్దరూ, ఇంతలో సరిత ట్రైన్ వచ్చింది . సరిత తన కోచ్ లో ఎక్కి కిటికీ పక్కన కూర్చుంది. అక్కడ ఫ్లాట్ ఫామ్ మీద షెల్టర్ లేదు. ఇంకా నెమ్మదిగా వర్షం పడుతూనే ఉంది. “శ్రీ” తడుస్తూనే ఉన్నాడు. ట్రైన్ నెమ్మదిగా కదిలింది, వెళ్ళిపోతుంది. “శ్రీ” కళ్ళల్లో కన్నీళ్లు వర్షంలో కలిసిపోతున్నాయి. అంత దుఃఖం శ్రీకాంత్ కు ఎప్పుడూ రాలేదేమో అని సరిత “ శ్రీ “ ని చూస్తూ అనుకుంది. “శ్రీ” మాత్రం పుట్టినప్పుటి నుండి, నిత్యం అనుభవించే, అలవాటైన దుఃఖమే కదా అనిపించింది. కానీ ఆ దుఃఖం తట్టుకునే శక్తి , “శ్రీ” శరీరానికి గాని, మనసుకు గాని లేవు. ఎందుకంటే “శ్రీ” ఇంకా ఎంతో కాలం, ఈ భౌతిక ప్రపంచంలో ఉండడని తనకు మాత్రమే తెలుసు.

• ఆనాటి నుండి సరితకు తన మనసు ని, “శ్రీ” లాక్కొని వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తూ ఉండేది. కొన్ని కొన్ని ఆందోళనలు, భయాలు, ఆలస్యాలు ఎవరి జీవితానైనా మార్చేస్తాయేమో కానీ, ఒకరి పై ఇష్టం, ప్రేమ ఒకసారి కలిగితే, ఆ మనిషి ఉన్నా, లేకపోయినా ఎప్పటికి పోవు కదా, అని మనసుకు సమాధానం చెప్పుకునేది సరిత. “శ్రీ” చాలా, చాలా బావుండాలి, “శ్రీ” జీవితంలో ఏ వెలితి ఉండకూడదు, సంతోషంగా ఉండాలి, ఇంత కంటే ఇంకేమి ఇవ్వగలను తన చిన్ననాటి నేస్తం లోని ప్రేమకి, అని సరిత అనుకునేది……కానీ “శ్రీ” జీవితంలో వెలితే “సరిత” నాటికి, నేటికీ, ఉంటే మరు జన్మకి.


25 sep 21  


Wednesday, September 22, 2021

90. మనిషి భాష…. మనసు భాస


మనిషి భాష…. మనసు భాస


• మనిషి భాష మనిషికి ఎరుక,
  మనసు భాస ఎవరికి ఎరుక.
  మనిషి భాష మనిషికి ఎరుక,
  మనసు భాస ఎవరికి ఎరుక…..

• మనిషి ఉన్నది మనిషి కోసం,
  మనసు ఉన్నది ఎవరి కోసం.
  మనిషి ఉన్నది మనిషి కోసం,
  మరి మనసు ఉన్నది ఎవరి కోసం…..

• మనిషి లో న మనసు ఉంటే,
  మనసు లో మనిషి ఉన్నాడా
  మనిషి లో న మనసు ఉంటే,
  మరి మనసు లో మనిషి ఉన్నాడా…..

🌱🌱🌱🌱🌱

• మనిషి భాష మనిషికి ఎరుక,
   మనసు భాస ఎవరికి ఎరుక

• కనుల ముందు జీవితం,
  కావ్యమే అయితే కనుక.
  కనులు ముందు జీవితం,
  కావ్యమే అయితే కనుక.
  కంటి వెనుక జీవితం, కాష్ఠమే అవునా…కాదా..

• ఎదురు చూసిన క్షణాలన్ని,
   ఆవిరే అవుతూ ఉంటే.
   ఎదురు చూసిన క్షణాలన్ని,
   ఆవిరే అవుతూ ఉంటే.
   ఎదురయ్యే వన్ని కూడా,
   ఎండమావు లే గా…..

🌱🌱🌱🌱🌱

• మనిషి భాష మనిషికి ఎరుక,
  మనసు భాస ఎవరికి ఎరుక.

• జననమన్నది జన్మకు ఒకటే,
  మరణమన్నది మనిషి కి ఒకటే.
  జననమన్నది మనసు కు లేదు, 
  మరణమన్నదిి మనసు కు రాదు.

• నావ లోని ప్రయాణమంతా,
  ఊయలై సాగుతూ ఉంటే.
  నావ లోని ప్రయాణమంతా,
  ఊయలై సాగుతూ ఉంటే.
  నా లోని ప్రయాణమంతా,
  అలలు గా సాగుతు ఉంది.

• చుక్కాని లేని నావ,
  చుక్కాని లేని నావ ,
  ఏ తీరం చేరునో…..
  చక్కని అయిన మనసు కి,
  యేల తెలుస్తూ ఉంది.
  చక్కని అయిన మనసు కి,
  యేల తెలుస్తూ ఉంది.

🌱🌱🌱🌱🌱

• మనిషి భాష మనిషికి ఎరుక,
   మనసు భాస ఎవరికి ఎరుక.

• నీ నడక ఎంత దూరమైనా,
  నీ నడక ఎంత భారమైనా,
  నీ నడక ఎందరి తో సాగినా,
  నీ అడుగులు నీ వే లే……నీ అడుగులు నీ వే లే

• నీ బంధం ఎందరి తో ఉన్నా,
  నీ బంధం ఎవరి సొంతమో అనుకున్న,
  నీ మనసు నీ దే లే,
  నీ మనసు నీ దే లే.

• ప్రేమ లేని జీవిత మంటే,
  ప్రేమ లేని జీవిత మంటే.
  నీడ లేని నిరీక్షణే గా,
  నీడ లేని నిరీక్షణే గా.

• మనిషి నెంత తాకితే,
  మనసు నెంత సాకితే.
  మనిషి నెంత తాకితే,
  మనసు నెంత సాకితే......
  మనిషి మనసు తోడై రాదా….
  మరు జన్మకు నీడై రాదా…..
  మనిషి మనసు తోడై రాదా….
  మరు జన్మకు నీడై రాదా…..

• మనిషి భాష మనిషికి ఎరుక,
  మనసు భాస ఎవరికి ఎరుక.

YSR...9293926810…18 sept 21 , 10:30 pm.

Sunday, September 19, 2021

89. ఓయ్ నిన్నే నిన్నే

 

                   ఓయ్ నిన్నే నిన్నే


• ఓయ్ నిన్నే నిన్నే

  ఏయ్ నిన్నే నిన్నే  

  వినిపిస్తుందా ... నా మాట వినిపిస్తుందా.


• కోపమా ... కోమలమైన కోమలాంగికి 

  కోపమా చిరు తాపమా.


• విసురుగా చూసే నీ చూపులతో 

  విరహం చూపిస్తూ  

  విల్లును సంధిస్తావా.


• ప్రియా ఓ ప్రియా … నిన్నే నిన్నే ఓయ్ నిన్నే

• నీ మనసు నే  దోచలే 

  నా ప్రేమ నే  దాచలే

  అదియే శాపమా.


• నీ వలపుల గాలంతో 

  తగిలిన మన్మధ బాణానికి 

  విలవిలలాడే ... నా మది కలవరమాయే.


• ఎందుకీ మౌనం 

  ఏమిటీ కోపం

  ఓయ్ నిన్నే నిన్నే వినిపిస్తుందా.


• బంథమే అనుబంధమైతే 

   జననమొక యోగం.

• అనుబంధమే ఆత్మబంధమైతే 

   జన్మమొక భోగం.


• మనది యోగమా 

  భోగమా ... ప్రియా ఓ ప్రియా.


• రుసరుసలాడే నీ రూపాని కే 

  ఎగసి పడినె నా సంతోషం.

 చిర్రుబుర్రుల చిన్న దానా ...  ఓ చిన్న దానా.


• ఓయ్ నిన్నే నిన్నే వినిపిస్తుందా ... వినిపిస్తుందా.

• నా భుజము నే తట్టినా 

  నీ చేయికై  ఈ చేయి 

  ఎంత  చేసెనో,  రాసెనో.


• మరి మనిషి నెంత తాకితే

  మనసు నెంత సాకితే 

  ఇంకేమి అధ్బుతం జరుగునో  

  జరుగునో  .... ప్రియా ఓ ప్రియా.


YSR 19 Sep 2021 6:30 am.









88. ఎదురు చూపుల క్షణాలు

 

ఎదురు చూపుల క్షణాలు


• నది కనపడని మదిలో 

  నీరు ఎక్కడిదో

  ఇంత కన్నీరు ఎక్కడిదో.


• పొంగి పొరలుతున్న నీరు

  కంటి పొరలలో  

  ఎక్కడ దాగి ఉందో.


• మదిలోని మదనం “ఆవిరై” 

  కంటి లోని “కలవరంతో” కనపడె 

  నీ రూపం  కన్నీటి స్వరూపం.


• సముద్రం లో  నీరంతా    ఉప్పే అయితే

  నా కంటి   వెనుక 

  ఎంత లోతైన   సముద్రం ఉందో.


• తియ్యని మనసులకేనా 

  ఇంత ఉప్పుటి   నీరు   కన్నీరు.


• కంటజారే  కన్నీరు  తొలిసారి 

  నా పై  కనికరం   చూపిస్తుంది.


• ఎందుకంటే     ఎందుకంటే

• చెలి  చేరువతో   కన్నీరు

  నా కన్నీరు  అమృతం  కురిపిస్తుంది.


• ఈ అమృతం తో   మృత్యువే  లేదు 

   నా హృదయానికి


• కనులు  తెరిచి  చూస్తే…

  కలలోని చెలి   కంటి ముందు లేదు…

  కాని…..కానీ…. 

  కంటనీరు మాత్రం   ఉప్పగా   కా రు తూ నే....

  కా రు తూ నే   ఉంది.

  సన్నగా….చెమ్మగా…ముద్దగా.


Gift of God on auspicious Day.


18 sept 6:30pm… YSR.








Sunday, September 12, 2021

87. ఆలోచనల తో.. నీ......జీవితం లో... నీ...ఆలోచనలు

 

ఆలోచనల తో.. నీ......జీవితం  లో... నీ...ఆలోచనలు



·        ఒక మనిషి వ్యక్తిత్వాన్ని ఈ బాహ్య ప్రపంచానికి పరిచయం చేసే అద్భుతమైన పదాలు ఆలోచన,  జీవితం.  ఈ రెండు ఒకటేనా అంటే, ప్రతి ఒక్కరు ఇచ్చే సమాధానం ఒకటే...ఆలోచన లే జీవితం అంటారు.  కానీ , నాకు మాత్రం ఆలోచనా సరళి మీదే జీవితం ఆధారపడి నడుస్తుంది అనేది పూర్తిగా నిజం కాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మనిషి తన ఆలోచనలను ఏ విధంగానైనా ఆలోచించుకోవచ్చు , కానీ దానిని అమలు పరచడం అనేది మనిషికి కృషి, స్థితి , గతి మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఆలోచన కార్యరూపం దాల్చలేదు. ఆలోచన అనేది మనిషి మేధస్సును సూచిస్తుంది. కానీ ఆ ఆలోచన అనేది మాట రూపంలో గానీ , చేతల రూపంలో గానీ అమలు జరిగినప్పుడే అర్థం, పరమార్థం ఉంటుంది .

·        మనిషి ఉదయం నిద్రలేచిన నుండి రాత్రి పడుకునే వరకూ, కొన్ని సార్లు, నిద్రలో కూడా నిరంతరం ఆలోచన చేస్తూనే ఉంటాడు.  కానీ వాస్తవిక జీవితంలో చూస్తే చాలా మందికి ఆలోచన వేరు,  జీవితం వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచనలనేవి  వాస్తవికత , నిజం , సాధ్యం,  అసాధ్యం ఇలా ఎన్నో అంశాలతో ముడిపడి ఉంటుంది.   ఇక జీవితం అంటే పరిస్థితులు, శైలి , అలవాట్లు మనిషితో ఉండే సాటి మనుషుల ప్రభావంతో నడుస్తుంది.  అంటే మనిషికి జీవితంలో చేస్తున్న కర్మలు, పనులు మాత్రమే కేవలం ఆలోచనలు గా ఎవరికీ, ఎప్పటికి ఉండవు.  ఆలోచనలు అనేవి ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితానికి అతీతంగా మాత్రం చాలా వరకు తప్పక ఉంటాయి. ఒక ఆలోచనలో నిజం ఉంటుంది, ఊహా ఉంటుంది, నటన కూడా ఉంటుంది.

·        ఒక మనిషి కి ఆలోచన ద్వారా వచ్చిన వాక్కు (మాట)  మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కొంతవరకు నిర్ణయిస్తుంది అనడం లో సందేహం ఏమీ లేదు కానీ , మనిషి జీవితం ఇందుకు భిన్నంగా చాలా సార్లు ఉంటుంది. ఒక ఆలోచన అనేది తరంగం (wave) అయితే , దాని ప్రకంపనలు అనేవి emotions, feelings అవుతుంటాయి.

·        ఆలోచనలకి మూలం మనసు. కానీ మనస్సు అనేది మనిషికీ పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఏ వయసులో, ఏ సమయంలో, ఎలా స్పందిస్తుందో భగవంతుడికి కూడా అర్థం కాదు. అందుకేనేమో భగవంతుడు కూడా మనిషికి ఆలోచనలతో చేసిన కర్మలను బట్టి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ గమనించవలసినది మనిషి శరీరంలో ప్రతి అవయవానికి ఒక నిర్దిష్టమైన పరిమాణం,  అలాగే శరీరానికి కొలత కొలమానం ఉంటాయి. కానీ  మనసుకు,, మనసులోని ఆలోచన మాత్రం  ఇవేమి ఉండవు.

·        కొందరికి ఆలోచనలు స్థిరంగా , దృఢంగా ఉన్నా  జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది, అది పరిస్థితుల ప్రభావం.   మరికొందరికి జీవితం మంచి స్థిరత్వం తో ఉన్నా ఆలోచనలు మాత్రం అల్లకల్లోలంగా ఉంటాయి.  కంటికి కనిపించని సూక్ష్మజీవులు ప్రకృతిలో ఎలా ఉన్నాయో అదేవిధంగా మనకే తెలియని సూక్ష్మాతి సూక్ష్మమైన అంశంగా ఈ ఆలోచన జీవితం ను పేర్కొనవచ్చు.

·        అప్పుడప్పుడు ఆలోచిస్తుంటే ఒకటి మాత్రం అనిపిస్తుంది, మనిషి జన్మతః మహానటుడు. క్యాలిక్యులేటర్ అనేది కేవలం గణితంలో అంశాలను మాత్రమే గణాంకం చేయగలదు, కానీ మనిషి మెదడు లోని ఆలోచన అన్నింటికీ అతీతంగా అవసరాలు,  సందర్భాలు,  పరిస్థితులను బట్టి ఎత్తులు,  పై ఎత్తులూ వేయడం ఒకటేంటి ఇలా ఎన్నో అంశాలను క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. చెప్పాలంటే ఇదే  మనిషి అసలు సిసలైన ఆలోచన జీవితం.  ఇందులోనే జననం మరణం,  ప్రేమలు ద్వేషాలు,  ప్రతీకారం సహాయం,  మిత్రత్వం శత్రుత్వం,  బంధాలు,  సంతోషం దుఃఖం,  అబద్దాలు నిజాలు అన్నీ కలగూర లాగా వీటితో మిళితం అయిపోయి ఉంటాయి.

·        వడకట్టి నీరు శుభ్రమై మంచినీరై,  మనిషి ఆరోగ్యానికి ఎంత దోహదం చేస్తుందో,  అలాగే వడకట్టి ఆలోచన కూడా,  అంటే మలినం లేని  ఆలోచన మనిషి జీవితానికి తేజస్సు అవుతుంది అనడంలో,  ఏమాత్రం సందేహం లేదు.   ఆలోచనలు శక్తివంతంగా, తేజోవంతంగా ఉండాలంటే చేయవలసినది  ఒకటే,  మెదడుకి విశ్రాంతినివ్వడం, దీనినే ధ్యానం అంటారు.  శరీరాన్ని మెలకువగా ఉంచి మెదడుకు విశ్రాంతి ఇస్తే,  నీలో సమస్త విశ్వం , భూమి, ఆకాశం,  ప్రకృతి,  నక్షత్రాలు, తోకచుక్కలు,  గ్రహాలు విశ్వమంతా కనిపిస్తుంది.  అదే మనిషికి అసలు సిసలైన చిరునామా.

·        ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం ద్వారా వచ్చే ఆలోచనల కంటే కూడా ధ్యానం ద్వారా వచ్చే ఆలోచనలు చాలా శక్తివంతంగా వుండి,  జీవనం మార్గదర్శకం అవుతుంది.   జీవితాన్ని అనుభవిస్తూ ఉండడం ద్వారా కలిగే ఆలోచనలలో   సమతుల్యం  ఎన్నటికీ ఉండదు.   ఏదో ఒక అసంతృప్తి, emotional inbalance ఉంటుంది.  అదే ధ్యానశక్తి తో వచ్చే ఆలోచనలలో దేహానికి సరిపడా సమతుల్యం కలిగి,  హార్మోనులను, జీవన క్రియలు metabolism, catabolism) సజావుగా జరగడం తో పాటు మంచి జీవనం,  జీవితం ఉంటాయి.

·        సహజంగా మనిషి ఆలోచనలో ఉండేది ఒకటి మాట్లాడేది మరొకటి…. జీవితంలో చేసేది ఇంకొకటి….. ఇది మనిషికి తెలియకుండానే ( అంటే తన గురించి తాను ఆలోచించుకో లేక,  గమనించుకో లేక )  నిరంతరం అలవోకగా జరుగుతున్న  జీవన ప్రక్రియ ...ఔనన్నా,  కాదన్నా ఇది నిజం.

·          ఒక మనిషికి శరీరం,  జీవితం రెండూ బలహీనంగా ఉన్నా  ఆలోచన స్థిరమైనది,  బలమైనది అయితే మాత్రం మరణం వరకూ అత్యుత్తమం గా సాగుతుంది. 

·         మనిషి తన  ఆలోచనని  గొప్పగా ను,  ఉన్నతంగాను  అదే విధంగా అత్యల్పంగానూ ఉంచుకోనవసరం లేదు. కేవలం సమతుల్యంతో ఉంచుకుంటే చాలు...అప్పుడు ప్రకృతే నిర్ణయిస్తుంది,  మనిషి జీవితాన్ని స్థాయికి తీసుకు వెళ్ళాలి అనేది.

 

Yedla Srinivas Rao 9293926810,  12 sep 21 6:30 am.

 

 

588. కలియుగ కురుక్షేత్రం

  కలియుగ  కురుక్షేత్రం • కురుక్షేత్రం  ఎక్కడ జరిగింది  అంటే,  వెంటనే మనం అనుకునేది   మహాభారతం లో  అని.  ఇంకా  అది పాండవులకు,  కౌరవులకు  జరిగ...